Retirement Planning: ఈ ఐదు పథకాల్లో ఇన్వెస్ట్ చేయండి.. మంచి లాభాలను పొందండి

Regular Income Plans: సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్, ప్రధాన మంత్రి వయ వందన యోజన తదిరత పథకాల్లో ఇన్వెస్ట్ చేసి.. ప్రతి నెల పెన్షన్ రూపంలో మీరు ఆదాయాన్ని పొందవచ్చు. రిటైర్మెంట్ తరువాత లైఫ్ హ్యాపీగా లీడ్ చేసేందుకు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోండి.  

Written by - Ashok Krindinti | Last Updated : Apr 21, 2023, 02:05 PM IST
Retirement Planning: ఈ ఐదు పథకాల్లో ఇన్వెస్ట్ చేయండి.. మంచి లాభాలను పొందండి

Regular Income Plans: దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలని అంటారు. వయసులో ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకుంటే.. భవిష్యత్‌లో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొవచ్చు. అందుకే ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న ప్రతిఒక్కరు రిటైర్మెంట్ తరువాత జీవితం సాఫీగా సాగేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకే మంచి ఆదాయం వచ్చే పథకాల్లో నెల నెల కొంత జమ చేసుకుంటున్నారు. మీరు కూడా ఉద్యోగ విరమరణ తరువాత ఈ ఐదు పథకాలలో ఇన్వెస్ట్ చేయండి. పూర్తి వివరాలు ఇలా..

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్

60 ఏళ్లపైబడిన సీనియర్ సిటిజన్ల కోసం సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ స్కీమ్‌లో త్రైమాసికానికి వడ్డీ చెల్లింపు ఉంటుంది. ఎస్‌సీఎస్ఎస్ స్కీమ్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే ఎక్కువ వడ్డీ రేటు ఉంటుంది. అయితే ఎప్పటికప్పుడు వడ్డీ రేటు మారుతూ ఉంటుంది. ఈ పథకంలో రూ.15 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఐదేళ్లు మెచ్యురిటీ పిరియడ్ ఉంటుంది. మరో మూడేళ్లు పొడిగించుకోవచ్చు.

పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ 

ఉద్యోగ విరమణ చేసిన వారిని ఆకర్షిస్తున్న మరో పథకం పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్. ఈ పథకంలో నిర్ణీత మొత్తంలో నెలవారీ ఆదాయాన్ని పొందవచ్చు. ఈ పథకంలో కూడా ఎఫ్‌డీల కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ రేటు ఉంటుంది. ఈ స్కీమ్‌లో వ్యక్తిగతంగా రూ.4.5 లక్షల వరకు.. జాయింట్ అకౌంట్‌కు రూ.9 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.  

ప్రధాన మంత్రి వయ వందన యోజన

సీనియర్ సిటిజన్లకు కనీస హామీతో ప్రతినెల పెన్షన్ అందజేసే పథకం ప్రధాన మంత్రి వయ వందన యోజన. ఈ పథకంలో వడ్డీ రేటు మొత్తం పదవీ కాలానికి నిర్ణయిస్తారు. ప్రస్తుతం 7.4 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. ఇన్వెస్ట్‌మెంట్ లిమిట్ రూ.15 లక్షలు, పదవీ కాలం పదేళ్లు ఉంటుంది.

మ్యూచువల్ ఫండ్స్ 

ఉద్యోగ విరమణ సమయంలో మ్యూచువల్ ఫండ్స్ కూడా మంచి ఇన్వెస్ట్‌మెంట్ ఎంపిక. మీరు డెట్ ఫండ్స్ లేదా హైబ్రిడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదంటే డెట్, ఈక్విటీల మిశ్రమంలో కూడా పెట్టుబడి పెట్టవచ్చు. ఈ నిధులు డివిడెండ్ లేదా వడ్డీ చెల్లింపుల రూపంలో ఆదాయాన్ని అందిస్తాయి. అయితే మ్యూచువల్ ఫండ్స్‌పై రాబడులు మార్కెట్ హెచ్చుతగ్గులకు లోబడి ఉంటాయి. రిస్క్ ఎక్కువగా ఉండడంతో ఆలోచించి ఇన్వెస్ట్ చేయడం బెటర్. 

Also Read: Karnataka Elections: కర్ణాటకలో ఎన్నికల జోరు.. తొలిసారి ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం   

జాతీయ పెన్షన్ పథకం

ఈ స్కీమ్‌లో పెన్షన్‌ రూపంలో ప్రతినెలా కొంత డబ్బును పొందొచ్చు. ఇది మార్కెట్ లింక్డ్ స్కీమ్. ఈ పథకంలో ఆదాయం మార్కెట్ హెచ్చుతగ్గులకు లోబడి ఉంటుంది. మీ రిస్క్‌పై ఆధారపడి ఈక్విటీ, డెట్ లేదా రెండింటి మిశ్రమంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎన్‌పీఎస్‌లో పెట్టుబడి పరిమితి మీ వయస్సు, ఆదాయంతో సహా వివిధ అంశాలకు లోబడి ఉంటుంది.

Also Read: Hyderabad Boy Murder: నరబలి కలకలం.. బాలుడు దారుణ హత్య.. ఎముకలు విరిచి, బకెట్‌లో కుక్కి..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News