ఆ మర్డర్ ఎవరు చేశారు..?

యంగ్ హీరో నవదీప్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న తాజా చిత్రం 'రన్'. ఫస్ట్ ఫేమ్ ఎంటర్ టెయిన్ మెంట్ ఈ చిత్రాన్ని రూపుదిద్దుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రెయిలర్ విడుదల చేశారు.

Last Updated : May 24, 2020, 01:30 PM IST
ఆ మర్డర్ ఎవరు చేశారు..?

యంగ్ హీరో నవదీప్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న తాజా చిత్రం 'రన్'. ఫస్ట్ ఫేమ్ ఎంటర్ టెయిన్ మెంట్ ఈ చిత్రాన్ని రూపుదిద్దుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రెయిలర్ విడుదల చేశారు.

సినిమాలో హీరోయిన్ పూజిత పొన్నాడ.. అనుమానాస్పదస్థితిలో మృతి చెందుతుంది. ఐతే అది మర్డర్ కేసుగా పోలీసులు అనుమానిస్తారు. దీంతో ఈ కథలో ఆరుగురు వ్యక్తులు పరుగుపెడుతూనే ఉంటారు. ఇంతకీ ఈ మర్డర్ ఎవరు చేశారు.? ఎందుకు చేశారు.?అన్నదే మిగతా కథాంశం.

సినిమాలో నవదీప్ తోపాటు పూజిత పొన్నాడ నటిస్తోంది. చాలా రోజుల గ్యాప్ తర్వాత హీరో వెంకట్ మళ్లీ తెరంగేట్రం చేశాడు. ఈ సినిమాకు లక్ష్మీకాంత్ చెన్న దర్శకత్వం వహిస్తున్నాడు. నరేష్ కుమరన్ సంగీతం అందిస్తున్నాడు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News