Amma Rajasekhar Elimination: బిగ్ బాస్ 4 నుంచి అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్.. ఈ సారి కాస్త మర్యాదగా!

Amma Rajasekhar Eliminated From Bigg Boss Telugu 4 | కంటెస్టెంట్ అమ్మ రాజశేఖర్ ఎట్టకేలకు ఎలిమినేట్ అయ్యాడు. నామినేషన్‌లో ఉన్న ఇంటి సభ్యులలో తక్కువ ఓట్లు రావడంతో అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ అయినట్లు బిగ్ బాస్ తెలుగు 4 హోస్ట్ నాగార్జున ప్రకటించారు. కెప్టెన్ హోదాలో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ అమ్మ రాజశేఖర్ కావడం విశేషం.

Last Updated : Nov 9, 2020, 09:39 AM IST
Amma Rajasekhar Elimination: బిగ్ బాస్ 4 నుంచి అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్.. ఈ సారి కాస్త మర్యాదగా!

బిగ్ బాస్ తెలుగు 4 (Bigg Boss Telugu 4) హౌస్ నుంచి కంటెస్టెంట్ అమ్మ రాజశేఖర్ ఎట్టకేలకు ఎలిమినేట్ (Amma Rajasekhar Eliminated From Bigg Boss Telugu 4) అయ్యాడు. తొమ్మిదో వారం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా నామినేషన్‌లో ఉన్న ఇంటి సభ్యులలో తక్కువ ఓట్లు రావడంతో అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ అయినట్లు బిగ్ బాస్ తెలుగు 4 హోస్ట్ నాగార్జున ప్రకటించారు. కెప్టెన్ హోదాలో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ అమ్మ రాజశేఖర్ కావడం విశేషం. వాస్తవానికి 8వ వారమే అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ అయ్యాడు. కానీ గాయం కారణంగా ఇంటి నుంచి బయటకు వెళ్తూ తోటి కంటెస్టెంట్, సింగర్ నోయల్ కోరిక మేరకు అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ అయినా మరో అవకాశం ఇచ్చారు బిగ్ బాస్. 

 

వాస్తవానికి కేవలం తొలి రెండు వారాలు మాత్రమే అమ్మ రాజశేఖర్ రేసులో ఉన్నట్లు కనిపించారు. ఆ తర్వాత మిగతా ఇంటి సభ్యులు ఆయన పెద్దరికానికి విలువ ఇస్తూ రావడంతో బండి లాగించారు. ముఖ్యంగా చివరి మూడు వారాలలో అమ్మ రాజశేఖర్ ప్రతి విషయానికి, నామినేషన్ కాగానే నన్ను ఇంటికి పంపించేయండి అంటూ కన్నీళ్లు పెట్టుకోవడం బిగ్ బాస్ తెలుగు 4 ప్రేక్షకులకు సైతం విసుగు తెప్పించింది. ఓ వారం ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవడానికి అరగుండు, అర మీసం తీసేసుకున్నాడు డ్యాన్స్ మాస్టర్ అమ్మ రాజశేఖర్. గత వారం ఎవరిని ఎలిమినేట్ చేయవద్దని, తాను ఎలాగూ బిగ్ బాస్ 4 తెలుగు హౌస్ నుంచి వెళ్లిపోతున్నానని చెప్పడంతో 8వ వారం తప్పించుకున్న ఈ డైరెక్టర్ ఆదివారం ఎలిమినేట్ అయిపోయారు. అంటే ప్రేక్షకులు తమ నిర్ణయానికి కట్టుబడి ఉన్నారని తెలుస్తోంది.

Also Read : Bigg Boss Telugu 4 Contestants Remuneration: బిగ్ బాస్ 4 కంటెస్టెంట్స్ టాప్ 10 రెమ్యునరేషన్ వివరాలు వైరల్

 

మరోవైపు కంటెస్టెంట్ దివి వెళ్లిపోయిన తర్వాత అమ్మ.. అమ్మ అంటూ తిరిగేవాళ్లు, మద్దతిచ్చేవారు లేకపోవడంతో అసహనం, కోపం ప్రదర్శిస్తున్నాడు అమ్మ రాజశేఖర్. నామినేషన్‌లో సైతం కారణాలు స్ట్రాంగ్‌గా ఉండాలని తనను నామినేట్ చేస్తున్న సమయంలో అఖిల్ అడగగా.. నువ్వు నామినేట్ చేశావ్.. నేను నిన్ను నామినేట్ చేస్తాను.. లేకపోతే నేను నిన్ను నామినేట్ చేశానని నువ్వు కూడా నన్ను నామినేట్ చేశావ్ కదా అంటూ లాజిక్ లేకుండా మాట్లాడటం తెలిసిందే. ముఖ్యంగా కెప్టె్న్ అయ్యాక తనకు కావాల్సిన వారికి తక్కువ పనులు అప్పగించిన అమ్మ రాజశేఖర్.. అభిజిత్, హారికలను టార్గెట్ చేయడం మైనస్ పాయింట్ అయింది. నోయల్ వెళ్తూ వెళ్తూ చెప్పిన మాటలు మనసులో పెట్టుకున్న అమ్మ రాజశేఖర్.. నోయల్‌ ఫ్రెండ్స్, మద్దతుగా ఉండే అభిజిత్, హారికలపై ప్రతి విషయంలో గొడవకు సిద్ధపడటం మైనస్ పాయింట్ అయింది.

 

బిగ్ బాస్ తెలుగు 4లో తొమ్మిదో వారం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు అభిజిత్, హారిక, అవినాష్, మొనాల్ గజ్జర్, అమ్మ రాజశేఖర్‌లను నామినేట్ చేశారు. అయితే తనదైన కామెడీతో నవ్వించే అవినాష్ అంత తేలికగా ఎలిమినేట్ కాడు. మరోవైపు బిగ్ బాస్ 4 సీజన్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా ఉన్న మొనాల్‌ను సైతం చివరి వారం వరకు కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. అభిజిత్, హారికలకు ఉన్న ఫ్యాన్స్, వీక్షకులు వారిని ఎలాగూ ఓట్ల ద్వారా సేవ్ చేసుకుంటారు. గత వారం ఎలిమినేట్ అయిన అమ్మ రాజశేఖర్ చివర్లో తప్పించుకున్నా.. తనకు అవకాశం ఇచ్చిన వ్యక్తి నోయల్‌ను సైతం మాటలు అంటూ మద్దతు తెలిపిన అభిజిత్, హారికలతో గొడవకు దిగడం మాస్టర్‌కు మైనస్ పాయింట్ అయింది. 9వ వారం
అమ్మ రాజశేఖర్ బిగ్ బాస్ తెలుగు 4 నుంచి ఎలిమినేట్ అయ్యారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Trending News