Sirohi: ఉద్యోగాల ఆశచూపి 20 మందిపై అత్యాచారం.. కాంగ్రెస్‌ కీలక నాయకుడు అరెస్ట్‌

Anganwadi Jobs: పదవిని అడ్డం పెట్టుకుని ఓ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు అక్రమాలకు తెరలేపాడు. అమాయకులైన నిరుద్యోగ యువతులకు ఉద్యోగాల పేరు చెప్పి వారిని వంచించాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో కోర్టు రంగంలోకి దిగడంతో వారు కటకటాల పాలయ్యారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 11, 2024, 06:05 PM IST
Sirohi: ఉద్యోగాల ఆశచూపి 20 మందిపై అత్యాచారం.. కాంగ్రెస్‌ కీలక నాయకుడు అరెస్ట్‌

Crime On Women: అధికారంలో ఉన్నామని చెప్పి యువతులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించారు. అనంతరం వారికి ప్రత్యేకంగా వసతి సౌకర్యాలు, భోజనం అందించారు. అందులోనే మత్తు పదార్థం కలిపి యువతులపై అత్యాచారానికి పాల్పడ్డారు. తమపై జరిగిన దాడితో కుమిలిపోయిన బాధితులు పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించగా న్యాయం దక్కలేదు. పోలీసులు కూడా నిందితులకు వంతపాడడంతో ఓ బాధితురాలు కోర్టును ఆశ్రయించింది. కోర్టు తీర్పుతో నిందితులపై కేసు నమోదైంది. అరెస్ట్‌తో వారి బాధితులు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. ఇద్దరు నిందితులు కలిపి 20 మంది యువతులను దారుణంగా మోసం చేశారు. ఉద్యోగం పేరు చెప్పి సామూహిక అత్యాచారాలకు పాల్పడ్డారు. వాటిని వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డారని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు.

Also Read: Honey Trap: సింగోటం హత్యకేసులో బిగ్‌ ట్విస్ట్‌.. ఇది తల్లీకూతురు నడిపే 'క్రైమ్ కథా చిత్రం'

రాజస్థాన్‌లోని సిరోహి జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు మహేంద్ర మేవాడా సిరోహి మున్సిపల్‌ చైర్మన్‌ పదవిలో ఉన్నారు. మాజీ మున్సిపల్‌ కౌన్సిల్‌ కమిషనర్‌ మహేంద్ర చౌదరితో చైర్మన్‌తో కలిసి గతంలో పని చేశారు. వీరిద్దరూ చాలా అక్రమాలకు పాల్పడ్డారు. అంగన్‌వాడీ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వీరిద్దరూ మహిళలు, యువతులను నమ్మించారు. తమకు తెలిసిన కొన్ని ప్రాంతాల్లో మహిళలకు  ఆశ్రయమిచ్చి మత్తు మందు కలిపిన ఆహారం అందించారు. వారు స్పృహలో లేని సమయంలో వారిపై వీరిద్దరూ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అదే సమయంలో వీటిని వీడియో తీయించారు.

Also Read: Bajrang Dal: ప్రేమికులకు అలర్ట్.. వాలంటైన్స్‌ డే రోజు బయటతిరగొద్దని బజరంగ్ దళ్ హెచ్చరిక

స్పృహ వచ్చాక జరిగిన దారుణం చూసి మహిళలు బాధపడ్డారు. ఎవరికైనా చెబితే వీడియోలు బయటకు పంపిస్తామని మహేంద్ర మేవాడా, మహేంద్ర చౌదరి బెదిరింపులకు పాల్పడ్డారు. వీడియోలు బయటకు రాకుండా ఉండాలంటే బాధిత మహిళల నుంచి రూ.లక్షల్లో డబ్బులు వసూలు చేశారు. ఇలా వారి బారిన మొత్తం 20 మంది మహిళలు మోసపోయారు. వీరి వేధింపులు తాళలేక ఓ బాధితురాలు పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించింది. ఫిర్యాదు చేస్తే పోలీసులు కూడా నిందితులకు వంతపాడారు. మీరు చేసేది ఆరోపణలు మాత్రమేనని చెప్పి కేసు నమోదు చేయలేదు. బాధితులంతా కలిసి హైకోర్టును ఆశ్రయించారు. వీరి కేసును తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం వెంటనే పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. వెంటనే నిందితులపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేయాలని ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాలతో పోలీసుల్లో కదలిక వచ్చింది. నిందితులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కేసును వెంటనే దర్యాప్తు చేయాలని హైకోర్టు ఆదేశాలతో పోలీసులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు.

కాగా వారిద్దరూ చేసిన అరాచకాలు, మోసాలు ఒక్కోటిగా వెలుగులోకి వస్తున్నాయి. సిరోహి ప్రాంతంలో వీరిదే హవా అని బాధితులు చెబుతున్నారు. ఒక్కొక్కరి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసినట్లు ఓ బాధితురాలు మీడియా ముందు వాపోయింది. మహేంద్ర మేవాడా స్థానికంగా గుండాగిరి నడిపిస్తున్నాడని ఆరోపించింది. అతడు, అతడి అనుచరులు ఆగడాలు శృతి మించాయని స్థానికులు కూడా వాపోతున్నారు. వారి బారిన మోసపోయిన మిగతా బాధితులు కూడా ఫిర్యాదు చేసేందుకు ముందుకు వస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News