Adipurush Theaters: హనుమంతుడితో కలిసి ఆదిపురుష్ చూద్దాం.. సరికొత్త ప్లాన్ తో రిలీజ్?

Adipurush team to dedicate a seat: తెలుగు రాష్ట్రాల్లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ 185 కోట్ల రూపాయలకు ఆదిపురుష్ దక్కించుకుని రిలీజ్ చేస్తుండగా ఈ నేపథ్యంలో ఆ నిర్మాణ సంస్థ ఒక సరికొత్త సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంది.

Written by - Chaganti Bhargav | Last Updated : Jun 7, 2023, 09:55 AM IST
Adipurush Theaters: హనుమంతుడితో కలిసి ఆదిపురుష్ చూద్దాం.. సరికొత్త ప్లాన్ తో రిలీజ్?

Adipurush team to dedicate 1 seat in every theatre to Lord Hanuman:  ప్రభాస్ రాముడిగా కృతి సనన్ సీతగా సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా ఓం రౌతు దర్శకత్వంలో తెరకెక్కిన ఆది పురుష్ సినిమా ఈ జూన్ 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలతో పాటు పలు విదేశీ భాషల్లో గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక ఈ సినిమాకి పది రోజుల ముందు అంటే ఈరోజు జూన్ 6వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని తిరుపతి శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ గ్రౌండ్స్ లో భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మునుపెన్నడూ లేని విధంగా చిన్న జీయర్ స్వామి ముఖ్యఅతిథిగా హాజరు కాబోతున్నారు. సినిమా రిలీజ్ దగ్గర పడుతూ ఉండడంతో సినిమా యూనిట్ ప్రమోషన్స్ లో తీవ్రంగా వేగం పెంచేసింది. ఇక ఈ సినిమాని పూర్తిగా ఆధ్యాత్మిక పెంపొందించే విధంగా జై శ్రీరామ్ అంటూ పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు.

Also Read: Keerthy Suresh Photos: పొట్టి గౌనులో కీర్తి సురేష్ అందాల విందు.. హీటెక్కిస్తోందిగా!

తెలుగు రాష్ట్రాల్లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ 185 కోట్ల రూపాయలకు దక్కించుకుని రిలీజ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆ నిర్మాణ సంస్థ ఒక సరికొత్త సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంది . తాజాగా సినిమా రిలీజ్ గురించి థియేటర్స్ గురించి అధికారికంగా ఒక లెటర్ రిలీజ్ చేశారు. ఆ లెటర్ లో రామాయణ పారాయణం జరిగే ప్రతి చోటికి హనుమంతుడు విచ్చేస్తాడు అనేది మన నమ్మకం, ఈ నమ్మకాన్ని గౌరవిస్తూ ప్రభాస్ రాముడిగా నటించిన ఆది పురుష్ సినిమాని ప్రదర్శించే ప్రతి ధియేటర్లో ఒక సీటు విక్రయించకుండా హనుమంతుడి కోసం ప్రత్యేకంగా కేటాయించడం జరుగుతోంది.

అతి గొప్ప రామభక్తునికి గౌరవ మర్యాదలు సమర్పిస్తూ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా ఈ గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టాం, ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యంత భారీ హంగులతో నిర్మించిన ఆది పురుషుని హనుమంతుడి సమక్షంలో అందరూ తప్పక వీక్షిద్దాం అంటూ ప్రెస్ నోట్లో పేర్కొనడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు తెలుగు సినీ చరిత్రలోనే కాదు మరే సినిమా చరిత్రలోను ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు అని అంటున్నారు.

Also Read: Lavanya tripathi Photos: ఎంగేజ్మెంట్ కి ముందు లావణ్య హాట్ ట్రీట్.. వదినమ్మా అంటున్న నెటిజన్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News