Rana Naidu Streaming on Netflix: తెలుగు హీరోలు కూడా ఓటీటీ ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే పలువురు తెలుగు నటీనటులు ఓటీటీల్లో చేసిన వెబ్ సిరీస్ లు సినిమాలో విడుదలవగా ఇప్పుడు ఇద్దరు టాలీవుడ్ స్టార్లు నటించిన రానా నాయుడు అనే వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. దగ్గుబాటి వెంకటేష్ ఆయన అన్న కుమారుడు దగ్గుబాటి రానా ప్రధాన పాత్రధారులుగా రానా నాయుడు అనే ఒక యాక్షన్ క్రైమ్ డ్రామా సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది.
అమెరికన్ టీవీ సిరీస్ ఒక దాన్ని స్ఫూర్తిగా తీసుకుని భారతీయ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కించారు. ఓటీటీ ప్లాట్ ఫారం నెట్ ఫ్లిక్స్ వేదికగా ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల గంటన్నర నుంచి ఈ స్ట్రీమింగ్ మొదలైంది. వాస్తవానికి గురువారం అర్ధరాత్రి తర్వాత రానా నాయుడు స్ట్రీమింగ్ అవుతుందని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూశారు కానీ శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ మొదలైంది.
ఇక బాబాయి అబ్బాయి వెంకటేష్ రానా కలిసి నటిస్తున్న మొదటి వెబ్ సిరీస్ కావడంతో పాటుగా ట్రైలర్ కూడా ఆసక్తికరంగా సాగడంతో ఈ సిరీస్ మీద అందరి ఆసక్తి నెలకొని ఉంది. అంతేకాక గురువారం రాత్రి రామానాయుడు స్టూడియోస్ లో ఈ సిరీస్ ని ప్రీమియర్ గా సెలబ్రిటీల కోసం ప్రదర్శించారు. సినీ పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు ఈ షోకి విచ్చేసిన చూసి సిరీస్ అద్భుతంగా ఉందంటూ ప్రశంసల వర్షం కురిపించారు.
ఇక ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ ఈ సిరీస్ కోసం కష్టపడి పని చేశామని, ఇది ఒక డార్క్ ఫ్యామిలీ డ్రామా అనేక ఎమోషన్స్, హింస, సెక్స్ కూడా ఉంటుందంటూ కామెంట్ చేసేసి అయ్యో చెప్పేశానే అంటూ నాలుక కర్చుకున్నారు. ఇక నెట్ ఫ్లిక్స్ టీం చాలా నిజాయితీగా పనిచేస్తుందని ప్రతి ఒక్కరూ లాప్టాప్ మొబైల్ తీసి చూడడం మొదలు పెడితే మీ ఎక్స్ప్రెషన్స్ మారిపోతూ ఉంటాయని పేర్కొన్నారు. ఇక ఇది రానా షో అని పేర్కొన్న ఆయన అక్కడక్కడా ఏదైనా ఇబ్బంది అనిపిస్తే క్షమించండి అని పేర్కొన్నారు. ఇక ఈ సిరీస్ చూస్తున్న వారందరూ ఫ్యామిలీతో కలిసి సిరీస్ చూడొద్దని ఒంటరిగా చూసేందుకు ప్రయత్నించాలని చెబుతున్నారు సిరీస్ చూసిన వారు.
Also Read: Naresh Pavitra Marriage: నరేష్ -పవిత్ర పెళ్లి నిజం కాదు.. బకరాలని చేశారుగా!
Also Read: Actor Naresh Honeymoon: దుబాయ్ లో హనీమూన్ కు నరేష్, పవిత్ర లోకేష్.. ఎక్కడా తగ్గట్లేదు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Rana Naidu Streaming: ఆలస్యంగా నెట్ ఫ్లిక్స్ లోకి 'రానా నాయుడు'.. వాళ్లతో కలిసి చూడకండి!