Adireddy - Galata Geetu : ట్రాక్ తప్పిన గీతూ.. హెచ్చరించిన ఆదిరెడ్డి.. అతి మాత్రం తగ్గడం లేదుగా

Adireddy Suggests Galata Geetu బిగ్ బాస్ ఇంట్లో గీతూ ఆదిరెడ్డి ముచ్చట్లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఇద్దరు రివ్యూయర్లు కలిసి ఇంట్లోని ముచ్చట్లు చెప్పుకుంటారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 29, 2022, 05:16 PM IST
  • బిగ్ బాస్ ఇంట్లో ఎనిమిదో వారం సందడి
  • బాలాదిత్యను టార్గెట్ చేసిన గలాట గీతూ
  • గీతూ ట్రాక్ తప్పిందని చెప్పిన ఆదిరెడ్డి
Adireddy - Galata Geetu : ట్రాక్ తప్పిన గీతూ.. హెచ్చరించిన ఆదిరెడ్డి.. అతి మాత్రం తగ్గడం లేదుగా

Adireddy - Galata Geetu : బిగ్ బాస్ ఇంట్లో గీతూ ధాటిని తట్టుకోవడం అయినా, ఆమెకు ఎదురెళ్లి వాదించగలిగే కంటెస్టెంట్లలో ఆదిరెడ్డి ముందుంటాడు. ఈ ఇద్దరూ ఒకజట్టుగానే ఉంటాడు. గీతక్క అంటూ ఎంతో మర్యాదగా, గౌరవంగా మాట్లాడతాడు. ఈ ఇద్దరూ కలిసి మిగతా కంటెస్టెంట్ల మీద రివ్యూలు ఇచ్చుకుంటారు. ఎవరు వెళ్తారు.. ఎవరుంటారు.. ఎవరు బాగా ఆడతారు.. ఎవరు వీక్.. ఎవరు స్ట్రాంగ్ అని అనుకుంటూ ఉంటారు. అయితే ఈ ఇద్దరూ ఈ వారంలో బాగానే ఆడారు.

చేపలు పట్టే టాస్కులో ఆదిరెడ్డి, గీతూలు ఒక జట్టు. మిగతా వారిని చెడగొడదామని గీతూ స్ట్రాటజీ, మనది మనం కాపాడుకుందామని ఆదిరెడ్డి అంటాడు. ఈ ఇద్దరికీ పొత్తు కుదర్లేదు. అలా మొదటి రౌండ్లోనే ఈ ఇద్దరూ ఓడిపోయారు. ఇక రెండో లెవెల్లో ఈ ఇద్దరూ సంచాలకులుగా వ్యవహరించారు. అక్కడ గీతూ తన పైత్యాన్ని చూపించింది. సంచాలక్ కూడా రంగంలోకి దిగి ఆట ఆడటం ఏంటని ఆదిరెడ్డి కౌంటర్లు వేశాడు. ఇద్దరి మధ్య కాస్త వాగ్వాదం జరిగింది.

గీతూకి, బాలాదిత్యకు మధ్య గ్యాప్ ఉన్న సంగతి తెలిసిందే. మెరినా అంటే కూడా గీతూకి అయిష్టమే. ఇక ఈ ఇద్దరూ కలిసి ఆట ఆడటంతో గీతూకి మండిపోయినట్టుంది. వాళ్లు ఆడిన ఆట నచ్చలేదంటూ వారిద్దరినీ తీసి పారేసినట్టుగా చూసింది. ఇక మధ్యలో వంట గదిలో గొడవ అయింది. బాలాదిత్య బాత్రూంలో ఉండటంతో కూరగాయలు కట్ చేసేందుకు రాలేకపోయాడు. దీంతో గీతూనే వాటిని కట్ చేసింది. కానీ మొత్తంగా క్లీన్ చేయలేదు. కట్ చేసిన వాళ్లు అదే చేత్తో తీసి పారేయండని ఆదిత్యఅంటాడు.

కట్ చేయడమే ఎక్కువ.. అది నీ పని.. నేను కట్ చేశా.. నువ్ పారేయ్ అంటూ బాలాదిత్యతో వాగ్వాదానికి దిగుతుంది గీతూ. మాటామాట పెరిగింది. అయితే ఇదే విషయంలో గీతూని ఆదిరెడ్డి కాస్త హెచ్చరించాడు. నువ్ ట్రాక్ తప్పుతున్నట్టుగా అనిపిస్తోంది గీతక్కా అని అనేశాడు. ఆదిత్యను ఊరికే నామినేట్ చేశావ్ అని ఆదిరెడ్డి అంటే.. అవును నిజమే అని ఒప్పుకుంది. నువ్ అంచనా వేసేవన్నీ తప్పే అవుతున్నాయ్ అని ఆదిరెడ్డి హెచ్చరించాడు. మరి గీతూ తన ఆట తీరు మార్చుకుంటుందా? లేదా? అన్నది చూడాలి.

Also Read : Samantha Ruth Prabhu Diseases : ఆస్పత్రి బెడ్డు మీద సమంత.. ఆ వ్యాధితో బాధపడుతోందట.. నోరు విప్పిన సామ్

Also Read : ఊహించని ఎలిమినేషన్... రిస్క్ తీసుకోలేకే ఆ కంటెస్టెంట్ ను సాగనంపిన బిగ్ బాస్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News