Maheshbabu-Rajmouli Movie: మహేష్-రాజమౌళి సినిమా సెట్స్ పైకి వెళ్లబోయేది అప్పుడే..!

Maheshbabu Upcoming Movie: గుంటూరు కారం తర్వాత మహేష్ బాబు.. రాజమౌళితో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.  ఈ మూవీకి విజయేంద్రప్రసాద్‌ స్టోరీ అందిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్లనుందంటే?  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 2, 2024, 05:48 PM IST
Maheshbabu-Rajmouli Movie: మహేష్-రాజమౌళి సినిమా సెట్స్ పైకి వెళ్లబోయేది అప్పుడే..!

Maheshbabu-Rajmouli Movie Updates: సూపర్ స్టార్ మహేష్‌బాబు సంక్రాంతికి గుంటూరు కారం మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు. థమన్ సంగీతం అందించాడు. ఈ సినిమా తర్వాత మహేష్.. రాజమౌళి డైరెక్షన్ లో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఆఫ్రికా అడవుల బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమాకు రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్రప్రసాద్‌ స్టోరీని అందిస్తున్నారు. ఈ పాన్ వరల్డ్ సినిమా పూర్వ నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా ఎప్పుడు సెట్స్‌మీదకు వెళ్తుందోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, మార్చిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఈ మూవీపై వీర లెవల్లో అంచనాలు ఉన్నాయి. 

అంతేకాకుండా ఈ మూవీ బడ్జెట్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట చక్కెర్లు కొడుతోంది. ఈ మూవీ కోసం 1500 కోట్ల బడ్జెట్ ను కేటాయిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఓ టాలీవుడ్ హీరో సినిమాకు అంత బడ్జెట్ పెట్టడమంటే మామూలు విషయం కాదు. ప్రస్తుతం రాజమౌళి లొకేషన్‌ల వేటలో ఉన్నాడని టాక్. షూటింగ్‌కు ముందు రాజమౌళి ఒక ప్రత్యేక వర్క్‌షాప్‌ని ప్లాన్ చేయబోతున్నారట. మహేష్ బాబుతో పాటు మొత్తం టీమ్ కూడా హాజరుకానున్నారు. 'ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడి కథ’'గా ఉండబోతుందని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి చెప్పాడు. ముఖ హాలీవుడ్ స్టూడియో,  కెఎల్ నారాయణతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్నారు. హీరోయిన్, ఇతర నటీనటులను త్వరలోనే ఫిక్స్ చేసే అవకాశం ఉంది. 

Also Read: Samyuktha Menon: సంయుక్త మీనన్ పెళ్లి.. వైరల్ అవుతున్న న్యూస్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News