Bhoothaddam Bhaskar Narayana Success Meet:'భూతద్దం భాస్కర్ నారాయణ' సక్సెస్ మీట్.. ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపిన చిత్ర యూనిట్..

Bhoothaddam Bhaskar Narayana Success Meet: శివ కందుకూరి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'భూతద్దం భాస్కర్ నారాయణ'. పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి శశిధర్, కార్తీక్, స్నేహాల్ నిర్మించారు. మార్చి 1న విడుదలైన ఈ సినిమాకు యూనానిమస్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో గ్రాండ్ సక్సెస్ పార్టీ నిర్వహించింది. 

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 2, 2024, 07:44 PM IST
Bhoothaddam Bhaskar Narayana Success Meet:'భూతద్దం భాస్కర్ నారాయణ' సక్సెస్ మీట్.. ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపిన చిత్ర యూనిట్..

Bhoothaddam Bhaskar Narayana Success Meet: తెలుగులో చంటబ్బాయ్ తరహాలో కామెడీ క్రైమ్ థ్రిల్లర్స్‌  ఎన్నో సినిమాలు వచ్చాయి. ఈ కోవలో వచ్చిన మరో చిత్రం 'భూతద్దం భాస్కర్ నారాయణ'. శివ కందుకూరి హీరోగా నటించారు. సినిమా చేసేటపుడు బాగా వస్తే చాలు అనుకున్నాము. కానీ ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుందని మేము ఊహించలేదు.
మాకు ఇంత మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని ఇచ్చిన ఆడియన్స్ అందరికీ ధన్యవాదాలు. సినిమాకి అద్భుతమైన రివ్యూస్ వచ్చాయి. మా కంటెంట్ ని ప్రశంసిస్తూ ఇంత మంచి రివ్యూస్ ఇచ్చిన మీడియా మిత్రలుకు ప్రతేక ధన్యవాదాలు తెలియజేసారు. సినిమా చూసిన ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంత మంచి సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ప్రత్యేక ధన్యవాదాలు.  ఈ సినిమాతో చాలా మంచి జర్నీ వుంది. శ్రీచరణ్ అద్భుతమైన బీజీఎం ఇచ్చారు. సినిమా చుసిన ప్రతి ఒక్కరూ సంగీతం ఈ సినిమాకు పెద్ద ఎస్సెట్ అని చెప్పడం బాగుంది. విజయ్ రెండు బ్యుటీఫుల్ సాంగ్స్ ఇచ్చారు. షఫీ, అరుణ్, దేవి ప్రసాద్ అందరూ అద్భుతంగా యాక్ట్ చేశారు.  రాశి చాలా హార్డ్ వర్క్ చేసి సినిమా చేసింది. సినిమాలో పని చేసిన అందరికీ థాంక్స్. తెలుగు ప్రేక్షకులు మంచి కంటెంట్ సినిమాని ఎప్పుడూ ప్రోత్సహిస్తారని మరోసారి ప్రూవ్ అయింది.  

సినిమా చాలా చోట్ల హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది.ఇది తెలుగు ప్రేక్షకుల వల్లనే సాధ్యపడింది. ప్రీమియర్స్ షోస్ అన్నీ హౌస్ ఫుల్ అయ్యాయి. ప్రతి షోకి థియేటర్స్ నిండుతున్నాయి. ఈ సినిమాకు చూడని ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించాలన్నారు. అందరికీ కచ్చితంగా నచ్చుతుందనే నమ్మకం ఉందన్నారు.

హీరోయిన్ రాశీ సింగ్ మాట్లాడుతూ..  ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షక దేవుళ్లకు ధన్యవాదాలు. మేము ఊహించిన దానికంటే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. హౌస్ ఫుల్ థియేటర్స్ చూస్తుంటే చాలా ఆనందాన్ని ఇచ్చింది. నిర్మాతలు చాలా ప్యాషన్ తో ఈ మూవీని తెరకెక్కించారు. ఇంత మంచి పాత్ర ఇచ్చిన దర్శకుడికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. రాజ్ ఈ సినిమాకి బ్యాక్ బోన్ నిలిచి ఈ సినిమాకు అండగా నిలిచారు. శివ చాలా కొత్త క్యారెక్టర్‌తో మెప్పించారు. ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పంధన వస్తోంది. మా సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేసారు.

దర్శకుడు పురుషోత్తం రాజ్ మాట్లాడుతూ.. సినిమాకి అద్భుతమైన స్పందన వస్తోందన్నారు. మంచి రివ్యూలు వచ్చాయి. ఇది థియేటర్ ఎక్స్ పీరియన్స్ సినిమా. అందరూ ఈ సినిమా థియేటర్స్ లో చూడాలి. నిర్మాతలకు, నటీనటులకు ప్రత్యేక ధన్యవాదలు. శివ ఈ సినిమాని బలంగా నమ్మారు. సినిమా హౌస్ ఫుల్ షోస్ తో రన్ అవుతోంది. సపోర్ట్ చేస్తే ఇంకా మంచి కథలు చేయగలననే నమ్మకం మాకు వచ్చింది. మీ సపోర్ట్ ఇలానే వుండాలని కోరుతున్నాను.

రాజ్ కందుకూరి మాట్లాడుతూ..
ప్రీమియర్స్ నుంచే ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ తర్వాత మేము ఊహించన దాని కంటే గొప్ప రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను కమర్షియల్ హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ సినిమాకు శివకు హీరోగా మంచి గుర్తింపు వచ్చిందన్నారు. ఈ సినిమాను చూడని ప్రేక్షకులు థియేటర్స్‌లో ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి.

నిర్మాతలు స్నేహాల్, శశిధర్ మాట్లాడుతూ.. సినిమాకి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందకు ప్రేక్షకులకు ధన్యవాదాలు. శివ నటనకు మంచి రెస్పాన్స్ వస్తోందంటూ ముగించారు. సినిమా యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

Also Read: రూ.500 కే గ్యాస్ సిలిండర్ పథకానికి గైడ్ లైన్స్.. అర్హులు మాత్రం వీళ్లే..

Also Read: PPF Investment: రోజుకు 400 రూపాయలు పెట్టుబడితో 1 కోటి రూపాయలు తీసుకోవచ్చు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News