Upcoming Mobiles in July 2023: జూలై నెల మెుదలైంది. ఈ నెలలో కొన్ని అదిరిపోయే ఫోన్లు లాంఛ్ కానున్నాయి. ఐక్యూ, వన్ ఫ్లస్, నథింగ్ వంటి సంస్థలు ఈ నెలలో తమ స్మార్ ఫోన్స్ ను రిలీజ్ చేయనున్నాయి. ఈ మెుబైల్స్ అన్నీ మంచి ఫ్రోసెసర్స్ తో వస్తున్నాయి. అంతేకాకుండా ధరలు కూడా మిడ్ రేంజ్ లోనే ఉండే అవకాశం ఉంది. ఈ నెలలో లాంచ్ అయ్యే మెుబైల్స్ ఏంటో ఓ లుక్కేయండి.
ఐక్యూ నియో 7 ప్రో( iQOO Neo 7 Pro)
ఐక్యూ నుంచి రాబోతున్న మరో ఫ్లాగ్ షిప్ ఫోన్ iQOO Neo 7 Pro. ఇది జూలై 04న ఇండియాలో లాంఛ్ అవ్వనుంది. ఇది స్నాప్ డ్రాగన్ 8 ప్లస్ 1 ప్రోసెసర్ తో వస్తుంది. అంతేకాకుండా ఇది "ఇండిపెండెంట్ గేమింగ్ చిప్"ని కలిగి ఉంటుంది. ఈ మెుబైల్ 120Hz అమెలోడ్ డిస్ప్లే, 5,000mAh బ్యాటరీ మరియు 120W ఫాస్ట్ ఛార్జింగ్‌తో రాబోతుంది. మెయిన్ కెమెరా 50 మెగాఫిక్సల్ తోపాటు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కలిగి ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 16 మెగాఫిక్సల్ ఉంటుంది.
వన్ ఫ్లస్ నార్డ్ 3 (OnePlus Nord 3, Nord CE 3)
వన్ ఫ్లస్ నార్డ్ 3, వన్ ఫ్లస్ నార్డ్ సీఈ 3 కూడా జూలై మెుదటి వారంలోనే ఇండియాలో లాంచ్ కానున్నాయి. వన్ ఫ్లస్ నార్డ్ 3 మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్ సెట్ తో వస్తుంది. బ్యాక్ 64 మెగాఫిక్సల్, ప్రంట్ 16 మెగాఫిక్సల్ కెమెరాలను కలిగి ఉంటుంది. అండ్రాయిడ్ 13 వెర్షన్ తో 5000mAh బ్యాటరీ, 80W ఫాస్టింగ్ ఛార్జింగ్ సపోర్టుతో రాబోతుంది.
నథింగ్ ఫోన్ (2) (Nothing Phone 2)
చాలా మంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తునన మెుబైల్స్ లో నథింగ్ ఫోన్ (2) కూడా ఒకటి. దీనిని స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి జూలై 11న లాంచ్ చేయనున్నారు. దీనికి సంబంధించి ప్రీ ఆర్డర్స్ జూన్ 29 నుంచి మెుదలయ్యాయి. ఇది స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 చిప్ సెట్ తో రాబోతుంది. 4,750mAh బ్యాటరీతో వచ్చే అవకాశం ఉంది. ఇది "గ్లిఫ్ ఇంటర్ఫేస్"ని కలిగి ఉంటుంది. జూలై విడుదలయ్యే ఫోన్స్ లో ఇది బెస్ట్ గా నిలిచే అవకాశం ఉంది.
Realme Narzo 60 సిరీస్
రియల్మీ ఇండియాలో నార్జో సిరీస్‌ను జూలైలో లాంఛ్ చేయడానికి రెడీ అవుతుంది. ప్రస్తుతం నార్జో 60 మరియు 60 ప్రో మోడల్‌లు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. నార్జో 60 ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రోసెసర్ తో రాబోతుంది. అండ్రాయిడ్ 13 వెర్షన్ కలిగి ఉండటంతోపాటు 64మెగా ఫిక్సల్ కెమెరాతో రాబోతుంది.
Also Read: New Rules in July: జూలై నెలలో మీపై ప్రభావం చూపే కొత్త రూల్స్ ఇవే.. ఈ సారైనా వాటి ధరలు తగ్గుతాయా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook