Mahindra Xuv Ev Cars: టాటాకు పోటీగా మహీంద్రా ఈవీ కార్లు, ఫిబ్రవరి 10న మహీంద్రా ఎక్స్‌యూవీ 700 ఈవీ లాంచ్

Mahindra Xuv Ev Cars: మహీంద్రా ఇటీవల ప్రవేశపెట్టిన ఎక్స్‌యూవీ 400 ఈవీ కారు బుకింగ్స్‌కు క్రేజ్ పెరుగుతోంది. కేవలం 5 రోజుల వ్యవధిలోనే 10 వేల కార్లు బుక్కయ్యాయి. మహీంద్రా త్వరలో ఎక్స్‌యూవీ 700 ఈవీ వెర్షన్ లాంచ్ చేయనుంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 6, 2023, 12:19 PM IST
Mahindra Xuv Ev Cars: టాటాకు పోటీగా మహీంద్రా ఈవీ కార్లు, ఫిబ్రవరి 10న మహీంద్రా ఎక్స్‌యూవీ 700 ఈవీ లాంచ్

మహీంద్రా కంపెనీ ఇటీవలే ఇండియన్ మార్కెట్‌లో తొలి ఎలక్ట్రిక్ వాహనం ఎక్స్‌యూవీ 400 లాంచ్ చేసింది. ఈ కారు బుకింగ్స్ వేగంగా నమోదవుతున్నాయి. కేవలం 5 రోజుల్లోనే 10 వేల కార్లు బుక్ అయ్యాయి. ఇక మహీంద్రా ఇప్పుడు త్వరలో లాంచ్ చేయనున్న ఎక్స్‌యూవీ 700 పై దృష్టి సారించింది. 

మహీంద్రా కంపెనీ 2022 ఆగస్టు నెలలో 5 ఫ్యూచర్ ఈవీ కార్లను యూకేలో ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలను ఇండియాలో కూడా లాంచ్ చేయనుంది. దీనికి సంబంధించి ఫిబ్రవరి 10న ఈవెంట్ నిర్వహిస్తోంది. మహీంద్రా అప్‌కమింగ్ ఎలక్ట్రిక్ ఎక్స్‌యూవీకు రెండు వేర్వేరు బ్రాండ్లు ఉన్నాయి. ఎక్స్‌యూవీ ఇ మరియు బిఈ, ఎక్స్‌యూవీ ఇలో మళ్లీ రెండు మోడల్స్ ఉంటే..బీఈ వెర్షన్‌‌లో మూడు మోడల్స్ ఉన్నాయి. ఎక్స్‌యూవీ ఇ రేంజ్ అన్నింటికంటే ముందుగా డిసెంబర్ 2024 నుంచి ఉత్పత్తి ప్రారంభం కానుంది. ఆ తరువాత 2025 నుంచి బీఈ మోడల్ ఉత్పత్తి అవుతుంది. 

త్వరలో మహీంద్రా ఎక్స్‌యూవీ 700 ఈవీ

మహీంద్ర ఎక్స్‌యూవీ సిరీస్‌లో ఇప్పటికే పెట్రోల్, డీజిల్ వెర్షన్ కార్ల అమ్మకాలు సాగిస్తోంది. ఇప్పుడు ఎక్స్‌యూవీ 700 చాలా ప్రాచుర్యం పొందింది. ఎలక్ట్రిక్ కార్లలో ఈ మోడల్‌కు కొత్త గుర్తింపు లభించనుంది. మహీంద్రా ఇండియాలో 5ఈవీ కార్లలో ముదుగా ఎక్స్‌యూవీ ఇ8 లాంచ్ చేయనుంది. తరువాత ఎక్స్‌యూవీ 700 ఈవీ తీసుకురానుంది.

ఇది పూర్తిగా ఎక్స్‌యూవీ 700 ఈవీ వెర్షన్ కాదు. డిజైన్ ఒక్కటే ఎక్స్‌యూవీ 700తో పోలి ఉంటుంది. కంపెనీ ఆ తరువాత ఎక్స్‌యూవీ ఇ9 లాంచ్ చేయబోతుంది. ఇది కూప్ వంటి డిజైన్‌తో పూర్తిగా కొత్త వాహనం. ఏప్రిల్ 2025లో ఉత్పత్తి ప్రారంభం కావచ్చు.

మహీంద్రా ఎక్స్‌యూవీ 400 ఎలక్ట్రిక్ కారు ఇప్పటికే టాటా నెక్సాన్ ఈవీకు మార్కెట్‌పరంగా ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. టాటా త్వరలో ఇండియన్ మార్కెట్‌లో టాటా సఫారీ ఈవీ లాంచ్ చేస్తోంది. ఇది కచ్చితంగా మహీంద్రా ఎక్స్‌యూవీ ఇ8కు పోటీ కానుంది.

Also read: Whatsapp feature: వాట్సప్‌లో సరికొత్త ఫీచర్, ఇక మీ మెస్సేజ్‌లు, చాట్ పిన్ చేసుకోవచ్చు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News