Saving Accounts: సేవింగ్ ఎక్కౌంట్లపై కూడా 8 శాతం వడ్డీ ఇచ్చే ఆరు బ్యాంకులు ఇవే

Saving Accounts: బ్యాంకింగ్ రంగంలో పెరుగుతున్న పోటీని తట్టుకునేందుకు బ్యాంకులు ఎప్పటికప్పుడు వివిధ రకాల ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ఇందులో ముఖ్యమైంది ఆకర్షణీయమైన వడ్డీలు. ఇప్పుడు కొన్ని బ్యాంకులు సేవింగ్ ఎక్కౌంట్లపై మంచి వడ్డీ అందిస్తున్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 31, 2023, 08:11 AM IST
Saving Accounts: సేవింగ్ ఎక్కౌంట్లపై కూడా 8 శాతం వడ్డీ ఇచ్చే ఆరు బ్యాంకులు ఇవే

Saving Accounts: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటు పెంచిన తరువాత సేవింగ్ ఎక్కౌంట్ వడ్డీ రేట్లపై కూడా గణనీయమైన మార్పు కన్పించింది. చిన్న బ్యాంకులు, చిన్న చిన్న ఫైనాన్స్ బ్యాంకులు మంచి మంచి వడ్డీ రేట్లతో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. కొన్ని బ్యాంకులైతే 8 శాతం వరకూ ఇస్తున్నాయి. 

డీసీబీ బ్యాంక్ అయితే మినిమం బ్యాలెన్స్ 2500 రూపాయల్నించి 5000 వరకూ ఉంటే ఆ సేవింగ్ ఎక్కౌంట్లపై 8 శాతం వరకూ వడ్డీ అందిస్తోంది. ఇక ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అయితే పోటా పోటీగా సేవింగ్ ఎక్కౌంట్లపై 7.5 శాతం వరకూ వడ్డీ అందిస్తోంది. ఫెడరల్ బ్యాంక్ మినిమమ్ బ్యాలెన్స్ 5 వేల రూపాయలుంటే ఆ ఎక్కౌంట్లపై 7.15 శాతం వడ్డీ అందిస్తోంది. ఇక ఇతర బ్యాంకుల గురించి పరిశీలిస్తే డీబీఎస్ బ్యాంక్ సేవింగ్ ఎక్కౌంట్లపై మెయింటైన్ చేసే బ్యాలెన్స్ బట్టి 7 శాతం వరకూ వడ్డీ చెల్లిస్తోంది. 

ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఆకర్షణీయమైన వడ్డీ 7 శాతం వరకూ ఇస్తున్నాయి. అయితే కనీస బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. డీబీఎస్ వంటి విదేశీ బ్యాంకులు కూడా పోటీని తట్టుకునేందుకు ఆకర్షణీయమైన వడ్డీని అందిస్తున్నాయి. 

ఇక ఐడీఎఫ్‌సి బ్యాంక్, ఆర్‌బీఎల్ బ్యాంక్లు సేవింగ్ ఎక్కౌంట్లపై ప్రస్తుతం 7 శాతం వరకూ వడ్డీ ఆఫర్ చేస్తుున్నాయి. అయితే బ్యాంక్ బ్యాలెన్స్ 1 లక్ష రూపాయలు దాటిన ఎక్కౌంట్లపై ఈ వడ్డీ ఇస్తున్నాయి. ఇది కాకుండా అదనంగా కాంప్లిమెంటరీ లావాదేవీలుగా నెఫ్ట్, ఆర్టీజీఎస్, చెక్‌లు జారీ చేస్తున్నాయి. 

ఎప్పుడైనా అనుకోని పరిణామాలతో ఉద్యోగం లేకపోయినా, వైద్య ఖర్చులు, ఆకశ్మిక మరమ్మత్తులు లేదా 3-6 నెలల దైనందిన ఖర్చుల కోసం ఎమర్జన్సీ ఫండ్ ప్రయోజనం ఉంటుంది. ఏటీఎం ద్వారా ఆన్‌లైన్ నగదు బదిలీ, డెబిట్ కార్డ్ యాక్సెస్ వంటివి ఉంటాయి. ఎప్పుడైనా రుణం అవసరం వచ్చినా పొందే వెసులుబాటు ఉంటుంది. సేవింగ్ ఎక్కౌంట్స్ అనేవి ఎప్పుడూ క్రమంగా పెరుగుతుంటాయి. కానీ ఏ ప్రతికూల పరిస్థితులు ఎదురైనా రక్షణ కల్పిస్తాయి. సేవింగ్ ఎక్కౌంట్స్‌లో సరిపడిన నగదు ఉంటే అది ఎప్పటికైనా మానసికంగా ప్రశాంతతను ఇస్తుంది. 

చిన్న ప్రైవేట్ బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు సేవింగ్ ఎక్కౌంట్లపై ఆకర్షణీయమైన వడ్జీ ఇస్తున్నాయి. దీనికి కారణం మార్కెట్‌లో పోటీ, రెగ్యులేటరీ పరిస్థితులు, కొన్ని మార్కెట్లపై ప్రత్యేక దృష్టి పెట్టడం వంటివి కారణం కావచ్చు. కారణాలు ఏమైనా సదరు కస్టమర్‌కు మాత్రం ఆకర్షణీయమైన వడ్డీ రూపంలో ప్రయోజనం కలుగుతోంది. అయితే ఏ బ్యాంకు ఎలాంటితో ఓసారి పరిశీలించుకుని సేవింగ్ ఎక్కౌంట్ ప్రారంభించాల్సి ఉంటుంది. 

Also read: KVP Scheme: రిస్క్ లేకుండా పదేళ్లలోపే రెట్టింపు లాభం పొందే అద్భుతమైన పధకం ఇదే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News