Man Killed Livein Partner by Slicing her Throat: రోజురోజుకు అనేక సంచలన క్రైమ్ ఘటనలు తెరమీద వస్తూనే ఉన్నాయి. తాజాగా తనతో లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్న ఒక మహిళ గొంతు కోసి చంపేశాడు ఒక వ్యక్తి. ఈ ఘటన జరిగిన ఏడు నెలల తర్వాత పోలీసులు ఈ కేసును చేదించి సదరు వ్యక్తిని అరెస్ట్ చేసిన ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలుపుతున్న వివరాల ప్రకారం ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ జిల్లాలోని వసుంధర అనే ప్రాంతానికి చెందిన వృద్ధురాలు ఈ నెల 18వ తేదీన పోలీసులు దగ్గరికి వెళ్లి తన 35 ఏళ్ల కుమార్తె కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. మే నుంచి ఆమె ఆచూకీ కనిపించడం లేదని ఫిర్యాదులో పోలీసులకు తెలియ చేసింది. ఈ నేపథ్యంలోనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఆమె కుమార్తె మొబైల్ ఫోన్ నుంచి కీలక వివరాలు రాబట్టారు, అందులో రామన్ అనే యువకుడి ఫోన్ నెంబర్ సంపాదించిన పోలీసులు అతనితోనే ఎక్కువగా సదరు మిస్సయిన యువతి మాట్లాడినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇక ఆ నెంబర్ ఆధారంగా వసుంధరలోనే అతను నివసిస్తున్నాడని తెలుసుకొని అదుపులోకి తీసుకున్నారు. ముందు తనకు ఆమెకు ఏం జరిగిందో తెలియదని బుకాయించిన సదరు యువకుడు పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో నిజం ఒప్పుకోవాల్సి వచ్చింది.
అంతకుముందే వీరిద్దరూ కలిసిన చివరి లొకేషన్ హిమాచల్ ప్రదేశ్ లోని కులులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇదే విషయాన్ని ఆధారాలతో సహా చూపించి పోలీసులు అడగడంతో ఇక నిందితుడు నిజం ఒప్పుకున్నాడు. ఏడు నెలల క్రితం అంటే మే పద్దెనిమిదవ తేదీన కొలువు ప్రాంతానికి తీసుకెళ్లి కారులోనే గొంతు కోసి హత్య చేశానని తనను పెళ్లి చేసుకోమని పదేపదే ఒత్తిడి చేస్తుండగా అలా చేశానని సదరు నిందితుడు ఒప్పుకున్నాడు.
ఆమెను పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని అందుకే ఆమెను చంపానని పోలీసులకు రామన్ వెల్లడించారు. ఇక కొన్ని నెలల క్రితం బాధితురాలికి రామన్ కి మధ్య పెద్ద గొడవ జరిగిందని ఆ తర్వాత అతని నుంచి దూరం అయ్యేందుకు రామన్ ను వదిలించుకునేందుకు ప్రయత్నించిందని బహుశా అందువల్లే రామ్ ఆమెను చంపి ఉండవచ్చని ఆమె స్నేహితురాలు అభిప్రాయపడింది.
Also Read: Chalapathi Rao: బుధవారం నాడు అంత్యక్రియలు.. అప్పటిదాకా మృతదేహం అక్కడే!
Also Read: Chalapathi Rao: ఆరోజుల్లోనే క్రేజీ లవ్ స్టోరీ.. వారంలో పెళ్లి.. 27 ఏళ్లకే భార్య మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.