Renault offers: రెనో కార్లపై అదిరే ఆఫర్లు.. రూ.1.1 లక్షల వరకు డిస్కౌంట్లు

Renault offers: ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనో కొత్తగా కార్లు కొనే వ వారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది. మోడళ్ల వారీగా రూ.10 వేలు మొదలుకుని రూ.1.1 లక్షల వరకు తగ్గింపు ఇస్తోంది. వివిధ మోడళ్లపై ఆఫర్లు ఇలా ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 9, 2022, 03:38 PM IST
  • రెనో కార్లపై భారీ తగ్గింపు ఆఫర్లు
  • మోడళ్ల వారీగా రూ.10 వేల నుంచి తగ్గింపు మొదలు
  • డస్టర్ మోడల్​పై రికార్డు స్థాయిలో డిస్కౌంట్
Renault offers: రెనో కార్లపై అదిరే ఆఫర్లు.. రూ.1.1 లక్షల వరకు డిస్కౌంట్లు

Renault offers: కరోనా సంక్షోభం మొదలైనప్పటి నుంచి ఆటోమొబైల్ సంస్థలు కూడా విక్రయాల పరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో 2022-23లోనైనా మంచి విక్రయాలు సాధించాలని భావిస్తున్నాయి. ఇందుకోసం భారీ ఆఫర్లు ప్రకటించి విక్రయాలు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.

ఫ్రాన్స్​కు చెందిన రెనో.. డిస్కౌంట్లతో పాటు.. ఎక్స్ఛేంజ్​ బోనస్​, లాయలిటీ బోనస్​, కార్పొరేట్​ డిస్కౌంట్ల వంటివి ఇస్తోంది. ఆ డిస్కౌంట్ల వివరాలు ఉళా ఉన్నాయి.

మోడళ్ల వారీగా డిస్కౌంట్లు..

రెనో క్విడ్​: బడ్జెట్​ రేంజ్ కారు క్విడ్​పై రూ.10 వేలు (అప్​గ్రేడ్ వెర్షన్​పై రూ.5 వేలు). ఇస్తోంది. దీనితో పాటు లాయాలిటీ బోనస్​ కింద రూ.38 వేలు ప్రకటించింది. 0.8 లీటర్​ పెట్రోల్ వెర్షన్​పై రూ.10 వేల ఎక్స్ఛేంజ్​ బోనస్​.. 1.0 లీటర్​ పెట్రోల్ వెర్షన్​పై రూ.15 వేల వరకు ఎక్స్ఛేంజ్​ బోలస్​ ఇస్తోంది.

రెనో ట్రైబర్​​, కిగర్​..

రెనో ట్రైబర్​ మోడల్​పై రూ.10 వేల వరకు తక్షణ డిస్కౌంట్ ఇస్తోంది. ఎక్స్ఛేంజ్ ఇన్సెంటివ్​ కింద రూర.20 వేలు, లాయాలిటి బెనిఫిట్​ కింద రూ.44 వేల వరకు తగ్గింపు ఇస్తోంది రెనో. రోనా కిగర్​పై మోడల్​పై డిస్కౌంట్​, ఎక్స్ఛేంజ్​పై ఇన్సెంటివ్​లు లేవు. కానీ లాయాలిటి బెనిఫిట్​ కింద రూ.55,000 వరకు తగ్గింపు ఇస్తోంది.

రెనో డస్టర్​..

రెనోలో బెస్ట్​ సెల్లర్​ ఎక్స్​యూవీపై రికార్డు స్థాయిలో ఆఫర్ ప్రకటించింది. క్యాష్​ డిస్కౌంట్​ కింద రూ.50 వేలు, ఎక్స్ఛేంజ్ బోనస్​ కింద రూ.50 వేలు ఇస్తోంది కంపెనీ. లాయాలిటీ బెనెఫిట్స్​ ద్వారా మరో రూ.1.1 లక్షల వరకు తగ్గింపు పొందొచ్చు.

ఈ ఆఫర్లన్నింటితో పాటు కార్పొరేట్​ డిస్కౌంట్​ కింద రూ.30 వేలు (డస్టర్​కు మాత్రమే) ఇస్తోంది రెనో. ఇతర అనఅని మోడళ్లకు రూ.15 వల వరకు కార్పొరేట్​ డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిసింది. వీటన్నింటితో పాటు.. స్క్రాపింగ్ బోనస్​ కింద రూ.10 వేల ఇస్తోంది రెనో.

నోట్​: రెనో అందిస్తున్న ఈ ఆఫర్లు డీలర్లు, ప్రాంతాలను బట్టి మారుతాయి.

Also read: Indian Railways Concession: సీనియర్ సిటిజన్స్ కు గుడ్ న్యూస్.. రైలు ప్రయాణాలపై రాయితీ!

Also read: Tata Nexon EV: టాటా నెక్సాన్ ఈవీ కారు.. ఒక్కసారి చార్జింగ్​తో 400 కిమీ.. మరెన్నో కొత్త ఫీచర్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News