Anand Devarakonda win Gama Award:'బేబి' సినిమాలో నటనకు ఉత్తమ నటుడిగా గామా అవార్డ్ అందుకున్న ఆనంద్ దేవరకొండ..

Anand Devarakonda win Gama Award: గత యేడాది టాలీవుడ్ బాక్సాఫీస్ హిట్‌గా నిలిచిన మూవీ 'బేబి'. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి ముఖ్యపాత్రల్లో సాయి రాజేష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అంతేకాదు తెలుగులో అత్యుత్తమ ప్రేమ కథా చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాలోని నటనకు ఆనంద్ దేవరకొండ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 8, 2024, 05:20 AM IST
Anand Devarakonda win Gama Award:'బేబి' సినిమాలో నటనకు ఉత్తమ నటుడిగా గామా అవార్డ్ అందుకున్న ఆనంద్ దేవరకొండ..

Anand Devarakonda win Gama Award: ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin) హీరో, హీరోయిన్లుగా నటించిన సినిమా 'బేబి'. గతేడాది విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించింది. సాయి రాజేశ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మాత ఎస్‌కేఎన్ నిర్మించారు. ఈ చిత్రంలో నటించిన నటీనటులకు మంచి పేరు తీసుకొచ్చింది. అంతేకాదు గతేడాది విడుదలైన చిత్రాల్లో అత్యధిక లాభాలను తీసుకొచ్చిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. కేవలం రూ. 10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా ఓవరాల్‌గా రూ. 50 కోట్లకు షేర్ (రూ. 100 కోట్ల గ్రాస్) రాబట్టి ఔరా అనిపించింది. అంతేకాదు నిర్మాతలకు దాదాపు రూ. 40 కోట్ల వరకు లాభాలను తీసుకొచ్చింది. ఈ సినిమాలోని నటనకు ఆనంద్ దేవరకొండ మరో అవార్డు వచ్చి చేరింది. రీసెంట్‌గా దుబాయ్‌లో జరిగిన గామా అవార్డ్స్ ఫంక్షన్‌లో బెస్ట్ యాక్టర్‌గా ఆనంద్ దేరకొంబడ అవార్డు అందుకున్నాడు.  బేబి సినిమాలోని హార్ట్ టచింగ్ నటనకు ఈ అవార్డు వరించింది. బేబి సినిమా విషయానికొస్తే.. తెలుగులో సూపర్ హిట్టైన ఈ చిత్రాన్ని ఇపుడు వివిధ భాషల్లో రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అంతేకాదు ఈ సినిమా థియేటర్స్‌లో పాటు ఓటీటీతో పాటు టీవీల్లో కూడా ఇరగదీసింది. కల్ట్ బొమ్మగా 'బేబి' మూవీ పేరు తెచ్చుకుంది.

ఆనంద్ దేవరకొండకు ఇదే ఫస్ట్ బిగ్ అవార్డ్. నటుడిగా ఆనంద్ ప్రతిభకు దక్కబోయే అవార్డ్స్ కు ఇదే ఫస్ట్ స్టెప్ అని చెప్పాలి. దొరసాని సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ ఫస్ట్ సినిమాతోనే గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు ఫస్ట్ మూవీతోనే  ఒక మంచి ప్రయత్నం చేశాడనే పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత మిడిల్ క్లాస్ మెలొడీస్, పుష్పక విమానం వంటి కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకునే పనిలో పడ్డాడు. రొటిన్ సినిమాలకు భిన్నంగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నాడు.

లాస్ట్ ఇయర్ ఆడియన్స్ ముందుకు వచ్చిన 'బేబి' సినిమా ఆనంద్ దేవరకొండ కెరీర్‌లో బిగ్ టర్నింగ్ పాయింట్. ఈ సినిమాలో భగ్న ప్రేమికుడిగా ఆనంద్ యాక్టింగ్ ఆడియన్స్ గుండెలను తాకింది. అందుకే గామా అవార్డ్స్ లో బేబి సినిమాకు బెస్ట్ యాక్టర్ గా అవార్డ్ దక్కింది.  ఆనంద్ పడిన కష్టానికి, ఆయన నట ప్రతిభకు దక్కిన బహుమతి అనుకోవచ్చు. ఈ అవార్డ్ ఇచ్చిన స్ఫూర్తితో మరిన్ని మంచి సినిమాల్లో ఆనంద్ నటిస్తున్నాడు. ప్రస్తుతం ఆనంద్.. 'గం గం గణేశా', 'డ్యూయెట్' సినిమాలతో పాటు బేబి టీమ్ కాంబినేషన్‌లో మరో మూవీలో నటిస్తున్నాడు. మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి.

Read More: Dried Fruit: ఈ డ్రైఫ్రూట్స్ తీసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుతారు..‌

Read More: Leopard Enters Office: బుడ్డోడి తెలివి మాములుగా లేదుగా.. గదిలో చిరుతను బంధించిన ఏంచేశాడో తెలుసా..?.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News