Union Budget 2024 Updates: కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పూర్తి స్థాయి సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టారు. వరుసగా ఏడవసారి బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డు సాధించారు నిర్మలా సీతారామన్. గతంలో మొరార్జీ దేశాయ్ 1959 నుంచి 1964 వరకూ ఆరు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇప్పుడీమె ఏడు సార్లు ఆ ఘనత సాధించారు. ఈసారి బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు ప్రాధాన్యత దక్కింది.
ఏయే ధరలు పెరగనున్నాయి
కాంపౌండ్ రబ్బరు, కాపర్ స్క్రాప్, సిగరెట్, విమానయానం, పీవీసీ ఫ్లెక్స్ బ్యానర్, పెట్రో కెమికల్స్, అమోనియం నైట్రేట్
ధరలు తగ్గనున్న వస్తువులు
బంగారం, వెండి ధరలు, స్మార్ట్ ఫోన్, మొబైల్ ఛార్జర్, మొబైల్ బ్యాటరీ, ఎలక్ట్రిక్ వాహనాలు, లిథియం బ్యాటరీ, కేన్సర్ మందులు, ప్లాటినం, ఫిష్ ఫుడ్, తోలు వస్తువులు, ఎక్స్ రే పరికరాలు, చెప్పులు, 25 ఇతర ఖనిజాలు
కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో బంగారం-వెండి వస్తువులపై కస్టమ్ డ్యూటీ 4 శాతం తగ్గించారు. ఈ రెండింటిపై బేసిక్ కస్టమ్ డ్యూటీ 10 శాతం నుంచి ఇప్పుడు శాతమైంది. ఇక వ్యవసాయ పన్నుతో కలిపి మొత్తం పన్ను 15 శాతం నుంచి 11 శాతమైంది. బడ్జెట్ ప్రకటన తరువాత బంగారం, వెండి వస్తువుల ధరలు తగ్గాయి. బంగారం ఏకంగా 2 వేల రూపాయలు తగ్గిపోయింది. అటు వెండి ధర 3 వేల వరకూ తగ్గింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook