Bhimaa movie pre release business: 'భీమా' మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్.. గోపీచంద్ ముందున్న టార్గెట్ ఇదే.. ?

Bhimaa movie pre release business: మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'భీమా'. ఈ చిత్రంలో  మరోసారి పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకుంది. వరల్డ్ వైడ్‌గా మరికొన్ని గంటల్లో విడుదల కానున్న ఈ సినిమా అన్ని ప్రాంతాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ పూర్తి చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 7, 2024, 02:18 PM IST
Bhimaa movie pre release business: 'భీమా' మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్.. గోపీచంద్ ముందున్న టార్గెట్ ఇదే.. ?

Bhimaa movie pre release business: గోపీచంద్ హీరోగా ఒక హిట్ అందుకునేలోపే .. మూడు ఫ్లాపులు పలకరిస్తున్నాయి. కెరీరర్ పరంగా వరుస ఫ్లాపులున్న తన కున్న మాస్ యాక్షన్ ఇమేజ్ కారణంగా టాలీవుడ్‌లో హీరోగా సత్తా  చూపెడుతునే ఉన్నాడు. మాస్ హీరో ఇమేజ్ గోపీచంద్‌కు అడ్వాంటేజ్ అని చెప్పాలి. 'సీటీమార్' తర్వాత ఎన్నో అంచనాల మధ్య విడుదలైన మారుతి 'పక్కా కమర్షియల్‌' మూవీ పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత చేసిన 'రామబాణం' సినిమా రొటీన్ ఫ్యామిలీ డ్రామా కావడంతో ప్రేక్షకులను ఈ సినిమాను తిరస్కరించారు. దీంతో ఇపుడు కొత్త దర్శకుడు హర్ష  డైరెక్షన్‌లో తనకు అచ్చొచ్చిన యాక్షన్ జానర్‌లో 'భీమా' సినిమాతో ఈ మహా శివరాత్రికి పలకరించబోతున్నాడు.  

ఈ మూవీలో గోపీచంద్ మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో రఫ్ఫాడించబోతున్నాడు. మరోవైపు 'భీమా' టైటిల్‌తోనే ఈ మూవీపై మాస్ వైబ్రేట్స్ క్రియేట్ చేసాడు. మరోవైపు ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఓ రేంజ్‌లో మాస్‌ను మెప్పించే విధంగా ఉంది.  ఈ సినిమాలో హింసాత్మక దృష్యాలు కారణంగా ఈ మూవీకి 'A' సర్టిఫికేట్ జారీ చేశారు. ఇక ఈ సినిమా ఏరియా వైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే..

తెలంగాణ (నైజాం).. రూ. 3.50 కోట్లు..
రాయలసీమ (సీడెడ్).. రూ. 1.5 కోట్లు..
ఆంధ్ర ప్రదేశ్ .. రూ. 4.50 కోట్లు..
తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి రూ. 9.50 కోట్లు
కర్ణాటక + రెస్ట్ ఆఫ్ భారత్ + ఓవర్సీస్ కలిపి రూ. 1.8 కోట్లు..
టోటల్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 11.30 కోట్లు..

'బీమా' సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ అనిపించుకోవాలంటే రూ. 12 కోట్ల షేర్ రాబట్టాలి. మహా శివరాత్రి ప్లస్ మాస్ సినిమా కాబట్టి ఈ సినిమాకు పాజిటిట్ టాక్ వస్తే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకునే అవకాశాలున్నాయి.

అంతేకాదు చాలా రోజులు తర్వాత గోపీచంద్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించడం ఈ సినిమాకు ప్లస్. గోలీమార్ సినిమా తర్వాత ఆ రేంజ్‌లో గోపీచంద్ యాక్షన్ ఈ సినిమాలో ఉందని ఇన్‌సైడ్ టాక్. ఈ సినిమా మహా శివరాత్రి కానుకగా మరికొన్ని గంటల్లో విడుదల కానుంది. ఈ మూవీ శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మించారు. ఈ మూవీలో నాగ చైతన్య 'ధూత' ఫేమ్ ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించింది. అంతేకాదు మాళవిక శర్మ, నిహారిక కొణిదెల ఇంపార్టెంట్ రోల్స్‌లో యాక్ట్ చేశారు. ఈ చిత్రానికి కేజీఎఫ్, సలార్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించారు. ముఖ్యంగా పరీక్షల సీజన్‌లో విడుదల కాబోతన్న ఈ మూవీ గోపీచంద్‌కు మరో పవర్ఫుల్ కమ్ బ్యాక్ మూవీగా నిలుస్తుందా లేదా అనేది తెలియాంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.  

Also read: Ind vs Eng 5th Test: ఇండియా ఇంగ్లండ్ చివరి టెస్ట్ నేడే, ధర్మశాల పిచ్ రిపోర్ట్, ఇరు జట్ల బలాబలాలు ఇలా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News