Akhanda 2 Movie: లొకేషన్ల కోసం అన్వేషణ.. అఖండ 2 'పని' మొదలుపెట్టిన బోయపాటి

Akhanda 2 Movie Big Update Boyapati Selects Gudimetla Village: వెండితెరపై అద్భుత విజయం సాధించిన 'అఖండ'కు సీక్వెల్‌ సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సినిమా సన్నివేశాల కోసం దర్శకుడు బోయపాటి శ్రీనివాస్‌ అన్వేషణ మొదలుపెట్టారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jan 21, 2025, 11:47 PM IST
Akhanda 2 Movie: లొకేషన్ల కోసం అన్వేషణ.. అఖండ 2 'పని' మొదలుపెట్టిన బోయపాటి

Akhanda 2 In Gudimetla: సంచలన విజయాన్ని నమోదు చేసిన అఖండ సినిమా సీక్వెల్‌ కోసం దర్శకుడు బోయపాటి శ్రీనివాస్‌ షూటింగ్‌ లొకేషన్ల అన్వేషణ చేపట్టారు. సినిమాలో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించేందుకు అనువైన స్థలాలను అన్వేషిస్తూ కృష్ణమ్మ ఒడిలోని ప్రాంతాలను చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా నది ఒడ్డున పర్యటించారు. ఈ సందర్భంగా బోటులో తిరుగుతూ.. గుర్రపు బడ్డీలో తిరుగుతూ బోయపాటి హల్‌చల్‌ చేశారు.

Also Read: Tirumala Actors: తిరుమలలో 'సార్‌' హీరోయిన్‌ ప్రత్యేక పూజలు.. ఇతర ప్రముఖులు కూడా

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న బోయపాటి శ్రీనివాస్‌ దర్శకత్వంలో 'అఖండ' సినిమా అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ సినిమాకు కొనసాగింపుగా అఖండ 2 సీక్వెల్‌ చేస్తున్నారు. ఇప్పటికే కథ సిద్ధమవగా.. కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించినట్లు సమాచారం. ఇక సినిమాలో కీలకమైన సన్నివేశాల చిత్రీకరణకు బోయపాటి షూటింగ్‌ లొకేషన్లు అన్వేషిస్తున్నారు. సినిమా ఘాటింగ్ లోకేషన్స్ చూసేందుకు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు.

Also Read: Bhairavam Teaser: 'పుష్ప'ను మించి బెల్లంకొండ శ్రీనివాస్‌.. ఊరమాస్‌గా 'భైరవం' ట్రైలర్‌

కృష్ణానది ఒడ్డున కలిగిన గుడిమెట్ల ప్రాంతం ఎంతో చరిత్ర కలిగిన ప్రాంతం కావడంతో ఇక్కడకు బోయపాటి శ్రీనివాస్‌ వచ్చారు. గుడిమెట్ల నుంచి వేదాద్రి వరకు కృష్ణా నదిపై బోయపాటి పడవ ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా సినిమా షూటింగ్‌కు అనువైన ప్రాంతాలు పరిశీలించారు. అనంతరం గుర్రంబండిపై తిరిగారు. తన కొడుకుతో కలిసి కోనాయపాలెంకు చెందిన లాయర్ ఉదయ్ గుర్రంపై బోయపాటి స్వారీ చేయడం ఆకట్టుకుంది. కాగా బోయపాటి వచ్చారని తెలుసుకున్న స్థానిక ప్రజలు అతడిని చూసేందుకు వచ్చారు. ఈ సందర్భంగా కొందరితో ఫొటోలు దిగారు. ఈ గ్రామం షూటింగ్‌కు ఎంపిక చేసుకున్నారని.. త్వరలో సినిమా షూటింగ్‌ ప్రారంభిస్తారని తెలుస్తోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News