Balakrishna: అలాంటి వ్యక్తిని నేను చూడలేదు.. బాలకృష్ణతో నాకు చాలెంజింగ్ గా ఉంది: బాబీ డియోల్

NBK109: ఈ మధ్య విడుదలైన సినిమాలలో ఎక్కువగా వార్తల్లో నిలిచిన సినిమా యానిమల్. ఈ సినిమాలో రణబీర్ కపూర్ పర్ఫామెన్స్ కి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వానికి ఎన్ని మార్కులు పడ్డాయో.. బాబీ డియోల్ క్యారెక్టర్ కి కూడా అన్నే మార్కులు పడ్డాయి.. కాగా ప్రస్తుతం ఈ నటుడు మన బాలయ్య గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి…  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 12, 2023, 07:00 PM IST
Balakrishna: అలాంటి వ్యక్తిని నేను చూడలేదు.. బాలకృష్ణతో నాకు చాలెంజింగ్ గా ఉంది:  బాబీ డియోల్

Bobby Deol: యానిమల్ సినిమాలో హీరోతో పాటు అంతటి పేరు తెచ్చుకున్న మరో క్యారెక్టర్ బాబీ డియోల్ క్యారెక్టర్. ఈ చిత్రం సెకండ్హ్యాఫ్ లో రణబీర్ క్యారెక్టర్ కన్నా కూడా బాబీ క్యారెక్టర్ మరింత పవర్ఫుల్ గా కనిపించి మెప్పించింది. ఏ సినిమాలో అయినా విలన్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉన్నప్పుడే హీరో పాత్ర మరింత ఎలివేట్ అవుతుంది. కాగా ఆ విలన్ పాత్ర ఎలివేట్ అవ్వాలి అంటే ఆ పాత్రలో నటించి నటుడు అద్భుతంగా నటించాలి. ఈ నటనకు 100% న్యాయం చేశారు బాబీ డియోల్.

ఈ సినిమాలో బాబీ డియోల్ క్యారెక్టర్ చూసిన దగ్గర నుంచి మన తెలుగువారు ఈ నటుడు మన తెలుగు సినిమాల్లో కూడా విలన్ గా కనిపిస్తే భలే ఉంటుంది అని అనుకుంటున్నారు. కాగా బాబీ డియోల్ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాకి సైన్ చేశారు. అయితే ఈ సినిమా షూటింగ్ అనుకోని కారణాలవల్ల ప్రస్తుతం ఆగిపోయింది. ఇక ఇప్పుడు ఈయన సైన్ చేసిన మరో చిత్రం బాలకృష్ణ తదుపరి సినిమా.

బాలయ్య 109 సినిమాలో విలన్‌గా రోల్ కోసం ఈ చిత్రం మేకర్స్ బాబీ డియోల్ ని తీసుకున్నారు. కాగా ఈ సినిమా కోసం పని చేయడం, ఆ అనుభవాల గురించి బాబీ డియోల్ ఈ మధ్య జరిగిన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ముందుగా బాలకృష్ణ గురించి మాట్లాడుతూ..’బాలా సార్‌ చాలా మంచి వ్యక్తి.. ఆయనని నేను సినిమా సెట్స్ మీద కలిశాను.. చాలా ఎనర్జీతో ఉంటాడు.. అంతలా ఎనర్జీతో ఉండే వ్యక్తిని నేను ఎప్పుడు చూడలేదు.. అది గాడ్ గిఫ్ట్.. ఆయనతో కలిసి పని చేయడం అద్భతంగా ఉంటుంది.. ఎంతో ఛాలెజింగ్‌గా ఉంది' అంటూ చెప్పుకొచ్చారు బాబీ డియోల్.

ప్రస్తుతం బాబి డియోల్ బాలకృష్ణ గురించి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.

కాగా ప్రస్తుతం ఈ అనిమల్ విలన్ కి తెలుగులో మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ ఎక్కువగానే కనిపిస్తోంది. ఇప్పటికే మైత్రీ మూవీస్, గోపీచంద్ మలినేని కాంబోలో వస్తున్న ప్రాజెక్టుకి బాబీ డియోల్‌నే తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మరి హిందీలో తన సత్తా చాటిన ఈ యాక్టర్ మన తెలుగులో ఎలాంటి సక్సెస్ సాధిస్తారో వేచి చూడాలి.

Also Read:  Alla Ramakrishna Reddy: వైసీపీకి బిగ్‌షాక్.. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఆర్కే రాజీనామా

Also Read:  Allu Arjun: హాయ్ నాన్న రివ్యూ ఇచ్చేసిన అల్లు అర్జున్.. నానిపై ప్రశంసలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News