Telugu Big Boss OTT: బుల్లితెర ప్రేక్షకులకు 24 గంటలపాటు నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు సిద్ధమైంది బిగ్ బాస్ టీమ్. ఇప్పటికే ఐదు సీజన్లు విజయవంతంగా ముగించుకున్న తెలుగు బిగ్ బాస్..ఇప్పుడు డిజిటల్ వెర్షన్ లో రాబోతుంది. నేటి ( ఫిబ్రవరి 26) సాయంత్రం 6 గంటలకు 'బిగ్ బాస్ నాన్ స్టాప్' (Bigg Boss non stop) పేరుతో గ్రాండ్ గా లాంచ్ కానుంది. దీనిని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disney Plus Hotstar) ఓటీటీ వేదికగా ప్రసారం చేయనున్నారు. కంటెస్టెంట్స్ దాదాపు 84 రోజులు.పాటు ఉండాలి.
ఇప్పటికే ఈ షోకు సంబంధించిన లోగో, ప్రోమోలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. గత మూడు బిగ్ బాస్ సీజన్లకు హోస్ట్ గా వ్యవహారించిన కింగ్ నాగార్జునే (Nagarjuna) ఈ ఓటీటీకి కూడా యాంకర్ గా వ్యవహారించనున్నారు. ఈ రోజు లాంచ్ కానున్న బిగ్ బాస్ (bigg boss) గురించి... తాజాగా చిన్న ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్.
Andharu alarm pettukondi! ⏰ #BiggBossNonStop is just 2️⃣4️⃣ hours away!
Gurthu pettukondi! No commas and no full stops! You don't want to miss the Grand Launch at 6️⃣ PM, only on @DisneyplusHS#BiggBoss #DisneyPlusHotstar@iamnagarjuna @endemolshineIND pic.twitter.com/i4ENNUAe7t— DisneyPlus Hotstar Telugu (@DisneyPlusHSTel) February 25, 2022
ఇదిలా ఉంటే, బిగ్‌బాస్ ఓటీటీ కంటెస్టెంట్స్ (Bigg Boss OTT Contestants) ఎవరు అనే విషయంపై నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. ఇందులో కొత్తవారితోపాటు మాజీ కంటెస్టెంట్స్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. బిగ్‌బాస్ ఓటీటీలో పాల్గోనబోయే కంటెస్టెంట్స్ వీరే అంటూ ఇప్పటికే చాలా లిస్ట్ లే వచ్చాయి.
ఇందులో భాగంగా..ముమైత్ ఖాన్, తనీష్, అషు రెడ్డి, అరియానా, అఖిల్ సార్థక్, మహేష్ విట్టా, సరయూ, హామీదా, నటరాజ్ మాస్టర్, రోహిణి, రోల్ రైడాలు మాజీ కంటెస్టెంట్స్‌గా ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది. ఇక కొత్త వారిలో యాంకర్ స్రవంతి, యూట్యూబర్ నిఖిల్, ఆర్జే చైతూ, హీరోయిన్ బిందు మాధవి, యాంకర్ శివ, బమ్ చిక్ బబ్లూ, కప్పు ముఖ్యం బిగులూ వెంకట్, మిత్రా శర్మతోపాటు మరికొంత మంది పేర్లు వినిపిస్తున్నాయి.
Also Read: Samantha Viral Post: 'నా ప్రేమ కథ ఎప్పటికీ ముగియదు'.. సమంత ఎమోషనల్ పోస్ట్!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి