Bipasha Basu Pregnent: తల్లి కాబోతున్న బాలీవుడ్ భామ.. అందుకే దూరంగా?

Bipasha Basu Pregnant:  బాలీవుడ్ భామ బిపాసా బసు గురించి ఒక శుభవార్త బయటకు వచ్చింది. అతి త్వరలో అభిమానులకు బిపాసా ఈ శుభవార్త చెప్పనుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 29, 2022, 07:50 PM IST
Bipasha Basu Pregnent: తల్లి కాబోతున్న బాలీవుడ్ భామ.. అందుకే దూరంగా?

Bipasha Basu Pregnant:  బాలీవుడ్ సినీ సర్క్సిల్స్ లో ఒక గుడ్ న్యూస్ వినిపిస్తోంది. బాలీవుడ్ భామ బిపాసా బసు గురించి ఒక శుభవార్త బయటకు వచ్చింది. బిపాసా బసు గర్భవతి అని తెలుస్తోంది. బిపాసా బసు- కరణ్ సింగ్ గ్రోవర్ తల్లిదండ్రులు కాబోతున్నారని, అతి త్వరలో అభిమానులకు బిపాసా ఈ శుభవార్త చెప్పనుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. అయితే ప్రెగ్నెన్సీని బిపాసా, కరణ్ ఇంకా ధృవీకరించలేదు.

 

అయితే ఈ వార్త నిజమైతే, బిపాసా బసు -కరణ్ సింగ్ గ్రోవర్ వివాహం జరిగిన ఆరేళ్ళ తర్వాత వారి ఇల్లు చిన్నారి అరుపులతో ప్రతిధ్వనించబోతోంది. బిపాసా బసు - కరణ్ సింగ్ గ్రోవర్ ఏప్రిల్ 2016లో వివాహం చేసుకున్నారు. ఇక బిపాసా, కరణ్‌ల అభిమానులు వారి అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే బిపాసా ప్రెగ్నెన్సీ గురించి చాలా కాలంగా చర్చ నడుస్తోంది. ఈ కారణంగానే బిపాసా  ఇన్‌స్టాగ్రామ్‌కి కూడా దూరంగా ఉండిపోయిందని చెబుతున్నారు.

బిపాసా తరచూ తన కొత్త లుక్‌ని అభిమానులతో పంచుకుంటూ ఉండేది కానీ కొంతకాలంగా మాత్రం ఆమె తన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం లేదు. ఆమె పోస్ట్ చేసిన ఫోటోలలో కూడా ఆమె తన క్లోజప్ లుక్స్ మాత్రమే కనపడేలా జాగ్రత్తలు తీసుకుంది. బిపాసా - కరణ్ మొదటిసారి 2015లో అలోన్ సినిమా సెట్స్‌లో కలుసుకున్నారు. అప్పటి నుండి వారిద్దరూ స్నేహితులుగా మారారు. ఆ తరువాత స్నేహం ప్రేమగా మారింది. పెళ్లయి దాదాపు 6 ఏళ్లు గడిచిన తర్వాత ఇప్పుడు ఇద్దరి ఇంట్లో ఆనందం వెల్లివిరిసిందని అంటున్నారు.

Also Read: Ramarao on duty: పవిత్ర లోకేష్ కనిపించగానే థియేటర్లలో గోలగోల.. మాములు రచ్చ కాదుగా!

Also Read: GodFather Update: సల్మాన్ తో కలిసి చిందేయనున్న చిరు.. కన్నుల పండుగే అంటూ ట్వీట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. 

 

Trending News