Allu Sirish Movie Release: ఎట్టకేలకు అల్లు శిరీష్ సినిమాకు మోక్షం.. రిలీజ్ ఎప్పుడంటే?

Allu Sirish - Geetha Arts movie to release on Nov 4th: అల్లు శిరీష్ హీరోగా గీతా ఆర్ట్స్ సంస్థ చేసిన సినిమా విడుదలకు సిద్దమవుతోంది. ఆ వివరాలు

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 23, 2022, 08:17 PM IST
Allu Sirish Movie Release: ఎట్టకేలకు అల్లు శిరీష్ సినిమాకు మోక్షం.. రిలీజ్ ఎప్పుడంటే?

Allu Sirish - Geetha Arts movie to release on Nov 4th: అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్ గతంలో గౌరవం అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయనకు చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటి కూడా పడలేదు. చివరిగా కరోనా ముందు ఏ బి సి డి అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ముందుకు వచ్చాడు అల్లు శిరీష్. అయితే ఆ తర్వాత అల్లు శిరీష్ హీరోగా అను ఇమ్మానియేల్ హీరోయిన్ గా గీతా ఆర్ట్స్ సంస్థ ఒక సినిమా ప్రకటించింది.

ప్రేమ కాదంట అనే టైటిల్ రివీల్ చేశారు కానీ ఆ సినిమా అసలు పూర్తయిందా లేదా అనే విషయం మీద ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు. అయితే తాజాగా టాలీవుడ్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు ఆ సినిమా ఇప్పటికే పూర్తయిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చకచకా జరుగుతున్నాయని తెలుస్తోంది.

నవంబర్ నెలలో రిలీజులు తక్కువగా ఉన్నాయి అని భావిస్తున్న గీతా ఆర్ట్స్ సంస్థ సినిమాని నవంబర్ 4వ తేదీన విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసిందని తెలుస్తోంది. నిజానికి అల్లు శిరీష్ విభిన్నమైన సినిమాలు చేయడానికి ప్రయత్నించాడు. ఆయన మొత్తం ఐదు సినిమాలు చేస్తే 5 విభిన్నమైన జానార్లకు సంబంధించిన సినిమాలే కానీ ఏ ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

ఈసారి గట్టి కంబ్యాక్ ఇవ్వాలని భావిస్తున్న అల్లు శిరీష్ ఇప్పటికే ఇద్దరు డైరెక్టర్లతో చర్చలు జరుపుతున్నారని ఆ రెండు స్క్రిప్ట్లలో ఏదో ఒక దాన్ని ఫైనల్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. సోదరుడు అల్లు అర్జున్ ఫ్యాన్ ఇండియా స్థాయికి వెళ్లడంతో తాను తెలుగులో నిలదొక్కుకోవడానికి అల్లు శిరీష్ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. 

Also Read: God Father Re Shoot: సెన్సార్ అయ్యాక గాడ్ ఫాదర్ రీ షూట్.. ఇదేదో తేడాగా ఉందే!

Also Read: GodFather: సెన్సార్ అధికారుల నుంచి అద్భుతమైన ప్రశంస.. గాల్లో తేలిపోతున్న గాడ్‌ఫాదర్‌ డైరెక్టర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News