Allu Arjun: మీకు సిగ్గు, శరం ఉందా..?.. అల్లు అర్జున్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన జనసేన అడ్వకేట్ ..

Allu Arjun: అల్లు అర్జున్ పై జనసేన అడ్వకేట్ మండిపడ్డారు. చనిపోయిన రేవతి కుటుంబానికి రూ. 25 లక్షల పరిహరం ఇచ్చి చేతులు దులుపుకొవాలని అనుకుంటున్నారా.. అంటూ ఫైర్ అయ్యారు.

Written by - Inamdar Paresh | Last Updated : Dec 7, 2024, 02:15 PM IST
  • అల్లు అర్జున్ టీమ్ పై రెచ్చిపోయిన అడ్వకేట్..
  • ఏమైన ముష్టి వేస్తున్నారా.. అంటూ వ్యాఖ్యలు..
Allu Arjun: మీకు సిగ్గు, శరం ఉందా..?.. అల్లు అర్జున్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన జనసేన అడ్వకేట్ ..

Advocate shanti prasad singaluri fires on allu arjun:  అల్లు అర్జున్ హీరోగా చేసి పుష్ప2 మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్నిరికార్డులను తిరగరాస్తుంది. ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల ఈ సినిమా వివాదాలకు కేరాఫ్ గా మారిందని చెప్పుకొవచ్చు. ఇదిలా ఉండగా.. ఇటీవల పుష్ప2 మూవీ రిలీజ్ నేపథ్యంలో మూవీని చూసేందుకు వచ్చిన ఒక కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.  హైదారాబాద్ లోని సంధ్య థియేటర్ లో.. పుష్ప2 షో చూసేందుకు దిల్ సుఖ్ నగర్ నుంచి రేవతి తన భర్త, పిల్లలతో వచ్చింది. అయితే.. తోపులాటలో రేవతి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి చనిపోయినట్లు తెలుస్తొంది.

ఆమె కుమారుడు శ్రీతేజ్ మాత్రం ఆస్పత్రిలో ఇంకా చికిత్స తీసుకుంటున్నాడు. తాజాగా, ఈ ఘటనపై అల్లు అర్జున్ నిన్న (శనివారం) ఒక వీడియో రిలీజ్ చేశారు.ఈ ఘటన పట్ల తమ సంతాపం వ్యక్తం చేశారు. దీనిపై తాను.. తమ టీమ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుందన్నాడు. అదే విధంగా బాధిత  కుటుంబానికి తమ టీమ్ అండగా ఉంటుందని చెప్పుకొచ్చారు.

సదరు కుటుంబానికి ఈ లోటు మాత్రం పూడ్చలేదని చెబుతూ.. తను మాత్రం.. పిల్లలు అవసరాల కోసం.. రూ.25 లక్షలను వారి కుటుంబానికి అందజేస్తామని కూడా అల్లు అర్జున్ చెప్పారు. ఈ నేపథ్యంలో దీనిపై మరల వివాదం రాజుకుందని తెలుస్తొంది. తాజాగా, జనసేన అడ్వకేట్ శాంతి ప్రసాద్ సింగలూరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్, ఆయన టీమ్ ను ఏకీ పారేశారు. మీకు సినిమాకు.. రూ..300ల కోట్ల రెమ్యునరేషన్ కావాలి.. కలెక్షన్ లు..రూ. 2వేల కోట్లు ఉండాలి.. కానీ.. మీ సినిమా చూసేందుకు వచ్చిచనిపోయిన అభిమానికి మాత్రం.. కేవలం 25 లక్షలు ఇస్తారా.. అంటూ మండి పడ్డారు.

Read more: Konda Surekha: మరో వివాదంలో మంత్రి కొండా సురేఖ.. ఈ సారి ఏంచేశారంటే..?

మీకు సిగ్గు , శరం ఉందా..?.. మిమ్మల్ని మనుషులంటారా.. అని ఫైర్ అయ్యారు. మానవత్వం అంటే.. ఇదేనా.. కేసు మాఫీ కోసం.. ముష్టి వేస్తున్నారా.. అంటూ అడ్వకేట్ సింగలూరీ  పుష్ప2 టీమ్ కు చుక్కలు చూపించారు. మరోవైపు ఈ టీమ్ పై పోలీసులు ఇప్పటికే కేసులను నమోదు చేశారు. మరొవైపు.. అల్లు అర్జున్ కు ఆయన టీమ్ కు నోటీసులు ఇచ్చేందుకు సైతం.. చిక్కడపల్లి రెడీ అయిపోయినట్లు తెలుస్తొంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

Trending News