Child Marriages: ఆధునిక యుగంలో కన్యాశుల్కం ఘటన..కలకలం రేపుతున్న రియల్ సీన్..!

Child Marriages: ప్రస్తుత కాలంలో బాల్య వివాహాలు పెరిగిపోతున్నాయి. ఎంత అవగాహన కల్పించినా..వాటిని అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది.

Written by - Alla Swamy | Last Updated : Sep 27, 2022, 08:15 PM IST
  • పెరిగిపోతున్న బాల్య వివాహాలు
  • తాజాగా మరో ఘటన
  • దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Child Marriages: ఆధునిక యుగంలో కన్యాశుల్కం ఘటన..కలకలం రేపుతున్న రియల్ సీన్..!

Child Marriages: వరుడు ఇచ్చిన బంగారం, డబ్బులకు ఆశపడి బాల్య వివాహానికి సిద్ధపడ్డారు బాధితురాలి తల్లిదండ్రులు. వారే బలవంతంగా పెళ్లి చేశారు. ఈఘటన వైఎస్‌ఆర్ కడప జిల్లాలో చోటుచేసుకుంది. కడప నగరానికి చెందిన ఓ బాలిక(16 ఏళ్లు)..ఓ యువకుడిని ప్రేమించింది. ఈవిషయం తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో ఎలాగైనా పెళ్లి చేయాలని భావించారు. 40 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తితో పెళ్లి చేశారు. ఇందుకు అతడు 7 తులాల బంగారం, రూ.2 లక్షల నగదను బాలిక పేరెంట్స్‌కు ఇచ్చాడు. 

పెళ్లి తర్వాత అతడితో ఆమెను కాపురానికి పంపారు. అతడితో కాపురం చేయడం ఇష్టం లేని బాధితురాలు..పోలీసులను ఆశ్రయించింది. కడప ఎస్పీకి స్పందనలో ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. బాలిక తల్లిదండ్రులు, భర్తను విచారిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్వం మన దేశంలో కన్యాశుల్కం ఉండేది. బాలికలు, యువతులను 60 ఏళ్లు దాటి వ్యక్తి ఇచ్చి పెళ్లి చేసేవారు.

కడప జిల్లాలో జరిగిన దారుణం కన్యాశుల్కం ఘటనను గుర్తు చేస్తోంది. ఇలాంటి ఘటన అధికంగా గ్రామాల్లో చోటుచేసుకుంటున్నాయి. ముక్కుపచ్చనారని బాలికలకు పెళ్లీడు రాకుండానే మెట్టినింటికి పంపుతున్నారు. 12 నుంచి 15 ఏళ్ల లోపు బాలికలకు త్వరగా పెళ్లిళ్లు చేస్తున్నారు. పట్టణాలు, నగరాల్లో మాత్రం పరిస్థితి మారిపోయింది. బాగా చదువుకున్న అమ్మాయిలు 24 ఏళ్ల తర్వాత పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. బాల్య వివాహాలపై మహిళ సంఘాలు ఆందోళనలు కొనసాగుతున్నాయి. 

Also read:Assault On Student: వాడు నా ప్రైవేట్ పార్ట్స్ ఒత్తుతూ లైంగికంగా వేధించాడు.. కాలేజ్ స్టూడెంట్ ఫిర్యాదు

Also read:XI Jinping: జిన్‌పింగ్ గృహ నిర్బంధమంతా ఫేక్‌..ఆయన ఎక్కడ కనిపించారంటే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News