దేశీయ ఐటీ దిగ్గజమైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ( Tata Consultancy Services ) అరుదైన ఘనత సాధించింది. ఆ కాస్సేపు ప్రపంచంలోని విలువైన ఐటీ కంపెనీగా నిలిచింది. అదే సమయంలో ఉద్యోగులకు టీసీఎస్ తీపి కబురు అందించింది.
ఇండియన్ ఐటీ కంపెనీల్లో చెప్పుకోదగ్గ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లేదా టీసీఎస్ ( TCS ). ఈ కంపెనీ ఇవాళ మార్కెట్లో అరుదైన ఘనతను సాధించింది. బిజినెస్ పరంగా చూస్తే యాక్సెంచర్ ( Accenture ) అధిగమించి కొద్దిసేపు ప్రపంచంలోనే అత్యంత విలువైన ఐటీ కంపెనీగా నిలిచింది. అంటే అక్టోబర్ 8 క్లోజింగ్ గణాంకాల ప్రకారం...టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ( Market Capitalization ) 144.7 బిలియన్ డాలర్లు కాగా, యాక్సెంచర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ మాత్రం 143.1 బిలియన్ డాలర్లకు పడిపోయింది. యాక్సెంచర్ దాటిన వెంటనే కొద్దిసేపు ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా మారిపోయింది.
ఇక టీసీఎస్ ఈ వారం ప్రారంభంలో మరో కీలక మైలురాయిని చేరుకుంది. రిలయన్స్ ఇండస్ర్టీస్ ( Reliance industries ) తరువాత 10 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ సాధించిన రెండవ భారతీయ కంపెనీగా టీసీఎస్ నిలిచింది. కంపెనీ షేర్ ధర పెరగడంతో టీసీఎస్ మార్కెట్ విలువ ఏకంగా 69 వేల 82.25 కోట్లు ఎగిసి... ట్రేడ్ ముగిసే సమయానికి బీఎస్‌ఈలో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 10 లక్షల15 వేల 714 కోట్లకు ఎగబాకింది. కాగా దేశంలో 10 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను అధిగమించిన తొలి భారతీయ కంపెనీగా రిలయన్స్ ఇండస్ర్టీస్ గతంలో నిలిచిన సంగతి తెలిసిందే. రెండో స్థానాన్ని ఇప్పుడు టీసీఎస్ దక్కించుకుంది. ఇక ఇదే వారంలో బుధవారం నాడు టీసీఎస్ 16 వేల కోట్ల షేర్ల బైబ్యాక్ ప్రణాళికను ప్రకటించింది.
కరోనా నేపధ్యంలోనూ, అంతకుముందు సైతం పలు కంపెనీలు లేఆఫ్‌లు, వేతన కోతలు విధించడంతో పాటు ఏడాది పాటు ప్రమోషన్లు, జీతాలపెంపును నిలిపివేసిన నేపథ్యంలో టీసీఎస్ మాత్రం తమ ఉద్యోగులందరికీ వేతనాలను పెంచనుంది. టీసీఎస్ వేతన పెంపు నిర్ణయం ఐటీ రంగానికి తీపికబురుగా మారింది. Also read: Delhi Pollution: కాలుష్య నివారణకు స్మాగ్ టవర్ నిర్మాణం, ట్రీ ప్లాంటేషన్