Baladitya Vs Geetu : ఆదిరెడ్డి చెబుతున్నా వినడం లేదు.. గీతూ మొండిపట్టు.. అల్లాడిపోయిన బాలాదిత్య

Adireddy Suggestion to Geetu బిగ్ బాస్ ఇంట్లో ఆదిరెడ్డి, గీతూ ముచ్చట్లు, వారి బాండింగ్ బాగానే ఉంటుంది. ఎవ్వరూ నాకు ఫ్యామిలీ కాదు..  ఎవ్వరితోనూ నాకు అవసరం లేదని చెప్పుకునే గీతూ.. ఆదిరెడ్డిని మాత్రం వదల్లేకపోతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 2, 2022, 03:50 PM IST
  • బిగ్ బాస్ ఇంట్లో ఆగని గొడవలు
  • మారని గలాట గీతూ ప్రవర్తన
  • బాలాదిత్య బాధ వర్ణనాతీతం
Baladitya Vs Geetu : ఆదిరెడ్డి చెబుతున్నా వినడం లేదు.. గీతూ మొండిపట్టు.. అల్లాడిపోయిన బాలాదిత్య

Baladitya Vs Geetu : బిగ్ బాస్ ఇంట్లోని తొమ్మిదో వారంలోని కెప్టెన్సీ టాస్క్ ఎలాంటి ట్విస్టులతో సాగుతోందో అందరికీ తెలిసిందే. మంగళవారం నాటి ఎపిసోడ్‌లో గీతూ, సత్య, శ్రీహాన్ వేసిన మాస్టర్ ప్లాన్, దొంగిలించిన లైటర్, సిగరెట్లతో బాలాదిత్య అల్లాడిపోయాడు. బాలాదిత్య ఆట నుంచి తప్పుకున్నా కూడా గీతూ మాత్రం సిగరెట్లు, లైటర్ ఇచ్చేందుకు ఒప్పుకోలేకపోయింది. దీంతో తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో నేటి ఎపిసోడ్ ఎలా ఉండబోతోందో చూపించేసింది.

ప్రతీ సారి ఒక సిగరెట్ ఒక సిగరెట్.. అదే మాట అంటోంది.. నా స్టూడెంట్స్, నా పిల్లలకు తెలియడం నాకు ఇష్టం లేదు. తెలిసిపోయింది. కంటైపోయాను.. ఓకే అని వదిలేశాను.. రెండు స్ట్రిప్స్ఇస్తే ఒక సిగరెట్.. నాలుగు స్ట్రిప్స్ఇస్తే ఇంకో సిగరెట్.. లైటర్ ఇస్తా అని అనడం ఏంటి అని బాలాదిత్య వాపోయాడు. అది విన్న ఫైమా, కీర్తి నోరు మొదపలేకపోయారు.

ఇక మరో వైపు గీతూ.. సారీ.. గీథూ అనాల్సిందే. గీతూకి ఆదిరెడ్డి ఎంత వివరిస్తున్నా తలకి ఎక్కించుకోవడం లేదు. టాస్క్ అయిపోయిన తరువాత మన వస్తువులన్నీ స్టోర్ రూంలో పెడుతుంటాం.. వాళ్ల వాళ్ల వస్తువులు ఇవ్వడానికి నీకేం.. అని ఆదిరెడ్డి సలహా ఇస్తాడు. ఫీల్ అయ్యాను అని గీతూ అంటుంది. బ్లాక్ మెయిల్ చేస్తున్నావా?అని ఆదిరెడ్డి అంటాడు. బ్లాక్ మెయిల్ చేయడం లేదు అని గీతూ చెబుతుంది.

 

ఇక మళ్లీ ఫైమా, కీర్తిలతో బాలాదిత్య ఇలా అంటాడు.. ఆమె నా గురించి ఏ నిరూపించాలని అనుకుంటోంది.. అవి లేకపోతే సాయంత్రం నుంచి నేను చచ్చిపోయానా? అని బాలాదిత్య అనడంతో ఆ మాటలు ఫైమా తట్టుకోలేకపోయింది. ఇక గీతూకి ఆదిరెడ్డి, రాజ్ వంటి వారు ఇంకా నచ్చ జెప్పే ప్రయత్నం చేశారు.  ఇది ఓవర్ మిస్టేక్ అవుతుంది.. దానికి తగ్గ మూల్యం నువ్వే చెల్లించుకోవాల్సి ఉంటుంది.. అని ఆదిరెడ్డి హెచ్చరిస్తాడు.

బాలాదిత్య సిగరెట్ల కోసం ఏడ్చాడా? అన్నది బయటకు వెళ్తుంది.. అదే వెళ్తుంది.. జనాలకు అదే అర్థం అవుతుంది.. అని బాలాదిత్య తన బాధనంతా కూడా ఫైమా, కీర్తిలకు చెప్పుకుంటాడు. ఇది పర్సనల్ అవుతుంది.. గేమ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అని గీతూని ఆదిరెడ్డి హెచ్చరిస్తాడు. నాకు నచ్చింది తీసింది.. ఇది ఇప్పుడు మా అమ్మకు, పాపకు, భార్యకు నచ్చదు.. వారు బాధపడుతుంటారు. మరి ఈ వారం గీతూకి ఇంకెంత నెగెటివిటీ వస్తుందో చూడాలి.  

Also Read : Anasuya Bharadwaj Pics : ఎండిపోయిన ఆకులతో అనసూయ సోకులు.. న్యూజెర్సీలో యాంకర్ సందడి

Also Read : Raja Ravindra Anchor Syamala : శ్యామల ఆంటీ అంటూ కౌంటర్లు.. స్టేజ్ మీద యాంకర్‌పై రాజా రవీంద్ర సెటైర్లు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News