Get Well Soon SRK: ఆందోళన చెందుతున్న ఫాన్స్.. ట్విటర్‌ ట్రెండింగ్‌లో 'గెట్‌ వెల్‌ సూన్‌ షారుఖ్‌ ఖాన్'!

Shah Rukh Khan fans trend 'Get Well Soon SRK'. షారుఖ్‌ ఖాన్‌కు కరోనా వైరస్ మహమ్మారి సోకడంతో ఆయన ఫాన్స్ ఆందోళన చెందుతున్నారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 6, 2022, 12:01 PM IST
  • ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 55 మంది
  • ఆందోళన చెందుతున్న ఫాన్స్
  • ట్విటర్‌ ట్రెండింగ్‌లో 'గెట్‌ వెల్‌ సూన్‌ షారుఖ్‌ ఖాన్'
Get Well Soon SRK: ఆందోళన చెందుతున్న ఫాన్స్.. ట్విటర్‌ ట్రెండింగ్‌లో 'గెట్‌ వెల్‌ సూన్‌ షారుఖ్‌ ఖాన్'!

Shah Rukh Khan fans trend 'Get Well Soon SRK' : కరోనా వైరస్ మహమ్మారి ప్రస్తుతం బాలీవుడ్‌ను వణికిస్తోంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 55 మంది స్టార్లు కరోనా బారిన పడ్డారు.  ఇప్పటికే సీనియర్ హీరోయిన్‌ కత్రినా కైఫ్‌ కరోనా బారిన పడగా.. తాజాగా బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌కు సైతం కొరోనా సోకింది. ప్రస్తుతం ఆయన హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ ఇచ్చిన బర్త్ డే పార్టీనే బాలీవుడ్ స్టార్లకు మహమ్మారి సోకడానికి కారణం. 

మే 25న షారుఖ్ ఖాన్, అతని భార్య గౌరీ ఖాన్ సైతం కరణ్ జోహార్ బర్త్ డే పార్టీకి వెళ్లారు. అంధేరీలోని యష్ రాజ్ స్టూడియోస్‌లో గ్రాండ్ పార్టీ అనంతరం ప్రతి ఒక్కరు జలుబు, తలనొప్పి లాంటి కరోనా లక్షణాలతో బాధపడుతున్నారట. స్వల్ప లక్షణాలు కనిపించడంతో షారుఖ్ టెస్ట్ చేయించుకోగా కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది. ప్రస్తుతం ఆయన వైద్యుల సూచనలు పాటిస్తూ క్వారంటైన్‌లో ఉన్నారు. షారుఖ్ ఒక్కడికేనా లేదా అతని భార్య గౌరీకి కూడా వైరస్ సోకిందా అనేది తెలియాల్సి ఉంది. 

షారుఖ్‌ ఖాన్‌కు కరోనా వైరస్ మహమ్మారి సోకడంతో ఆయన ఫాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని సూపర్‌ స్టార్‌ అభిమానులు ప్రార్థిస్తున్నారు. మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను'. మా అందరి ఆశీస్సులు మీ వెంట ఉన్నాయి' అని ఒకరు కామెంట్ చేయగా.. 'త్వరగా కోలుకోండి కింగ్' అని ఇంకొకరు ట్వీటారు. దాంతో ట్విటర్‌ ట్రెండింగ్‌లో షారుఖ్‌ పేరు మార్మోగిపోతోంది.  'గెట్‌ వెల్‌ సూన్‌ షారుఖ్‌ ఖాన్' అనే హ్యాష్ టాగ్ ట్రెండింగ్‌లో ఉంది. 
 
కరోనా కారణంగా షారుఖ్ ఖాన్ మరో 10-15 రోజుల వరకు ఇంటినుంచి బయటికి రాణి పరిస్థితి. దీంతో షారుఖ్ సినిమా షూటింగ్స్ అన్ని క్యాన్సిల్ అయ్యాయి. తమిళ డైరెక్టర్ అట్లీతో షారుఖ్ తీస్తున్న జవాన్ సినిమాకు బ్రేకులు పడ్డట్లే. ఇటీవలే జవాన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలనుకున్నారు. ఇంతలోనే కరోనా కాటేసింది. అంతకుముందు కరోనా లాక్ డౌన్, ఆర్యన్ డ్రగ్స్ కేసు సినిమాకు అడ్డంకులుగా ఏర్పడ్డాయి. 

Also Read: Good Luck Gifts: వీటిని బహుమతిగా పొందితే.. జీవితంలో అదృష్టమే ఇగ! పొరపాటున కూడా వీటిని ఇవ్వకూడదు  

Also Read: AP SSC Results 2022: నేడే పదో తరగతి ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఈ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోండి!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News