RuPay Credit Card: ఇక క్రెడిట్ కార్డుతో యూపీఐ చెల్లింపులు, ఎలా లింక్ చేయాలంటే

RuPay Credit Card: ఇక నుంచి క్రెడిట్ కార్డులతో కూడా యూపీఐ చెల్లింపులు చేసుకోవచ్చు. ఆర్బీఐ నిబంధనల మేరకు ఇప్పటికే కొన్ని బ్యాంకులు తమ క్రెడిట్ కార్డుల్ని యూపీఐ చెల్లింపులకు యాక్సెస్ ఇచ్చేశాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 16, 2024, 12:18 PM IST
RuPay Credit Card: ఇక క్రెడిట్ కార్డుతో యూపీఐ చెల్లింపులు, ఎలా లింక్ చేయాలంటే

RuPay Credit Card: ఇప్పటివరకూ యూపీఐ యాప్‌కు బ్యాంక్ ఎక్కౌంట్లు అనుసంధానితం కావడం తెలుసు. ఇకపై క్రెడిట్ కార్డుల్ని కూడా భీమ్ సహా అన్ని యూపీఐ యాప్‌లకు లింక్ చేయవచ్చు. ఇప్పటివరకూ 17 బ్యాంకులు తమ రూపే క్రెడిట్ కార్డుల్ని యూపీఐకు లింక్ చేసే వెసులుబాటు కల్పించాయి. 

ఆర్బీఐ నిబంధనల మేరకు వివిధ బ్యాంకుల క్రెడిట్ కార్డుల్ని సైతం యూపీఐకు లింక్ చేసి చెల్లింపులు చేసుకోవచ్చు. రూపే క్రెడిట్ కార్డుల్ని యూపీఐకు లింక్ చేసే వెసులుబాటు కలుగుతోందిప్పుడు. అంటే బ్యాంకు ఎక్కౌంట్‌లో ఒకవేళ డబ్బుల్లేకపోయినా యూపీఐ చెల్లింపులు జరుపుకోవచ్చు. మీ రూపే క్రెడిట్ కార్డును యూపీఐకు లింక్ చేసి ఆ చెల్లింపులు చేయవచ్చు. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా రూపే క్రెడిట్ కార్డు ద్వారా యూపీఐ చెల్లింపులకు ఆస్కారం ఏర్పడుతోంది. అంతేకాదు.. ఒకరి నుంచి మరొకరికి కూడా రూపే క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేయవచ్చు. 

2022లో యూపీఐలో రూపే క్రెడిట్ కార్డు సౌకర్యం ప్రారంభమైంది. బ్యాంకు ఎక్కౌంట్‌ను యూపీఐకు లింక్ చేసినట్టే రూపే క్రెడిట్ కార్డును యూపీఐకు అనుసంధానం చేయవచ్చు. ప్రస్తుతం 17 బ్యాంకులు రూరే క్రెడిట్ కార్డుల్ని యూపీఐకు అనుసంధానం చేసే వెసులుబాటు కల్పిస్తున్నాయి. ఇందులో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, సీబీఎస్ బ్యాంక్ , ఫెడరల్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీఎఫ్‌సి బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సరస్వత్ కో ఆపరేటివ్ హబ్యాక్, యూనియన్ బ్యాక్, ఎస్ బ్యాంక్ ఉన్నాయి.

యూపీఐకు ఎలా లింక్ చేయాలి

ముందుగా యూపీఐ యాప్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఎగువన ఎడమ చేతివైపుండే ఐకాన్ క్లిక్ చేయాలి. దిగువకు స్క్రోల్ చేసి లింక్ రూపే క్రెడి్ కార్డు పే విత్ యూపీఐ క్లిక్ చేయాలి. అందులో 17 బ్యాంకులు కన్పిస్తాయి. రూపే క్రెడిట్ కార్డు ఏ బ్యాంకుదో ఆ బ్యాంక్ ఎంచుకోవాలి. ఇప్పుడు ఆ కార్డుతో లింక్ అయిన మొబైల్ నెంబర్ కన్పిస్తుంది. ఇప్పుడు మీ క్రెడిట్ కార్డు చివరి ఆరు అంకెలు ఎంటర్ చేయాలి. మీ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని ధృవీకరించుకోవాలి. ఇప్పుడు యూపీఐ పిన్ జనరేట్ చేసుకుంటే యూపీఐ లింక్ ప్రక్రియ పూర్తవుతుంది. 

Also read: Kangana Ranaut: కంగనా కొత్త కారు చూశారా.. ధర తెలిస్తే మైండ్ బ్లాక్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News