National Award: తన మొదటి సినిమా అర్జున్ రెడ్డి తోనే సెన్సేషనల్ విజయం సాధించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఇక ఆ తర్వాత ఏకంగా బాలీవుడ్ లో ఇదే సినిమాని కబీర్ సింగ్ గా తీసి అక్కడ కూడా సక్సెస్ సాధించారు. ప్రస్తుతం తన మూడోవ సినిమగా మళ్లీ హిందీ హీరో తో జత కట్టి యానిమల్ అనే చిత్రంతో మన ముందుకి రాబోతున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా తెరకెక్కించిన ఈ ఇంటెన్స్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
కాగా ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో ఈ చిత్ర ప్రమోషన్స్ లో యమ యాక్టివ్ గా పాల్గొంటున్నారు సందీప్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఆయన మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నేషనల్ అవార్డ్స్ గురించి చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని తన వైపు తిప్పుతున్నాయి.
నేషనల్ అపార్ట్ సంపాదించిన తొలి తెలుగు హీరోగా అల్లు అర్జున్ ఈ మధ్య తన పుష్పా సినిమాతో చరిత్ర కెక్కిన సంగతి తెలిసిందే. కాగా అల్లు అర్జున్ కి వచ్చిన నేషనల్ అవార్డు గురించి మాట్లాడుతూ.. తాను ఆ విషయం వినగానే ఏంటో సంతోష పడిన్నట్లు చెప్పుకొచ్చారు. అయితే ఈ 69 సంవత్సరాల నేషనల్ అవార్డు ఎందుకు రాలేదు, అంతకుముందు హీరోలకు నేషనల్ అవార్డు అసలు ఎందుకు ఇవ్వలేదని సందేహం వ్యక్తం చేశారు. బహుశా మనవాళ్ళు నేషనల్ అవార్డుని చాలా లైట్ తీసుకోని ఉండి ఉంటారని, అసలు అవార్డు కోసం సరిగ్గా అప్లై చేసి ఉండరని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు దర్శకుడు సందీప్ రెడ్డి. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.
కాగా సందీప్ రెడ్డి యానిమల్ తర్వాత ప్రభాస్ సినిమా చేయనుండగా ఆ తర్వాత అల్లు అర్జున్ కాంబినేషన్ లో కూడా ఒక సినిమా చేయబోతున్నట్లు ఈ మధ్యనే ప్రకటించారు. యానిమల్ తరువాత సందీప్ వంగా, ప్రభాస్ తో ‘స్పిరిట్’ మూవీని తెరకెక్కించబోతున్నారు. వచ్చే సంవత్సరం సెప్టెంబర్ నుంచి ఈ సినిమా పట్టాలు ఎక్కనుంది. 2025లో ఈ మూవీని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేలా ఈ చిత్ర మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్
Also Read: Belly Fat: బెల్లీ ఫ్యాట్ లేదా అధిక బరువు సమస్య వేధిస్తోందా..ఈ 3 అలవాట్లు మానండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook