Bhimaa Censor Talk Review: గోపీచంద్ 'భీమా' సెన్సార్ టాక్ రివ్యూ .. ఎలా ఉందంటే.. ?

Gopichand - Bhima censor talk review: మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'భీమా'. ఈ సినిమాలో మరోసారి పవర్ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్‌తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. మరి టాక్ ఎలా ఉందంటే.. ?

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 7, 2024, 08:24 AM IST
Bhimaa Censor Talk Review: గోపీచంద్ 'భీమా' సెన్సార్ టాక్ రివ్యూ .. ఎలా ఉందంటే.. ?

Gopichand - Bhima censor talk review: గోపీచంద్ కెరీర్.. మూడడుగులు ముందుకు.. ఆరడుగులు వెనక్కి అన్నట్టు ఒక హిట్టు వస్తే.. మూడు ఫ్లాపులు పలకరిస్తున్నాయి. ఈ రకంగా హీరోగా రేసులో వెనకబడుతున్నాడు. వరుస ఫ్లాపులున్న తన కున్న మాస్ యాక్షన్ ఇమేజ్ కారణంగా టాలీవుడ్‌లో హీరోగా సత్తా  చూపెడుతునే ఉన్నాడు. మాస్ హీరో ఇమేజ్ గోపీచంద్‌కు అడ్వాంటేజ్ అని చెప్పాలి. 'సీటీమార్' తర్వాత ఎన్నో అంచనాల మధ్య విడుదలైన మారుతి 'పక్కా కమర్షియల్‌' మూవీ పెద్దగా అలరించలేకపోయింది. ఆ తర్వాత చేసిన 'రామబాణం' సినిమా రొటీన్ ఫ్యామిలీ డ్రామా కావడంతో ప్రేక్షకులను అలరించడంలో విఫలమైంది. దీంతో ఇపుడు కొత్త దర్శకుడు హర్ష  డైరెక్షన్‌లో 'భీమా' సినిమాతో మహా శివరాత్రికి పలకరించబోతున్నాడు.  

ఈ మూవీలో గోపీచంద్ మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో రఫ్ఫాడించబోతున్నాడు. మరోవైపు 'భీమా' టైటిల్‌తోనే ఈ మూవీపై మాస్ వైబ్రేట్స్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. మరోవైపు ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఓ రేంజ్‌లో మాస్‌ను మెప్పించే విధంగా ఉంది. ఈ మూవీతో మరోసారి గోపీచంద్ బ్యాక్ బౌన్స్ అవుతాడా అనేది చూడాలి. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ వాళ్లు ఈ సినిమాలో హింసాత్మక దృష్యాలు కారణంగా ఈ మూవీకి 'A' సర్టిఫికేట్ జారీ చేశారు.

అంతేకాదు చాలా రోజులు తర్వాత పోలీస్ బ్యాక్ డ్రాప్ మూవీగా ఈ సినిమా ప్రేక్షకులను అలరించడం పక్కా అని చెబుతున్నారు. గోలీమార్ సినిమా తర్వాత ఆ రేంజ్‌లో గోపీచంద్ యాక్షన్ ఈ సినిమాలో ఉందని ఇన్‌సైడ్ టాక్. ఈ సినిమా మహా శివరాత్రి కానుకగా మరికొన్ని గంటల్లో విడుదల కానుంది. ఈ మూవీ శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో నాగ చైతన్య 'ధూత' ఫేమ్ ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటించింది. అంతేకాదు మాళవిక శర్మ, నిహారిక కొణిదెల కూడా  నటించారు. నటిస్తున్నారు. ఈ చిత్రానికి కేజీఎఫ్, సలార్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించారు. ముఖ్యంగా పరీక్షల సీజన్‌లో విడుదల కాబోతన్న ఈ మూవీ గోపీచంద్‌కు మరో పవర్ఫుల్ కమ్ బ్యాక్ మూవీగా నిలుస్తుందా లేదా అనేది చూడాలి.

Read More: Actress Kajal Agarwal: హీరోయిన్ కాజల్ అగర్వాల్ నడుముపై చెయివేసిన అభిమాని.. సోషల్ మీడియాలో రచ్చగా మారిన వీడియో ఇదే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News