RBI Penalty on Co-Operative Banks: నిబంధనలను ఉల్లంఘించిన నాలుగు సహకార బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొరడా ఝలిపించింది. రెండు రోజుల క్రితం 4 బ్యాంకులకు షాకిచ్చిన ఆర్‌బీఐ.. తాజాగా మరో 4 బ్యాంకులపై భారీ జరిమానా విధించింది. మంగళ్ కో-ఆపరేటివ్ బ్యాంక్, ది మహాబళేశ్వర్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్, ఇస్లాంపూర్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్, ది తపిందు అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకులపై పెనాల్టీ వేసింది. ఇందులో ఒకటి బీహార్‌కు చెందిన బ్యాంక్ కాగా.. మిగిలిన మూడు మహారాష్ట్రకు చెందినవి. నియంత్రణ లోపాల కారణంగా ఈ బ్యాంకులపై జరిమానా విధించినట్లు ఆర్‌బీఐ వెల్లడించింది.
పాట్నాలోని సహకార బ్యాంక్ తపిందు అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌పై లక్ష రూపాయల పెనాల్టీ వేసింది ఆర్‌బీఐ. ఎక్స్‌పోజర్ నిబంధనలు, చట్టబద్ధమైన/ఇతర లిమిట్స్ యూసీబీలు'పై నిబంధనలు పాటించనందుకు జరిమానా విధించింది. ప్రుడెన్షియల్ ఇంటర్-బ్యాంక్ ఎక్స్‌పోజర్ నిబంధనలపై ఆర్‌బీఐ ఆదేశాలను పాటించడంలో బ్యాంక్ విఫలమైనట్లు తెలుస్తోంది.
మహారాష్ట్రలోని ఇస్లాంపూర్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌పై 2 లక్షల రూపాయల జరిమానా ఆర్‌బీఐ విధించింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లోని నిబంధనలు, కేవైసీ మార్గదర్శకాలు నిబంధనలను సరిగా పాటించనందుకు జరిమానాకు గురైంది. అదేవిధంగా డిపాజిట్ ఖాతాల నిర్వహణను బ్యాంక్ ఉల్లంఘించడంతో భారీ ఫైన్ పడింది. బ్యాంక్ డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్‌కు కూడా ట్రాన్స్‌ఫర్ చేయలేదు. బ్యాంకులో పనిచేయని అకౌంట్లపై కూడా సమీక్ష నిర్వహించలేదని ఆర్‌బీఐ తనిఖీల్లో తేలింది.
మహాబలేశ్వర్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకుపై కూడా రూ.2 లక్షల జరిమానా విధించింది. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం-1949 కింద కింద ఆదేశాలను ఉల్లంఘించినందుకు ఫైన్ వేసింది. మంగళ్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఇన్ ఆపరేటివ్ అకౌంట్ల వార్షిక సమీక్షను నిర్వహించనందుకు రూ.లక్ష పెనాల్టీ వేసింది. అయితే బ్యాంకులపై జరినామా విధించగా.. కస్టమర్లపై భారం పడుతుందా..? అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ జరిమానా వినియోగదారులపై ఎలాంటి ప్రభావం ఉండదు. ఈ పెనాల్టీలను కేవలం బ్యాంకులే చెల్లించాల్సి ఉంటుంది. ఖాతాదారుల నుంచి వసూలు చేయడానికి వీల్లేదు.
Also Read: US Cyclone: అమెరికాను వణికిస్తున్న భారీ తుపాను, అంధకారంలో ఉత్తర అమెరికా రాష్ట్రాలు
Also Read: Minister Harish Rao: ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ఈ నెల 16 నుంచి రూ.లక్ష పంపిణీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
RBI Penalty On Banks: ఈ నాలుగు బ్యాంకులకు షాకిచ్చిన ఆర్‌బీఐ.. ఇందులో మీకు అకౌంట్ ఉందా..?