Maya Trailer: మిస్టీరియస్ థ్రిల్లర్ గా రాబోతున్న మాయా.. గ్రాండ్ గా టీజర్ లాంచ్ ఈవెంట్

Maya: మిస్టీరియస్ థ్రిల్లర్ జోనర్ కి ఎప్పుడు తెలుగు ప్రేక్షకులు పెద్ద పీఠే వేస్తారు. ఈ జోనర్ లో వచ్చే దాదాపు అన్ని సినిమాలు సూపర్హిట్లుగా నిలుస్తూ ఉంటాయి. ప్రస్తుతం ఇదే జొన్నర్ లో రాబోతోంది మాయా అనే సినిమా…

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 13, 2023, 01:26 PM IST
Maya Trailer: మిస్టీరియస్ థ్రిల్లర్ గా రాబోతున్న మాయా.. గ్రాండ్ గా టీజర్ లాంచ్ ఈవెంట్

Maya Trailer Launch: రాజేష్ గొరిజవోలు నిర్మాణ సారథ్యంలో రమేష్ నాని దర్శకత్వంలో త్వరలో విడుదల కానున్న మిస్టీరియస్ థ్రిల్లర్ మాయ. కాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈరోజు ఘనంగా జరిగింది. విన్ క్లౌడ్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై జీరో ప్రొడక్షన్స్ సమర్పిస్తున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను కట్టపడేసేలా ఉంటుందని తాజా టీజర్ రుజువు చేసింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం నిర్వహించారు. 

ముందుగా ఈ సినిమా హీరోయిన్ సిరి చందన మాట్లాడుతూ.. ముందుగా డైరెక్టర్ రమేష్ నాని కి ధన్యవాదాలు తెలిపారు. ఆయన లాంటి కూల్ డైరెక్టర్ ని ఎక్కడా చూడలేదని.. అలానే ఈ సినిమా హీరో కిరణ్ చాలా సపోరిటీవ్ అని, ఆయనతో పోటీపడి నటించానని తెలిపారు. మాయా చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరూ ఎంతో హార్డ్ వర్క్ చేశారని, టీం వర్క్ చాలా నచ్చిందని .. అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

ఇక ఈ చిత్ర హీరో కిరణ్ ఆవల మాట్లాడుతూ ఈ సినిమా దర్శకుడు మొదటిసారి ఇంటికొచ్చి ఈ స్టోరీ చెప్పిన వెంటనే ఒప్పుకున్నానని  తెలిపారు. హీరోయిన్ సిరి చందన, ఎస్తర్ నటీనటులందరితో వారితో పని చేయడం చాలా సంతోషంగా ఉందని వెల్లడించారు. చిన్న సినిమాలను తొక్కేసారని చాలామంది చెప్తుంటారు, కానీ సినిమాలో విషయం ఉంటే ఎవరు తొక్కలేరని మా చిత్రం నిరూపిస్తుందని నమ్మకంగా తెలిపారు. అలానే ఈ సినిమాలో ఒక ముఖ్యపాత్రలో నటించిన సురేష్ కొండేటి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మ్యూజిక్ డైరెక్టర్ సూర్య వర్క్ ఎంతో నచ్చిందని, ఈ సినిమాకు ప్రాణం పెట్టి చేశారని కొనియాడారు. డబ్బులు ఎక్కడ వేస్ట్ కాకుండా ప్రొడ్యూసర్ కు ఫేవర్ గా సినిమాను తెరకెక్కించారని వివరించారు. చిన్న సినిమాను పెద్ద సినిమాగా చేసే ఒకే ఒక పవర్ మీడియాకు ఉందని, కచ్చితంగా మా సినిమాను సపోర్ట్ చేసి పెద్ద సినిమా చేయాలని మీడియా మిత్రులకు కిరణ్ ఆవల ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఇక ఈ సినిమాలో చిన్న పాత్ర చేసిన జర్నలిస్ట్ సురేష్ కొండేటి మాట్లాడుతూ.. స్టోరీ చెప్పగానే బాగా నచ్చిందని కచ్చితంగా రమేష్ నాని పెద్ద డైరెక్టర్ అవుతాడని చెప్పుకొచ్చారు సురేష్. ఇండస్ట్రీకి వచ్చి 31 ఏళ్లు అవుతున్నా.. తాను యాక్ట్ చేసిన సినిమా గురించి మీడియా ముందు మాట్లాడడం కొత్తగా, అదేవిధంగా ఆనందంగా ఉందని తెలియజేశారు.

కాగాఒక చిత్రం షూటింగ్ లో ఉన్నప్పుడు, లంచ్ బ్రేక్ లో డైరెక్టర్ రమేష్ ఈ కథ చెప్పారని, అది విన్న వెంటనే ఓకే చేశానని హీరోయిన్ ఎస్తర్ నోర్హానా తెలిపారు. కథ చాలా కొత్తగా ఉంది, ఇలాంటి స్టోరీలు ఎలాగైనా ప్రేక్షకులకు తెలియాలి అని ఓకే చేసినట్లు వెల్లడించారు. 

ఆ తర్వాత ఈ సినిమా దర్శకుడు రమేష్ నాని మాట్లాడుతూ.. అడగగానే పాత్ర చిన్నదైనా ఒప్పుకున్నందుకు సురేష్ కొండేటికీ ధన్యవాదాలు తెలిపారు…హీరోయిన్ ఎస్తర్ కు స్టోరీ చెప్పినప్పుడు నిర్మాత ఎవరూ లేరని కేవలం ఆమె ఉన్నారన్న ధైర్యంతోనే ముందుకెళ్లామని తెలిపారు. ఎస్తర్ ను సౌత్ విద్యాబాలన్ అని అన్నారు. ఇక మరో హీరోయిన్ సిరి చందన ఎంతో కూల్ పర్సన్ అని, ప్రొడక్షన్ పరంగా కొన్నిసార్లు చిన్న చిన్న పొరపాట్లు జరిగినా.. ఎక్కడ అసౌకర్యానికి గురికాకుండా ఎంతో ఓపికగా చిత్రానికి సహకరించారని పేర్కొన్నారు.  ఇక హీరోగా కిరణ్ ఎంతో సపోర్ట్ చేశాడని ఆయన సపోర్ట్ తోనే చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుందని వెల్లడించారు. చిన్న సినిమా, చిన్న బడ్జెట్ కానీ, మంచి కంటెంట్ అని ప్రేక్షకులందరూ ఖచ్చితంగా ఆదరిస్తారని నమ్మకం వ్యక్తం చేశారు. 

Also Read:  Alla Ramakrishna Reddy: వైసీపీకి బిగ్‌షాక్.. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఆర్కే రాజీనామా

Also Read:  Allu Arjun: హాయ్ నాన్న రివ్యూ ఇచ్చేసిన అల్లు అర్జున్.. నానిపై ప్రశంసలు

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News