Pushpa 2: మొదలైన పుష్ప మాస్ జాతర.. టీజర్ డేట్ ఖరారు

Pushpa 2 update:ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ పై..ఆయన ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులు అందరిలో కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి. కాగా ఆ అంచనాలను అందుకుంటూ ఈరోజు ఈ సినిమా నుంచి పుష్ప మాస్ జాతర అప్డేట్ విడుదలై అందరినీ తెగ ఆకట్టుకుంటోంది..

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 2, 2024, 04:52 PM IST
Pushpa 2: మొదలైన పుష్ప మాస్ జాతర.. టీజర్ డేట్ ఖరారు

Pushpa mass jaathara:

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో వస్తోన్న పాన్ ఇండియన్ చిత్రం ‘పుష్ప-2’. 2021లో రిలీజ్ అయిన ‘పుష్ప’ సినిమాకు సీక్వెల్‌గా ఈ ‘పుష్ప-ది రూల్’ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తుండగా.. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ఈ చిత్రంపై అంచనాలను పెంచుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి మరో బిగ్ అప్డేట్ ఇవ్వనున్నట్లు.. నిన్న ఈ సినిమా మేకర్స్ సోషల్ మీడియాలో తెలిపారు. 

‘పుష్ప మాస్ జాతర ప్రారంభమవుతుంది. అందరూ ఎదురుచూస్తున్న ఓ అప్డేట్ ఈరోజు సాయంత్రం 4:05 గంటలకు ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆగష్టు 15న పుష్ప 2 గ్రాండ్ రిలీజ్ అవుతుంది’ అని ఈరోజు ఉదయం కూడా మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. ఈ క్రమంలో మాటలు నిలబెట్టుకుంటూ ఫైనల్ గా ఈరోజు సాయంత్రం సినిమా అప్డేట్ ఇచ్చేశారు చిత్ర యూనిట్

కాగా పుష్పా నుంచి విడుదలైన ఈ మాస్ జాతర అప్డేట్ ఏమిటి అనగా ఈ సినిమా టీజర్ ని అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 8న విడుదల చెయ్యబోతున్నాము అని తెలియజేశారు. ఇక ఈ అప్డేట్ తో పాటు అల్లు అర్జున్ కాళ్ళకి గజ్జలు కట్టుకున్న ఫోటోని షేర్ చేశారు.

 

ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా కీలక పాత్రల్లో ఫహాద్ ఫాసిల్, అనసూయ, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, సునీల్, రావు రమేష్ తదితరులు నటిస్తున్నారు. కాగా ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ గ్రాండ్ గా ఆగష్టు 15న ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.

Also Read: Harish Rao: రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఇవ్వాలో రేపో ఎప్పుడూ కూలుతుందో..? హరీశ్ రావు సందేహం

Also Read: KTR Vs Kishan Reddy: గాలికి గెలిచిన కిషన్‌ రెడ్డికి ఈసారి ఓటమే.. ఇదే నా ఛాలెంజ్‌: కేటీఆర్‌

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News