Jio Prepaid plans: జియోలో కస్టమర్లకు కావల్సిన అన్ని రకాల ప్లాన్స్ ఉంటాయి. డేటా కోసం, ఓటీటీ వంటి అదనపు ప్రయోజనాల కోసం, దీర్ఘకాలిక వ్యాలిడిటీ ప్లాన్స్ ఇలా చాలా ఉంటాయి. 84 రోజుల వ్యాలిడిటీతోనే 4-5 ప్లాన్స్ అందిస్తోంది. అంటే కస్టమర్ ఎంచుకునేందుకు ఆప్షన్లు ఎక్కువగా ఉంటాయి.
జియో 666 ప్లాన్‌లో రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో కలిగి ఉండి మొత్తం మీద 126 జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌకర్యంతో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పంపించుకోవచ్చు. ఈ ప్లాన్‌తో అదనపు ఓటీటీలు లభించవు గానీ జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ సేవలు పొందవచ్చు.
జియో 719 ప్లాన్‌లో రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ కూడా 84 రోజులే. మొత్తం 168 జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్, అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌకర్యముంటుంది. ఈ ప్లాన్‌లో కూడా జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్ సేవలు లబిస్తాయి.
జియో 739 ప్లాన్‌లో రోజుకు 1.5 జీబీ డేటా 84 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఇందులో కూడా జియో టీవీ, జియో క్లౌడ్, జియో సినిమాతో పాటు అదనంగా జియో సావన్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. ఇందులో కూడా అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ సౌకర్యం లభిస్తాయి.
జియో 789 ప్లాన్‌లో రోజుకు 2 జీబీ డేటాతో పాటు 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇందులో మొత్తం 168 జీబీ డేటా పొందవచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్ , అన్‌లిమిటెడ్ కాలింగ్ ఉంటాయి. జియో సావన్ ఉచిత సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. దాంతోపాటు జియో క్లౌడ్, జియో టీవీ, జియో సినిమా ఉచితంగా అందుతాయి.
జియో 999 ప్లాన్‌లో రోజుకు 3 జీబీ డేటా లభిస్తుంది. 84 రోజుల వ్యాలిడిటీతో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ సౌకర్యం లభిస్తాయి. మొత్తం ప్లాన్‌లో 252 జీబీ డేటా లభిస్తుంది. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ సేవలు పొందవచ్చు.
Also read: Ys Sharmila Tour: ఆర్డినరీ ఆర్టీసీ బస్సులో వైఎస్ షర్మిల ప్రయాణం, ప్రయాణీకులతో మాటామంతీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook