తెలంగాణ సర్కార్‌కు మంచు లక్ష్మి లేఖ.. ఆ విషయంలో కలిసి పనిచేసేందుకు సిద్ధమని...

Manchu Lakshmi Letter to Telangana Govt:  తెలంగాణ ప్రభుత్వం చేపట్టబోతున్న 'మన ఊరు-మన బడి' పథకంపై సినీ నటి మంచు లక్ష్మి ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని ప్రకటించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 22, 2022, 03:43 PM IST
  • తెలంగాణ ప్రభుత్వంపై మంచు లక్ష్మి ప్రశంసలు
  • మన ఊరు మన బడి పథకంపై ప్రశంసలు కురిపించిన మంచు లక్ష్మి
  • ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని ప్రకటన
 తెలంగాణ సర్కార్‌కు మంచు లక్ష్మి లేఖ.. ఆ విషయంలో కలిసి పనిచేసేందుకు సిద్ధమని...

Manchu Lakshmi Letter to Telangana Govt: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టబోతున్న 'మన ఊరు-మన బడి' పథకంపై సినీ నటి మంచు లక్ష్మి (Manchu Lakshmi) ప్రశంసలు కురిపించారు. ఇది చాలా సంతోషకరమైన వార్త అని.. ఈ పథకం ద్వారా నాణ్యమైన విద్యతో పాటు ఎంతోమంది బాలికలు తమ కలల్ని నిజం చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లవుతుందని పేర్కొన్నారు. ఇందుకు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మంచు లక్ష్మి తెలంగాణ ప్రభుత్వానికి (Telangana Govt) ఓ లేఖ రాశారు.

'దేశంలో ఆడపిల్లల స్కూల్ డ్రాపౌట్స్‌కు ప్రధాన కారణం స్కూల్స్‌లో టాయిలెట్స్ లేకపోవడం. మన దేశంలో ప్రభుత్వ పాఠశాలల మౌలిక సదుపాయాలకు వెచ్చించే నిధులు చాలా తక్కువ. అందుకే ప్రైవేట్ పాఠశాలలు విపరీతంగా పెరిగిపోయాయి. దేశంలో ఉచిత నాణ్యమైన విద్యను పొందడమనేది ఒక ప్రాథమిక హక్కు. తెలంగాణ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం బోధనకు 'మన ఊరు-మన బడి' అనే విప్లవాత్మక పథకానికి నేను చాలా సంతోషిస్తున్నాను.' అని మంచు లక్ష్మి చెప్పుకొచ్చారు. గడిచిన ఏడేళ్లలో తమ 'టీచ్ ఫర్ చేంజ్' ఆర్గనైజేషన్ ద్వారా 42,608కి పైగా బాలికలకు ప్రాథమిక విద్యను అందించినట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. 

రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.7,239 కోట్లు వెచ్చించాలని ఇటీవలి కేబినెట్ మీటింగ్‌లో ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. 'మన ఊరు-మన బడి' (Mana Ooru Mana Badi) పథకం ద్వారా ఈ నిధులను ఖర్చు చేయనున్నారు. మొదటి దశలో దాదాపు 9,123 ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఇంగ్లీష్ మీడియం బోధనను ప్రవేశ పెట్టనున్నారు. అయితే ఇన్నేళ్లు విద్య గురించి పట్టించుకోని కేసీఆర్ సర్కార్.. ఈ విషయంలో ఆలస్యంగా మేల్కొందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వచ్చే ఏడాది ఎన్నికలు ఉండబట్టే ప్రభుత్వం ఇప్పుడు విద్యపై ఫోకస్ పెట్టిందని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Lakshmi Manchu (@lakshmimanchu)

 

Also Read: BSNL Recruitment 2022: బీఎస్ఎన్‌ఎల్‌లో ఉద్యోగాలు... నెలకు రూ.75 వేలు వేతనం

 

Also Read: Mumbai Fire Accident: ముంబైలో భారీ అగ్ని ప్రమాదం, ఏడుగురు మృతి, 20 మందికి గాయాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News