UPI New Feature: స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరిగాక యూపీఐ చెల్లింపులు అధికమయ్యాయి. ప్రతి చిన్న చెల్లింపు కూడా యూపీఐతోనే చేస్తున్నారు. డిజిటల్ క్యాష్‌పైనే ఎక్కువగా ఆధారపడుతున్న పరిస్థితి. అందుకే ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పే వంటి చాలా యూపీఐలు అందుబాటులో ఉన్నాయి. తాజాగా ఆర్బీఐ యూపీఐ ద్వారా కొత్త సేవలు ప్రవేశపెడుతోంది. ఈసారి సరికొత్త ఫీచర్ తీసుకొస్తోంది.
యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్. క్షణాల్లో చెల్లింపులు పూర్తవుతుండటంతో అందరూ యూపీఐ చెల్లింపులనే ఆశ్రయిస్తున్నారు. ఆఖరికి పది రూపాయల చెల్లింపు అయినా యూపీఐనే వినియోగిస్తున్నా యూపీఐ సేవల్ని మరింత విస్తృతం చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త కొత్త ఫీచర్లు అందుబాటులోకి తెస్తోంది. తాజాగా మరో కొత్త ఫీచర్ వస్తున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. మూడ్రోజులపాటు జరిగిన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీలో యూపీఐ కొత్త ఫీచర్‌పై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఫీచర్ ద్వారా ఏటీఎం మిషన్‌లో నగదు డిపాజిట్ చేయవచ్చు. ఇప్పటివరకూ యూపీఐ ద్వారా ఏటీఎంలో నగదు విత్ డ్రాకు అవకాశముండేది. ఇప్పుడు డిపాజిట్ కూడా చేసుకునే సౌకర్యం రానుంది.
ప్రస్తుతం ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీలో యూపీఐ కొత్త ఫీచర్ గురించి నిర్ణయం తీసుకున్నారు. త్వరలో దీనికి సంబంధించి మార్గదర్శకాలు విడుదల కానున్నాయి. ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తే బ్యాంకింగ్ సేవలు మరింత సులువుగా మారనున్నాయి. బ్యాంకుల్లో క్యూ లైన్లలో నిలుచోవల్సిన అవసరముండదు. డెబిట్ కార్డు లేకుండానే కేవలం యూపీఐ స్కానర్ ఉపయోగించి క్యాష్ డిపాజిట్ చేయవచ్చు. ఇందుకు అనుగుణంగా ఏటీఎం మెషీన్ల టెక్నాలజీను అప్‌డేట్ చేయనున్నారు.
Also read: Amzon prime plans: అమెజాన్ నుంచి 4 అద్దిరిపోయే ఓటీటీ ప్లాన్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook