Union Budget 2024 Updates: కేంద్ర బడ్జెట్ పై భారీగా ఆశలు పెట్టుకున్న వేతన జీవులకు కాస్తంత నిరాశే ఎదురైంది.నిర్మలమ్మ పద్దులో స్వల్ప ఊరట లభించింది. స్టాండర్డ్ డిడక్షన్ పరిధిని కొద్దిగా పెంచారు. కేపిటల్ గెయిన్స్ పన్ను పరిమితిని పెంచారు. బడ్జెట్ లో మార్పుల ప్రకారం కొత్త స్లాబ్ రేట్లు ఇలా ఉన్నాయి.
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2024లో ట్యాక్స్ పేయర్లకు స్వల్ప ఊరట లభించింది. న్యూ ట్యాక్స్ రెజీమ్ గురించే బడ్జెట్ లో ప్రస్తావన ఉంది. ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్ గురించి బడ్జెట్లో ఎలాంటి ప్రస్తావన లేదు. స్టాండర్డ్ డిడక్షన్ 50 వేల నుంచి 75 వేలకు పెంచారు. ట్యాక్స్ స్లాబ్ రేట్లలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. స్డాండర్డ్ డిడక్షన్ వాస్తవానికి 1 లక్ష వరకూ పెరుగుతుందని ట్యాక్స్ పేయర్లు ఆశించారు. కానీ ప్రభుత్వం కేవలం 25 వేలే పెంచింది
0-3 లక్షల వరకూ నో ట్యాక్స్
3-7 లక్షల వరకూ 5 శాతం ట్యాక్స్
7-10 లక్షల వరకూ 10 శాతం ట్యాక్స్
10-12 లక్షల వరకూ ఆదాయంపై 15 శాతం ట్యాక్స్
12-15 లక్షల వరకూ ఆదాయంపై 20 శాతం ట్యాక్స్
15 లక్షలు దాటితే 30 శాతం ట్యాక్స్
బడ్జెట్ లో చేసిన మార్పులతో వేతన జీవులకు 17,500 రూపాయలు ట్యాక్స్ ఆదా అవుతుందని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఉద్యోగులందర్నీ ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్ నుంచి న్యూ ట్యాక్స్ రెజీమ్ వైపుకు బదిలీ చేసేలా ఈ మార్పులు చేసినట్టు తెలుస్తోంది. ఇక లాంగ్ టర్మ్ కేపిటల్ గెయిన్స్ పన్ను పరిమితిని 2.5 లక్షలకు పెంచారు.
Also read: Union Budget 2024 Updates: ఏపీ రాజధాని అభివృద్ధికి 15 వేల కోట్ల కేటాయింపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook