UPI News: గత రెండు మూడు సంవత్సరాలుగా ఇండియాలో యూపీఐ చెల్లింపులు భారీ ఎత్తున పెరిగాయి. డిజిటల్ ఇండియాలో భాగంగా యూపీఐ చెల్లింపులను కేంద్ర ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. యూపీఐ చెల్లింపుల వల్ల వినియోగదారులతో పాటు వ్యాపారులకు కూడా చాలా లాభం కలుగుతోంది.
యూపీఐ చెల్లింపులు ఈ 6మధ్య కాలంలో ఎక్కువ అవుతున్న నేపథ్యంలో వినియోగదారుల కోసం ఆర్‌బీఐ గతంలో యూపీఐ లైట్ ను అందుబాటులోకి తీసుకు రావడం జరిగింది. యూపీఐ లైట్ అంటే పిన్ ఎంటర్ చేయకుండానే అమౌంట్ ను అవతలి వారికి పంపించవచ్చు. పిన్ ఎంటర్ చేసే పక్రియకి కనీసం నిమిషం నుండి రెండు నిమిషాల సమయం పడుతుంది. కానీ యూపీఐ లైట్ ద్వారా సగం సమయం మాత్రమే పడుతుంది. యూపీఐ లైట్ చెల్లింపుల భద్రత తక్కువ కనుక లిమిట్ కూడా తక్కువ పెడుతూ ఆర్‌బీఐ అధికారులు లిమిట్ ను కేవలం రూ.200 లకు పరిమితం చేయడం జరిగింది. ఇప్పుడు యూపీఐ చెల్లింపుల విషయంలో చాలా మందికి క్లారిటీ వచ్చింది.
కనుక యూపీఐ చెల్లింపు దారులకు మరింతగా సౌకర్యంగా ఉండటం కోసం అని యూపీఐ లైట్ పరిమితిని రూ.500 లకు పెంచుతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. ఇకపై ఎలాంటి పిన్ ఎంటర్ చేయకుండా కొన్ని క్షణాల్లోనే రూ.500 వరకు చెల్లింపులు చేసుకునే విధంగా ఆర్‌బీఐ వారు తీసుకు వచ్చిన పరిమితితో వినియోగదారులకు మరియు వ్యాపారస్తులకు చాలా ఉపయోగదాయకం.
Also Read: RBI Repo Rate: గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్‌బీఐ.. రెపో రేటుపై కీలక నిర్ణయం
యూపీఐ లైట్ పరిమితి పెంచడం వల్ల ఫోన్ మిస్ అయినప్పుడు డబ్బులు దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని కొందరు ఆందోళన చెందుతున్నారు. ఆర్‌బీఐ యూపీఐ లైట్ లిమిట్ పెంచడంతో పాటు మరో కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. వడ్డీ రేట్లకు సంబంధించిన ముఖ్య ప్రకటన చేయడం జరిగింది. కీలక పాలసీ రేటు స్థిరంగానే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
పాలసీ రేట్లను స్థిరంగా కొనసాగిండచం అనేది వరుసగా మూడవ సారి. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ సారథ్యంలోని ఎంపీసీ కమిటీ తాజాగా పాలసీ సమీక్షలో రేటును నిలకడగానే కొనసాగించింది. రెపో రేటు 6.5 శాతం వద్దనే ఉంది. ఈ ఏడాది ఆరంభంలో రెపో రేటును ఆర్‌బీఐ పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏప్రిల్, జూన్ నెలలో జరిగిన భేటీలో రెపో రేటును స్థిరంగానే ఉంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి