Amitabh bachchan: అల్లు అర్జున్‌పై బిగ్ బీ అమితాబ్ ప్రశంసలు.. బన్నీ ఏంచెప్పాడంటే..?

Allu Arjun: బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అల్లు అర్జున్ పై ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలో అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ తాను బన్నీకి పెద్ద ఫ్యాన్ అంటూ చెప్పుకొచ్చారు. దీంతో బన్నీ ఒక్కసారిగా ఫుల్ హ్యాపీగా ఫీలయినట్లు తెలుస్తొంది.  

Written by - Inamdar Paresh | Last Updated : Dec 10, 2024, 10:02 AM IST
  • బన్నీనీ పొగిడిన అమితాబ్..
  • నమ్మకలేకపోతున్నానంటూ అల్లు అర్జున్ రిప్లై..
Amitabh bachchan: అల్లు అర్జున్‌పై బిగ్ బీ అమితాబ్ ప్రశంసలు.. బన్నీ ఏంచెప్పాడంటే..?

Amitabh Bachchan interesting comments on allu arjun: పుష్ప2 మూవీ ప్రస్తుతం రికార్డుల మోత మోగిస్తుందని చెప్పుకొవచ్చు. డిసెంబర్ 5న ఈ మూవీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం పుష్ప 2 మూవీ నాలుగు రోజుల్లోనే 800 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తొంది. అదే విధంగా వారంలోనే ఈ మూవీ వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిపోతుందని కూడా వార్తలు వస్తున్నాయి.

ఇక ఈ సినిమా తెలుగులోనే కాకుండా.. హిందిలో కూడా రఫ్ఫాడిస్తుందని చెప్పుకొవచ్చు. ఈ మూవీవిడుదలకు ముందే అనేక రికార్గులు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. మరొవైపు విడుదలయ్యాక.. రికార్డుల పరంగా మాత్రమే కాకుండా.. కాంట్రవర్షీ అంశాల పరంగా కూడా తరచుగా వార్తలలో ఉంటుంది. ఈ నేపథ్యంలోఈ మూవీ సక్సెస్ మీట్ కార్యక్రమంలో ఇటీవల పుష్పరాజ్ మాట్లాడుతూ.. తనకు బాలీవుడ్ లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అంటే ఎంతో ఇష్టమని, చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసుకుంటూ పెరిగినట్లు చెప్పారు.

తాజాగా, అమితాబ్ బచ్చన్ దీనిపై రియాక్ట్ అయ్యారు. పుష్ప2 సినిమా అద్భుతంగా ఉందని చెప్పిన ఆయన.. మీ నటన మాత్రం మరొ లెవల్ అంటూ అల్లు అర్జున్ పై ప్రశంసలు కురిపించారు. అంతే కాకుండా.. పుష్ప2 సినిమాలో బన్నీ నటన చూసి అమితాబ్ బచ్చన్ ఫిదా అయ్యారంట. అంతేకాకుండా..  మీ టాలెంట్ కు, పనితీరుకు పెద్ద ఫ్యాన్ అయిపోయానని ప్రశంసించారు.

Read more: Amaran movie: సినిమాలో ఫోన్ నంబర్ వివాదంలో బిగ్ ట్విస్ట్... విద్యార్థికి దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన అమరన్ టీమ్..

మరిన్ని మంచి సినిమాలు తీసి,హిట్ లు సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు ఇన్. స్టాలో పోస్ట్ పెట్టారు. దీనికి బన్నీ మరల రిప్లై ఇస్తు.. మీరు ఎంతో మందికి ఆదర్శమని బన్నీ అన్నాడు. అంతే కాకుండా.. తనపై చూపించిన ప్రేమ, అభిమానానికి చలా ధన్యవాదాలు అంటూ కూడా  బన్నీ ఎమోషనల్ గా రిప్లై ఇచ్చినట్లు తెలుస్తొంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News