Shehzada Teaser : అలవైకుంఠపురములో రీమేక్ టీజర్.. ఆడేసుకుంటున్న నెటిజన్లు.. కార్తీక్ ఆర్యాన్‌కు కష్టాలే?

Ala Vaikunthapurramuloo Hindi Remake అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో సినిమాను హిందీలో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. అందులో కార్తీక్ ఆర్యాన్ హీరోగా నటించిన విషయమూ తెలిసిందే.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 22, 2022, 05:31 PM IST
  • హిందీలో రాబోతోన్న అలవైకుంఠపురములో
  • కార్తీక్ ఆర్యాన్ పుట్టిన రోజు స్పెషల్ సర్ ప్రైజ్
  • షెహ్‌జాదా టీజర్ నెట్టింట్లో వైరల్
Shehzada Teaser : అలవైకుంఠపురములో రీమేక్ టీజర్.. ఆడేసుకుంటున్న నెటిజన్లు.. కార్తీక్ ఆర్యాన్‌కు కష్టాలే?

Ala Vaikunthapurramuloo Hindi Remake : ప్రస్తుత కాలంలో రీమేక్‌లు ఎంత ప్రమాదంగా మారాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతీ సీన్, షాట్, ఫ్రేమ్‌లో పోలికలు వెతుకుతున్నారు. బ్లాక్ బస్టర్ చిత్రాలను వేరే భాషల్లో రీమేక్ చేయడం కత్తి మీద సాములా మారింది. ఇలాంటి సమయంలో టాలీవుడ్ బ్లాక్ బస్టర్ అల వైకుంఠపురములో సినిమాను హిందీలో రీమేక్ చేశారు. ఈ రీమేక్ మూవీ ఆల్రెడీ విడుదలవ్వాల్సింది. కానీ కర్ఓ్నా వల్ల వాయిదా పడుతూనే వచ్చింది.

ఇక ఈ సినిమా విషయంలో అనేక వాగ్వాదాలు, వివాదాలు వచ్చాయి. బన్నీకి పుష్ప సినిమాతో మంచి క్రేజ్ రావడంతో.. అల వైకుంఠపురములో సినిమాను కూడా హిందీలో డబ్ చేసి వదిలేద్దామని అనుకున్నారు.కానీ కార్తీక్ ఆర్యాన్ మాత్రం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాడు. అలా గనుక ఇక్కడ రిలీజ్ చేస్తే ఈ సినిమాను ఇక నేను చేయను అంటూ భీష్మించుకుని కూర్చున్నాడట. మొత్తానికి హిందీలో డబ్ చేయాలనే ఆలోచనను అంతా విరమించుకున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News