Girl Selling Kidney: అమ్మకానికి తెలుగమ్మాయి కిడ్నీ.. ఉల్టా 16 లక్షలు లాస్

Girl Selling Kidney Lost 16 lakhs Rupees: తన ప్లాన్‌ని ఇంప్లిమెంట్ చేసే క్రమంలో భాగంగా ఆన్‌లైన్‌లో తన కాంటాక్ట్ డీటేల్స్ ఇస్తూ కిడ్నీని అమ్మకానికి పెట్టింది. ఆ పోస్ట్ కాస్తా సైబర్ క్రిమినల్స్ కంట్లో పడింది. ఆమె అత్యవసరాన్ని గ్రహించిన సైబర్ క్రిమినల్స్ .. ఆమె నుంచి డబ్బులు కొట్టేసేందుకు కొత్త ఎత్తుగడ వేశారు. 2 లక్షలు కాదు.. కోటి రూపాయలకు మీ కిడ్నీ కొంటామంటూ ప్రవీణ్ రాజ్ అనే వ్యక్తి ఆమెను సంప్రదించాడు.

Written by - Pavan | Last Updated : Dec 16, 2022, 07:38 AM IST
  • తండ్రికి తెలియకుండా ఖాతాలోంచి డబ్బులు కొట్టేసిన కూతురు
  • కిడ్నీని విక్రయించి ఆ డబ్బులను తిరిగి ఖాతాలో జమ చేసేందుకు యత్నం
  • యువతిని ఘోరంగా మోసం చేసిన సైబర్ స్కామర్స్
Girl Selling Kidney: అమ్మకానికి తెలుగమ్మాయి కిడ్నీ.. ఉల్టా 16 లక్షలు లాస్

Girl Selling Kidney Lost 16 lakhs Rupees: డబ్బులు అవసరం ఉందనే ఉద్దేశంతో కేవలం రూ. 2 లక్షల కోసం తనకున్న రెండు కిడ్నీల్లో ఒక కిడ్నీని అమ్మకానికి పెట్టింది ఓ యువతి. తాను తన కిడ్నీని అమ్మడానికి సిద్ధంగా ఉన్నానని.. అవసరమైన వారు తనని సంప్రదించవచ్చని ఆన్‌లైన్‌లో ప్రకటన ఇచ్చింది. ఆ ప్రకటన చూసిన సైబర్ క్రిమినల్స్.. ఆమె అవసరాన్ని ఆసరాగా చేసుకుని ఏకంగా 16 లక్షల రూపాయలకు టోకరా వేశారు. 

అసలేం జరిగిందంటే.. 
గుంటూరుకి చెందిన ఒక విద్యార్థినిని హైదరాబాద్‌లో ఉండి నర్సింగ్ విద్యను అభ్యసిస్తోంది. తన తండ్రికి తెలియకుండా తండ్రి ఖాతాలోంచి 2 లక్షలు విత్‌డ్రా చేసిన ఆ యువతి.. తిరిగి తండ్రికి తెలియకుండానే ఆ మొత్తాన్ని డిపాజిట్ చేయాలని భావించింది. ఆలస్యం చేస్తే తన తండ్రికి అసలు విషయం తెలిసిపోతుందనే భయంతో ఆ 2 లక్షలు ఎలాగైనా సరే వీలైనంత త్వరగా డిపాజిట్ చేయాలని అన్ని ప్రయత్నాలు చేసింది. కానీ తన వద్ద అంత డబ్బు లేకపోవడం, మరొక ఆదాయ వనరులు కూడా ఏమీ లేకపోవడంతో చివరకు తనకు ఉన్న రెండు కిడ్నీల్లో ఒకదానిని 2 లక్షల రూపాయలకు విక్రయించి.. ఆ కిడ్ని అమ్మేయగా వచ్చిన డబ్బును తండ్రి ఖాతాలో జమ చేయాలని అనుకుంది. 

2 లక్షల కోసం కిడ్నీని అమ్మకానికి పెట్టిన యువతి చేత 16 లక్షలు కట్టించుకున్నారు..
తన ప్లాన్‌ని ఇంప్లిమెంట్ చేసే క్రమంలో భాగంగా ఆన్‌లైన్‌లో తన కాంటాక్ట్ డీటేల్స్ ఇస్తూ కిడ్నీని అమ్మకానికి పెట్టింది. ఆ పోస్ట్ కాస్తా సైబర్ క్రిమినల్స్ కంట్లో పడింది. ఆమె అత్యవసరాన్ని గ్రహించిన సైబర్ క్రిమినల్స్ .. ఆమె నుంచి డబ్బులు కొట్టేసేందుకు కొత్త ఎత్తుగడ వేశారు. 2 లక్షలు కాదు.. కోటి రూపాయలకు మీ కిడ్నీ కొంటామంటూ ప్రవీణ్ రాజ్ అనే వ్యక్తి ఆమెను సంప్రదించాడు. కోటి రూపాయల్లో తొలుత 50 లక్షలు సర్జరీ కంటే ముందే అడ్వాన్స్ ఇస్తామని.. కాకపోతే వివిధ రకాలు పన్నులతో పాటు పోలీసు వెరిఫికేషన్ కింద రూ. 16 లక్షలు చెల్లించాలంటూ యువతికి చెప్పారు. ఆమెను నమ్మించేందుకు గాను బ్యాంకులో ఖాతా తెరిచి అందులో కోటి రూపాయలు డిపాజిట్ చేసి బ్యాలెన్స్ చూపించారు. తనతో సంప్రదింపులు జరుపుతోంది ఒక సైబర్ క్రిమినల్స్ ముఠా అనే విషయం తెలియని ఆ యువతి.. వారి మాయ మాటలు నమ్మి వారి ట్రాప్‌లో పడింది.

హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లిన యువతి
సైబర్ క్రిమినల్స్ మాటలు నమ్మిన ఆ యువతి.. తనకు కోటి రూపాయలు వస్తున్నాయి కదా అనే ఆనందంలో సైబర్ క్రిమినల్స్ అడిగిన 16 లక్షలు వారి ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేసింది. తనకు రావాల్సిన 50 లక్షల కోసం అడగ్గా.. ఢిల్లీలో ఒక అడ్రస్ ఇచ్చి అక్కడ డబ్బులు తీసుకోవాల్సిందిగా చెప్పారు. మరోసారి వారి మాటలు నమ్మిన యువతి.. గుడ్డిగా ఢిల్లీ వరకు వెళ్లింది. అక్కడికి వెళ్లాకే తెలిసింది.. అదంతా ఉత్తి మోసం.. అది ఫేక్ అడ్రస్ అని. 

కూతురి విషయం తండ్రికి ఎలా తెలిసిందంటే..
తన బ్యాంకు ఖాతాలోంచి డబ్బులు మాయం అవడం, కూతురి ఎకౌంట్లోకి డబ్బులు వెళ్లడం పసిగట్టిన తండ్రి కూతురికి ఫోన్ చేశాడు. హైదరాబాద్‌లో హాస్టల్ ఖాళీ చేసి ఇంటికి రావాల్సిందిగా చెప్పాడు. దాంతో తన తప్పిదం ఎక్కడ బయటపడుతుందోననే భయంతో ఆమె హాస్టల్ ఖాళీ చేసి పారిపోయింది. కూతురు భయంతో పారిపోయిందని తెలుసుకున్న తండ్రి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొబైల్ నెంబర్ ఆధారంగా యువతి ఆచూకీ పసిగట్టారు. ఫ్రెండ్ ఇంట్లో తలదాచుకున్న యువతిని పోలీసులు ఆమె తండ్రికి అప్పగించారు. యువతి చేసిన పొరపాటు, సైబర్ క్రిమినల్స్ చేతిలో మోసపోయిన తీరు అలా బయటికి వెలుగుచూసింది.

ఇది కూడా చదవండి : Hyderabad Prostitution Racket: హైదరాబాద్‌లో సంచలన కేసు.. ఇంటర్నేషనల్ వ్యభిచార ముఠా గుట్టురట్టు.. ఏకంగా 1419 మంది అమ్మాయిలతో..

ఇది కూడా చదవండి : Man ate woman: యువతిని రేప్ చేసి, చంపి, మాంసం తిని, శిక్ష లేకుండా తప్పించుకున్నాడు.. కానీ

ఇది కూడా చదవండి : Woman's Revenge Story: మరొకరిని చంపి అదే శవంతో సూసైడ్ స్కెచ్.. సినిమాను తలపించే రివేంజ్ డ్రామా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News