Om Raut kiss: తిరుమలలో కృతికి ఓం రౌత్ ముద్దు.. ఇదేం రచ్చరా అయ్యా?

Om Raut  kiss to Kriti Sano: తిరుమల శ్రీవారిని దర్శించుకుని బయలుదేరుతున్న సమయంలో కృతి సనన్ బుగ్గ మీద ఓం రౌత్ ముద్దు పెడుతున్నట్లు ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ విషయంపై పలువురు ఓం రౌత్ మీద విమర్శల వర్షం కురిపిస్తున్నారు.  

Written by - Chaganti Bhargav | Last Updated : Jun 8, 2023, 01:19 PM IST
Om Raut kiss: తిరుమలలో కృతికి ఓం రౌత్ ముద్దు.. ఇదేం రచ్చరా అయ్యా?

Om Raut  kiss to Kriti Sanon inside Tirupati temple: ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆది పురుష్ సినిమా మరికొద్ది రోజుల్లో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. జూన్ 16వ తేదీన ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలతో పాటు పలు విదేశీ భాషల్లో సైతం రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈ సినిమా విడుదలకు సంబంధించి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఇటీవల తిరుపతిలో ఘనంగా నిర్వహించారు.

ఈ నేపథ్యంలో ముందుగానే ప్రభాస్ తిరుమల శ్రీవారిని దర్శించుకోగా ఈవెంట్ తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లిన దర్శకుడు ఓం రౌత్, కృతి సనన్ తాజా కాంట్రావర్సీకి కేర్ అఫ్ అడ్రస్ గా మారారు. దర్శనం అయిపోయిన తర్వాత బయలుదేరుతున్న సమయంలో కృతి సనన్ బుగ్గ మీద ఓం రౌత్ ముద్దు పెడుతున్నట్లు ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమెను హత్తుకుని ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టడం లాంటి చర్యలు మాత్రం కరెక్ట్ కాదని పలువురు ఓం రౌత్ మీద విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

Also Read: Bhagavanth Kesari: భగవత్ కేసరి అంటూ వస్తున్న బాలయ్య.. ఇక్కడ కూడా వదల్లేదుగా!

తిరుమల అనేది ఒక పవిత్రమైన స్థలమని అక్కడ ఇలాంటి పనులు పబ్లిక్ గా చేయడం అసలు ఏమాత్రం బాలేదంటూ కామెంట్లు చేస్తున్నారు. నిజానికి దీన్ని ఇంతలా హైలెట్ చేయాల్సిన అవసరం లేదని, మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఆమె దర్శకుడిని అన్నయ్య అని పలు సందర్భాల్లో ప్రస్తావించిందని ఒక అన్న చెల్లెలికి ముద్దు పెట్టడం తప్పేమీ కాదే, తన ప్రేమను అలా వ్యక్తపరిచి ఉండవచ్చు దానికి ఇలా కామెంట్ చేయాలా అంటూ మరికొందరు సమర్థిస్తున్నారు.

ఇక ఆదిపురుష్ సినిమాకి తెలుగులో అయితే మరిన్ని వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే హనుమంతుడు కోసం ఒక సీటు రిజర్వ్ చేయడం మీద అనేక రకాల చర్చలు జరుగుతూ ఉండగా ఇప్పుడు కొత్తగా దళితులకు ఆది పురుష్ సినిమా థియేటర్లలోకి ప్రవేశం లేదంటూ ఎడిట్ చేయబడిన కొన్ని పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపద్యంలో వాటన్నింటినీ సినిమా యూనిట్ తిప్పికొడుతూ ఎప్పటికప్పుడు అన్నిటినీ కవర్ చేసుకుంటూ రావాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నాయి.

Also Read: Samantha Ruth Prabhu: టర్కిష్ బాత్ తో రిలాక్స్ అవుతున్న సమంత

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News