Bhairavam Teaser: 'పుష్ప'ను మించి బెల్లంకొండ శ్రీనివాస్‌.. ఊరమాస్‌గా 'భైరవం' ట్రైలర్‌

Bellamkonda Sai Sreenivas Bhairavam Movie Teaser: మరో పుష్ప 2 సినిమాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ 'భైరవం'తో ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఈ సినిమా టీజర్‌ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. విడుదలైన ఈ టీజర్‌ ఎలా ఉందో తెలుసుకుందాం.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jan 20, 2025, 06:51 PM IST
Bhairavam Teaser: 'పుష్ప'ను మించి బెల్లంకొండ శ్రీనివాస్‌.. ఊరమాస్‌గా 'భైరవం' ట్రైలర్‌

Bhairavam Movie Teaser: ఇతర భాషల సినిమాలు తనకు విజయాలు అందిస్తుండడంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ మరో రీమేక్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. యలయాళంలో భారీ హిట్‌ పొందిన 'గరుడన్‌' సినిమాను 'భైరవం'గా తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఆ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయగా.. ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మంచు మనోజ్‌, నారా రోహిత్‌ కూడా నటిస్తున్నారు. గ్రామం కోసం ముగ్గురు మిత్రులు ఏం చేశారనే నేపథ్యంగా సినిమా ఉంటున్నట్లు తెలుస్తోంది. గ్రామంలో ఉన్న ఆలయం సంరక్షణ కోసం ముగ్గురు మిత్రులు ఏం చేశారనేది సినిమా కథలాగా కనిపిస్తోంది.

Also Read: VK Naresh: 'మా అమ్మ కోసం కేసీఆర్‌ తీవ్రంగా కృషి చేశారు': సీనియర్‌ నటుడు నరేశ్‌

విజయ్‌ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన భైరవం టీజర్‌ జయసుధ డైలాగ్‌తో ప్రారంభమవుతుంది. 'రాత్రి నాకో కల వచ్చింది' అంటూ జయసుధ మాట్లాడుతుండగా సాయి శ్రీనివాస్‌, మంచు మనోజ్‌, నారా రోహిత్‌ రౌద్రంగా కనిపిస్తారు. 1.27 నిమిషాల ఈ టీజర్‌ ప్రేక్షకుల్లో సరికొత్త అంచనాలు రేపుతోంది. 'ఆ రామలక్ష్మణులను సముద్రం దాటించేందుకు ఆంజనేయుడు ఉంటే.. ఈ రామ లక్ష్మణులకు ఏ కష్టం రాకుండా చూసుకునేందుకు ఈ శ్రీనుగాడు ఉన్నాడు' అంటూ సాయి శ్రీనివాస్‌ ఆవేశంతో మాట్లాడుతాడు. టీజర్‌ చివర్లో సాయి శ్రీనివాస్‌ నటన.. డ్యాన్స్‌ 'పుష్ప 2'లో అల్లు అర్జున్‌ రేణుక జాతర సన్నివేశాలు గుర్తుకు వస్తున్నాయి.

Also Read: Manchu Manoj: మంచు మనోజ్‌ సంచలన వ్యాఖ్యలు.. 'మా నాన్నను మంచు విష్ణు నడిపిస్తున్నాడు'

ఈ సినిమాలో గేమ్‌ ఛేంజర్‌ దర్శకుడు శంకర్‌ కుమార్తె అదితి శంకర్‌ హీరోయిన్‌గా రంగప్రవేశం చేస్తుండగా.. దివ్యా పిళ్లై, ఆనంది హీరోయిన్లుగా నటిస్తున్నారు. చాలా రోజుల తర్వాత నారా రోహిత్‌, మంచు మనోజ్‌ వస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ బ్యానర్‌లో కెకె రాధామోహన్‌ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు శ్రీ చరణ్‌ పాకాల సంగీతం అందిస్తున్నాడు. పెన్‌ స్టూడియోస్‌ సినిమాను సమర్పిస్తోంది. చిత్రీకరణలో ఉన్న ఈ సినిమాను త్వరితగతిన పూర్తి చేసి ఈ వేసవిలో విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News