Bigg Boss Telugu 4: కమెడియన్‌కు ముద్దుపెట్టిన హీరోయిన్.. వైరల్

Monal Gajjar Kisses Avinash in Bigg Boss Telugu House |  తనను ఎందుకు నామినేట్‌ చేశావని అమ్మ రాజశేఖర్‌ తోటి కంటెస్టెంట్‌ ఇస్మార్ట్‌ సోహైల్‌పై కాస్త అసహనాన్ని ప్రదర్శిస్తుంటాడు. నిన్న ఎపిసోడ్‌లో అరియానాతో కెప్టెన్‌ ‘జబర్దస్త్‌’ అవినాష్‌ ముచ్చటిస్తుంటాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన మొనాల్‌ గజ్జర్‌ కెప్టెన్‌ అవినాష్‌కు నుదుట ముద్దు పెట్టి వెళ్లిపోతుంది.

Last Updated : Oct 28, 2020, 03:30 PM IST
Bigg Boss Telugu 4: కమెడియన్‌కు ముద్దుపెట్టిన హీరోయిన్.. వైరల్

రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు 4లో 8వ వారం నామినేషన్ల వేడి ఇంకా కొనసాగుతోంది. తనను ఎందుకు నామినేట్‌ చేశావని అమ్మ రాజశేఖర్‌ తోటి కంటెస్టెంట్‌ ఇస్మార్ట్‌ సోహైల్‌పై కాస్త అసహనాన్ని ప్రదర్శిస్తుంటాడు. తనను నామినేట్‌ చేస్తున్నారని కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. అయితే మీరే కదా మాస్టర్‌ చెయ్యి ఎత్తారు.. మీరు సిద్ధంగా ఉన్నారని ఇదివరకే బిగ్‌బాస్ (Bigg Boss Telugu 4) 8వ వారం నామినేషన్‌లో మీకు రెండు ఓట్లు పడ్డాయని.. అందుకు మిమ్మల్ని నామినేట్‌ చేశానని సోహైల్‌ చెబుతాడు. కానీ రాజశేఖర్‌ ఆ మాటల్ని తీసుకోరు.

 

బిగ్‌బాస్ తెలుగు 4లో కంటెస్టెంట్‌ మొనాల్‌ గజ్జర్‌ పేరును ప్రస్తావించిటప్పుడు హౌస్‌లో నీకు ఏ (A) అనే అక్షరం పేరుతో ఉన్నవాళ్లంటే ఇష్టమని హోస్ట్‌ నాగార్జున చెప్పడం చూశాం. నిన్న ఎపిసోడ్‌లో అరియానాతో కెప్టెన్‌ ‘జబర్దస్త్‌’ అవినాష్‌ ముచ్చటిస్తుంటాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన మొనాల్‌ గజ్జర్‌ కెప్టెన్‌ అవినాష్‌కు నుదుట ముద్దు పెట్టి వెళ్లిపోతుంది. ఎప్పటిలాగే అఖిల్‌ పక్కన కూర్చుని కబర్లు మొదలుపెడుతుంది మొనాల్‌.

 

మొనాల్‌ నాకు ముద్దుపెట్టింది బిగ్‌బాస్‌ అంటూ అవినాష్‌ లేచి గట్టిగా అరుస్తుంటాడు. నువ్వు పట్టించుకోకు అఖిల్‌.. అతను (అవినాష్‌) జోకర్‌ అని, కమెడియన్‌ అని అంటుంది. దీంతో మరింతగా రెచ్చిపోయిన అవినాష్‌.. కమెడియన్‌కు ముద్దుపెట్టిన హీరోయిన్‌ మొనాల్‌ గజ్జర్‌ అని మళ్లీ గట్టిగా బిగ్‌బాస్‌కు చెబుతాడు. 

 

ఏ (A) అంటే ఇప్పుడైనా తెలిసిందా ?
బిగ్‌బాస్‌ తెలుగు 4 హోస్ట్‌ నాగార్జున గారు చెప్పిన ఏ అనే వ్యక్తి తానేనని అవినాష్‌ అంటాడు. హీరోయిన్‌ మొనాల్‌కు తానంటే ఇష్టమని, అందుకే తానకు నుదుట ముద్దు పెట్టిందని చెబుతాడు. హౌస్‌మేట్స్‌కు ఇన్నిరోజులకైనా ఏ అంటే ఎవరో తెలిసిపోయిందని అవినాష్‌ అనగానే.. ‘హమ్మయ్యా.. బతికించావ్‌ బ్రో’ అని మొనాల్‌ పక్కనే కూర్చున్న అఖిల్‌ అంటాడు. ఆ తర్వాత ఇంటి సభ్యులకు చిన్న పిల్లల టాస్క్ ఇస్తాడు బిగ్‌బాస్.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Trending News