Vennelakanti passes away: వెన్నెలకంటి ఇక లేరు

Vennelakanti dies of heart attack: ప్రముఖ గేయ రచయిత, మాటల రచయిత వెన్నెలకంటి ఇక లేరు. ఈ రోజు మధ్యాహ్నం చెన్నైలో గుండెపోటుతో మరణించారు. వెన్నెలకంటి పూర్తి పేరు వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్.

Last Updated : Jan 5, 2021, 08:58 PM IST
  • గుండెపోటుతో ప్రముఖ గేయ రచయిత, మాటల రచయిత వెన్నెలకంటి మృతి.
  • వెన్నెలకంటి పూర్తి పేరు వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్.
  • 300 లకు పైగా సినిమాలకు దాదాపు 2000 పైగా పాటలు, డైలాగ్‌లు రాసిన వెన్నెలకంటి.
Vennelakanti passes away: వెన్నెలకంటి ఇక లేరు

Vennelakanti dies of heart attack: ప్రముఖ గేయ రచయిత, మాటల రచయిత వెన్నెలకంటి ఇక లేరు. ఈ రోజు మధ్యాహ్నం చెన్నైలో గుండెపోటుతో మరణించారు. వెన్నెలకంటి పూర్తి పేరు వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్. 1930లో జన్మించిన వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ తొలుత చంద్రగిరిలో ఎస్బిఐలో ఉద్యోగం చేశారు. డబ్బింగ్ సినిమాల్లో డైలాగ్స్ రాయడంలో దిట్టగా పేరుగాంచిన వెన్నెలకంటి, కొన్ని సినిమాలకు స్క్రిప్ట్స్ కూడా రాశారు. 300 లకు పైగా సినిమాలకు దాదాపు 2000 పైగా పాటలు, డైలాగ్‌లు రాశారు. ఆదిత్య 369 సినిమాలో రాస లీల వేళ, ముద్దుల మావయ్య చిత్రంలో మావయ్య అన్న పిలుపు, మహర్షి సినిమాలో మాటరాని మౌనమిది లాంటి పాటలు ఆయన కలంలోంచి జాలువారినవే.

Also read : టాలీవుడ్‌పై Anchor Anasuya సంచలన వ్యాఖ్యలు

‘పంచతంత్రం’, ‘దశావతారం’ వంటి డబ్బింగ్ సినిమాలతో రచయితగా మంచి ఆదరణ పొందారు. వెన్నెలకంటిని పాటలు రాయమని ఎస్పీ బాలసుబ్రమణ్యం ( SP Balasubrahmanyam ) ప్రోత్సహించేవారంట. "చిరునవ్వుల వరమిస్తావా చితి నుంచి లేచోస్తా" అనేది వెన్నెలకంటి రాసిన పాటలలో అత్యంత ప్రజాదరణ పొందిన పంక్తి. ఆ తరువాత చాలా మంది దీనిని ఉపయోగించారు. వెన్నెలకంటి కుమారులు శశాంక్, రాకేందు మౌలి కూడా ప్రసిద్ధ రచయితలుగా పేరు తెచ్చుకుంటున్నారు.

Also read : Bigg Boss 4 contestant Akhil: అఖిల్‌కి విలన్‌గా ఛాన్స్ ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News