Brahmastram review: బ్రహ్మాస్త్రం మూవీ ఎలా ఉందంటే?

Brahmastram movie review in telugu:  ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్రహ్మాస్త్ర సినిమా ఏమేరకు ఆకట్టుకుందనేది రివ్యూలో చూద్దాం.

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 9, 2022, 06:03 PM IST
Brahmastram review: బ్రహ్మాస్త్రం మూవీ ఎలా ఉందంటే?

Brahmastram movie review in telugu: బాహుబలి లాంటి సినిమా తీయాలని బాలీవుడ్ సినీ దర్శక నిర్మాతలు చేయని ప్రయత్నమే లేదు. ఇప్పటికే దానికి సంబంధించిన అనేక ప్రయత్నాలు చేశారు. వారయితే అలాంటి సినిమా ఇప్పటి వరకు అలాంటి సినిమా చేయలేదు. బ్రహ్మాస్త్ర పేరుతో బాహుబలి లాంటి ఎక్స్ పీరియన్స్ ఇవ్వడానికి అయాన్ ముఖర్జీ అండ్ టీం సుమారు 5 ఏళ్ల నుంచి ప్రయత్నం చేస్తూనే ఉంది. అలా ఐదేళ్ల క్రితం మొదలైన బ్రహ్మాస్త్రం సినిమా అనేక అవాంతరాలను దాటుకుని ఎట్టకేలకు సెప్టెంబర్ 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా హిందీలోనే కాదు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతోంది. ఈ సినిమాని తెలుగు సహా మిగతా దక్షిణాది భాషల్లో రాజమౌళి సమర్పిస్తూ ఉండడంతో సినిమా మీద ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తగినట్లుగానే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఏమేరకు ఆకట్టుకుందనేది రివ్యూలో చూద్దాం.

బ్రహ్మాస్త్ర కథ ఏమిటంటే?
ఈ ప్రపంచంలో అనేక అస్త్రాలను సృష్టించిన బ్రహ్మదేవుడు తన పేరిట ఒక బ్రహ్మ అస్త్రాన్ని కూడా సృష్టిస్తాడు. ప్రపంచంలోని అస్త్రాలన్నింటికీ ఈ బ్రహ్మాస్త్రమే అధిపతి. అయితే ఈ బ్రహ్మాస్త్రాన్ని సంరక్షించే బాధ్యత అస్త్రాలన్నింటినీ తీసుకున్న  బ్రహ్మన్ష్ సభ్యులకే అప్పచెప్పారు. అలాంటి టీంలో ఒకరైన మోహన్ భార్గవ(షారుక్ ఖాన్) మీద జునూన్(మౌని రాయ్) దాడి చేసి అతని దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రంలోని ఒక భాగాన్ని అపహరిస్తుంది. ఆ తర్వాతి భాగం అనీష్ శెట్టి(నాగార్జున) దగ్గర ఉందనే విషయాన్ని తెలుసుకుని అతను ఉండే వారణాసి వెళ్లడానికి ప్రయత్నిస్తుంది. అయితే అప్పటికే డీజేగా పనిచేస్తున్న శివ(రణబీర్ కపూర్) ఈషా(అలియా భట్)తో ప్రేమలో పడతాడు. ఆమెతో ప్రేమలో పడి దగ్గరవుతున్న క్రమంలో అతనికి అనీష్ శెట్టి, మోహన్ భార్గవ్ హత్య చేసిన ఒక బృందం అనీష్ శెట్టిని హత్య చేయబోతున్నారని తెలుస్తుంది. దీంతో అతన్ని రక్షించాలని ఉద్దేశంతో వెళితే ఈశా కూడా తన వెంటే వస్తానంటుంది.  అలా మొదలైన వీరి ప్రయాణం బ్రహ్మన్ష్ ఆశ్రమానికి చేరుతుంది. బ్రహ్మాస్త్రంలో ఒక భాగం మనోజ్ భార్గవ దగ్గర మరో భాగం అనీష్ శెట్టి దగ్గర ఉంటే మరో భాగం ఎక్కడ ఉంది? ఆ మూడో భాగాన్ని శివ అండ్ టీం కనిపెట్టిందా? ఇందులో ఆశ్రమం గురువు(అమితాబ్) పాత్ర ఏమిటి? ఈ బ్రహ్మాస్త్రాన్ని సాధించడానికి ప్రయత్నిస్తున్న శక్తి ఎవరు? ఆ శక్తికి  శివకి సంబంధం ఏమిటి? అనేది ఈ బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ కథ.
 
విశ్లేషణ
ప్రపంచం మొత్తాన్ని తన గుప్పిట్లో పెట్టుకునే అంత శక్తి ఉన్న ఒక శక్తి కోసం ఒక దుష్టుడైన వ్యక్తి ప్రయత్నించడం మంచి కోసం పోరాడే మిగతా శక్తులన్నీ ఏకమవడం అతన్ని ఓడించడం లాంటి కధలు అనేక సినిమాల్లో మనం చూశాము. హాలీవుడ్లో సూపర్ హిట్ గా నిలిచిన అవెంజర్ సిరీస్ కూడా దాదాపు ఇలాగే రూపుదిద్దుకుంది అని చెప్పవచ్చు. దానికి ఇండియన్ మైథాలజికల్ టచ్ ఇస్తూ మనం చిన్నప్పటి నుంచి వింటున్న అస్త్రాలు అన్నింటినీ టచ్ చేస్తూ అయాన్ ముఖర్జీ ఒక కథ రాసుకున్నాడు. వాన రాస్త్ర,  వరుణాస్త్ర, అగ్నిస్త్ర, ప్రభాస్త్ర ఇలా రకరకాల అస్త్రాలన్నింటికీ బ్రహ్మాస్త్ర గురువుగా ఆ బ్రహ్మాస్త్రా న్ని సాధించడానికి ఒక ముష్కరుల గుంపు ప్రయత్నిస్తున్నట్లుగా చూపారు. ఒకరకంగా ఈ కథంతా కల్పితమే కాకపోతే కేవలం ఊహకే పరిమితమయ్యే విషయాలను తెరమీదకు తీసుకువచ్చేందుకు అయాన్ ముఖర్జీ అండ్ టీం విశ్వ ప్రయత్నం చేసింది. అయితే అందులో దాదాపు సఫలం అయింది. ప్రేక్షకులు ఊహా లోకంలో విహరిస్తున్న భావన కచ్చితంగా ఫీల్ అవుతారు కానీ రియాలిటీ కి చాలా దూరంగా ఉండటంతో పూర్తి స్థాయిలో ఆకట్టుకుంటుందా అంటే చెప్పలేని పరిస్థితి. ఒక రకంగా ఇది రెగ్యులర్ కథే కానీ దీన్ని ఆసక్తికరంగా చెప్పడంలో అయన్ ముఖర్జీ నిరాశ పరిచాడు. సినిమా అంతా గ్రాఫిక్స్ ఆకట్టుకుంటాయి కానీ దాని వెనక లాజిక్స్ మాత్రం అసలు అంతుచిక్కవు. ఫస్టాఫ్ చాలా నెమ్మదిగా సాగుతూ ఒకరకంగా సహనానికి పరీక్ష పెడుతుంది. షారుక్ ఖాన్, నాగార్జున సీన్స్, ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ ఆకట్టుకుంటుంది. సెకండాఫ్ లో హీరో ఆశ్రమానికి చేరుకున్నాక వచ్చే సన్నివేశాలు చాలా నెమ్మదిగా సాగుతూ వెళ్తుంది. రెండో భాగంలో సరికొత్త ట్విస్ట్ రివీల్ చేసి సెకండ్ పార్ట్ మూవీపై ఆసక్తి కలిగించే ప్రయత్నం చేశారు. 
 
నటీనటులు:
నటీనటుల విషయానికి వస్తే రణబీర్ ఆలియా భట్ కలిసి మొట్టమొదటిసారిగా నటించిన ఈ సినిమాలో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. రియల్ లైఫ్ కపుల్ కావడంతో రియల్ లైఫ్ లో కూడా తమ లవ్ కెమిస్ట్రీ పండించడంలో ఎక్కడా కనబడలేదు. సినిమా మొత్తాన్ని రణబీర్ కపూర్ వన్ మ్యాన్ షో లాగా నడిపించే ప్రయత్నం చేశాడు. ఇక ఒక రకంగా నాగార్జున అలాగే షారుక్ ఖాన్ పాత్రలు సినిమాకు అతిథి పాత్రలానే అనిపిస్తాయి. కాస్త ఫుల్ లెంత్ రోల్స్ చేసింది అమితాబచ్చన్, మౌని రాయ్ అనే చెప్పాలి. ఈ వయసులో కూడా అమితాబ్ బచ్చన్ తనదైన శైలిలో నటిస్తూ యంగ్ జనరేషన్ కి కూడా మంచి పోటీ ఇచ్చారు. మౌనీ రాయ్ తన నాగిని సీరియల్ గెటప్ లాగా అనిపించింది కానీ నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. మిగతావారు తమ తమ పాత్రల పరిధి మీద నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
 
టెక్నికల్ టీమ్
సాంకేతిక వర్గం పనితీరు విషయానికి వస్తే ఈ సినిమాలో అసలు పనంతా విజువల్ ఎఫెక్ట్స్ టీమ్ దే అని చెప్పాలి. సినిమా చూస్తున్నంత సేపు ఏదో మాయా లోకంలో మనం విహరిస్తున్నామని భావన కలుగుతుంది. త్రీడీలో కనుక చూస్తే సినిమా మరింత మంచి ఫీల్ ఇస్తుంది. లొకేషన్స్ అలాగే సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి. అయితే ఎడిటింగ్ టేబుల్ మీద మరింత శ్రద్ధ పెట్టి కత్తెరకు పని చెప్పాల్సింది. మొదటి భాగం పరవాలేదు అనిపించినా రెండో భాగంలో అనవసరపు సీన్లు ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. సినిమాకు ప్రధాన బలం నేపథ్య సంగీతం, సంగీతం ఆకట్టుకోకపోయినా నేపథ్య సంగీతంతో మ్యాజిక్ చేసే ప్రయత్నం చేశారు సంగీత దర్శకుడు. అదే విధంగా సినిమాకి నిర్మాణ విలువలు కూడా బాగా ప్లస్ అయ్యాయి. ఖర్చుకు ఏ మాత్రం వెనుకాడినట్టు కనిపించడం లేదు. సినిమా కోసం వేసిన సెట్లు కానీ వీఎఫ్ఎక్స్ కానీ సినిమాకి బాగా రిచ్ లుక్ తీసుకొచ్చాయి.  

ఫైనల్ గా ఒక్కమాటలో చెప్పాలంటే
బ్రహ్మాస్త్ర మూవీ ప్రమోషన్స్ లో రాజమౌళి అండ్ టీం ఓదరగొట్టినంత అద్భుతం కాకపోయినా విజయవాడ ఎఫెక్ట్స్ గ్రాఫిక్స్ వర్క్ తో కచ్చితంగా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది అని చెప్పక తప్పదు కదా కాస్త సహనానికి పరీక్ష పెట్టిన ఫ్యామిలీతో కలిసి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడగలిగిన వన్ టైం వాచబుల్ మూవీ బ్రహ్మాస్త్రం బ్రహ్మాండం కాదు కానీ తీసిపారే తగ్గ సినిమా కూడా కాదు.

Rating: 2.5/5

Also Read: Ginna Teaser: వాడు టైంకే వస్తాడు.. వచ్చేప్పుడు బ్యాడ్ టైంను కూడా తీసుకొస్తాడు కదా! ఆస‌క్తికరంగా జిన్నా టీజ‌ర్‌

Also Read: 'Oke Oka Jeevitham' Review: ఇంటరెస్టింగ్ గా శర్వానంద్ 'ఒకే ఒక జీవితం' రివ్యూ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News