/telugu/photo-gallery/bsnl-new-cheapest-recharge-plan-that-tempts-jio-airtel-users-84-days-offer-with-3gb-daily-data-extra-rn-180889 BSNL: జియో, ఎయిర్‌టెల్‌ కస్టమర్లను టెంప్ట్‌ చేస్తోన్న బీఎస్ఎన్‌ఎల్‌ నయా చీపెస్ట్‌ రీఛార్జీ ప్లాన్‌.. BSNL: జియో, ఎయిర్‌టెల్‌ కస్టమర్లను టెంప్ట్‌ చేస్తోన్న బీఎస్ఎన్‌ఎల్‌ నయా చీపెస్ట్‌ రీఛార్జీ ప్లాన్‌.. 180889

Boycott Trend Tension to Brahmastra Team: మరి కొద్ది గంటల్లో విడుదల కాబోతున్న బ్రహ్మాస్త్ర సినిమాకు కూడా బాయ్ కాట్ ట్రెండ్ టెన్షన్ గా మారింది. ఈ మధ్యకాలంలో ఏ బాలీవుడ్ సినిమా విడుదలవుతున్నా సరే వెంటనే నెటిజనులు అనేక రకాల కారణాలు ఎత్తిచూపుతూ సదరు సినిమాలను బాయికాట్ చేయాలంటూ పిలుపునిస్తున్నారు. ఇప్పటికే ఈ ఏడాది విడుదలైన లాల్ సింగ్ చద్దా, లైగర్, రక్షాబంధన్, దొబారా వంటి సినిమాలను బాయికాట్ చేయాలి అని పిలుపునివ్వడంతో ఆ సినిమాలన్నింటికీ డిజాస్టర్ ఫలితాలు వచ్చాయి.

ఇక కోట్ల రూపాయల బడ్జెట్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న బ్రహ్మాస్త్ర సినిమాకి కూడా ఈ బాయ్ కాట్ ట్రెండ్ టెన్షన్ గా మారింది. గతంలో సుమారు పదకొండేళ్ల క్రితం రణబీర్ కపూర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు బీఫ్ అంటే ఇష్టం అని చెప్పడంతో హిందువులకు అత్యంత పూజనీయమైన ఆవు మాంసం ఇష్టం అని చెప్పటం ఎంతవరకు కరెక్ట్ ఇతని సినిమాలు బాయ్ కాట్ చేయమని పిలుపునిస్తున్నారు హిందూ సంఘాల వారు. అదేవిధంగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పుడు రణబీర్ కపూర్ పాదాలకు షూస్ వేసుకొని గుడిలోకి వెళ్లేందుకు ప్రయత్నించాడని అది కరెక్ట్ కాదని చెబుతూ కూడా వారు బాయ్ కాట్ చేయమని పిలుపునిస్తున్నారు.

అదేవిధంగా అలియా భట్ గతంలో తన సినిమాలు ఇష్టం ఉంటె చూడాలి లేకుంటే మానేయాలి అని పేర్కొనడం కూడా చర్చనీయాంశం అయింది. దాన్ని కూడా ఇప్పుడు కారణంగా ఎత్తి చూపుతున్నారు. ఇక కరణ్ జోహార్ ఈ సినిమాని నిర్మించడంతో ఆయన నెపోకిడ్స్ ను ఎంకరేజ్ చేస్తున్నారని అందుకే సినిమాని బ్యాన్ చేయాలని మరో వర్గం వారు కోరుతున్నారు. అంతేకాకుండా అలియాభట్, రణబీర్ ఇద్దరు కూడా సెల్ఫ్ మేడ్ కార్స్ కాదని ఇద్దరూ కూడా వారసులుగా ఎంట్రీ ఇచ్చి అనేకమంది అవకాశాలకు అడ్డుపడుతున్నారని ఇలా రకరకాల ప్రచారాలు అయితే జరుగుతున్నాయి.

ఇలా  అనేక కారణాలను ఎత్తిచూపుతూ ఈ సినిమా బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ సృష్టిస్తున్నారు. అయితే ఈ బ్యాన్ కల్చర్ ముందే ఈ సినిమాకు మంచి అడ్వాన్స్ బుకింగ్స్ వచ్చాయి. ఇప్పటికే ఈ సినిమా ఆర్ఆర్ఆర్ బుకింగ్ దాటివేసింది. అలాగే హిందీ నుంచి టాప్ టెన్ అడ్వాన్స్ బుకింగ్స్ సినిమాలలో ఒకటిగా నిలిచి అవకాశాలు కనిపిస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. బాహుబలి లాంటి హిట్ సినిమా కొట్టాలని బాలీవుడ్ ఎన్నాళ్లుగానో ప్రయత్నం చేస్తుంది. మళ్ళీ ఇన్నేళ్లకు ఈ సినిమా ద్వారా ఆ ప్రయత్నం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ సినిమాలో రణబీర్ కపూర్ అలియా భట్ జంటగా నటించగా అమితాబచ్చన్ ఓకే కీలకపాత్రలో నటించారు. మౌని రాయ్ ఒక నెగెటివ్ షేర్స్ ఉన్న ఒక పాత్రలో నటించింది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మన హీరో నాగార్జున కూడా ఒక కీలకపాత్రలో నటిస్తున్నారు. అదే విధంగా షారుక్ ఖాన్ ఒక అతిధి పాత్రలో కనిపించబోతున్నారు. ధర్మ ప్రొడక్షన్స్ సహా నాలుగు బడా ప్రొడక్షన్ సంస్థలు ఈ సినిమాను భారీ బడ్జెట్లో నిర్మిస్తున్నాయి. 

Also Read: God Father Movie Postponed: గాడ్ ఫాదర్ వాయిదాపై పెదవి విప్పిన నిర్మాత

Also Read: Chiranjeevi Tension to Brahmastra: బ్రహ్మాస్త్రం సినిమాకు చిరు టెన్షన్.. ఆ సెంటిమెంట్ తో వణుకు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Section: 
English Title: 
Boycott Trend Tension to Brahmastra Team
News Source: 
Home Title: 

రిలీజ్ కు ముందు బాయ్ కాట్ టెన్షన్.. నెటిజన్లు చెబుతున్న కారణాలివే!

Boycott Brahmastra : రిలీజ్ కు ముందు బాయ్ కాట్ టెన్షన్.. నెటిజన్లు చెబుతున్న కారణాలివే!
Caption: 
Boycott Trend Tension to Brahmastra Team Source: twitter
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
రిలీజ్ కు ముందు బాయ్ కాట్ టెన్షన్.. నెటిజన్లు చెబుతున్న కారణాలివే!
Chaganti Bhargav
Publish Later: 
No
Publish At: 
Thursday, September 8, 2022 - 12:21
Request Count: 
68
Is Breaking News: 
No