Reserve Bank of India: గత రెండు దశాబ్దాలుగా బ్యాంకింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఆ మార్పులకు తగ్గట్లుగా అభివృద్ది చెందని బ్యాంకులను.. అనవసరంగా ఉన్న బ్యాంకుల లైసెన్స్ ను రద్దు చేస్తున్నట్లుగా ఆర్బీఐ అధికారులు ప్రకటించిన విషయం తెల్సిందే. ఇప్పటికే కొన్ని బ్యాంక్ లను రద్దు చేసి ఇతర బ్యాంకులతో మర్జ్ చేయడం జరిగింది.
మరో వైపు కొన్ని బ్యాంక్ లను పూర్తిగా రద్దు చేసి ఆ బ్యాంక్ ఖాతాదారులకు సెటిల్ చేసి మొత్తం ఖాతాలను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు రెండు బ్యాంకుల లైసెన్స్ ను పూర్తిగా రద్దు చేసి ఆ బ్యాంకుల్లో ఉన్న ఖాతాదారులకు సెటిల్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం తో ఆ బ్యాంకులకు చెందిన ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముందు ముందు కూడా వారికి తమ ఖాతాకు సంబంధించిన లావాదేవీలు ఇతర బ్యాంకులతో జరుపుకునే అవకాశాలు లేవని తేలిపోయింది.
ఆర్బీఐ లైసెన్స్ రద్దు చేసిన బ్యాంకుల వివరాలకు వెళ్తే.. శ్రీ శారదా మహిళా కో ఆపరేటివ్ బ్యాంక్. ఇది కర్ణాటక తుమకూరు నుండి నడుస్తోంది. మరోటి మహారాష్ట్ర సతారాలోని వాయ్ కేంద్రంగా పని చేస్తున్న హరి హరేశ్వర్ సహకార బ్యాంక్. ఈ రెండు బ్యాంకులకు చెందిన కార్యక్రమాలను జులై 11వ తారీకు నుండి నిలిపి వేస్తున్నట్లుగా ఆర్బీఐ అధికారులు అధికారికంగా ప్రకటించారు.
ఆ బ్యాంకుల లైసెన్స్ రద్దు నేపథ్యంలో మొదటే ఖాతాదారులకు సెటిల్ చేయడం పట్ల అధికారులు బ్యాంక్ సిబ్బంది చర్యలు తీసుకున్నారు. సేవింగ్స్ మొదలుకుని ప్రతి ఒక్క అకౌంట్ ను కూడా రద్దు చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.
Also Read: Aadhaar Card, PAN Card Linking: ఆధార్, పాన్ లింక్ చేయని వారికి ఎదురయ్యే సమస్యలు
హరిహరేశ్వర్ సహకార బ్యాంక్ డిపాజిటర్లలో 99.96 శాతం మందికి వారి వారి డబ్బు పూర్తిగా చెల్లించడం జరిగిందని.. ఇంకా కూడా కొంత మందికి చెల్లింపులు జరుగుతున్నట్లుగా ఆర్బీఐ ప్రకటించింది. ఇక శ్రీ శారదా మహిళ బ్యాంక్ కి చెందిన డిపాజిటర్ల లో 97.82 శాతం మంది డిపాజిటర్లు తమ డబ్బు తిరిగి పొందుతారు అంటూ ఆర్‌బీఐ అధికారులు ప్రకటించారు. మొత్తానికి ఈ రెండు బ్యాంకులను మూసి వేయడంకు కారణం మూల ధనం కలిగి లేక పోవడంతో పాటు ఖాతాదారులకు సమర్థవంతంగా సేవలు అందించలేక పోవడం అంటూ అధికారులు తెలియజేశారు.
ముందు ముందు మరిన్ని బ్యాంకు లు కూడా కనిపించకుండా పోతాయి అంటూ ఆర్‌బీఐ అధికారులు పేర్కొన్నారు. ఖాతాదారులు వెంటనే ఈ విషయాన్ని గుర్తించి తమ ఖాతాల్లో డబ్బు ఇంకా ఇతర లావాదేవీలను ముగించుకుంటే బెటర్. కాస్త ఆలస్యం అయితే పూర్తిగా బ్యాంక్ లు కనిపించకుండా పోతాయి. అప్పుడు ఎంత మొత్తుకున్నా లాభం ఉండదు.
Also Read: హాలీవుడ్ రేంజ్ లో 'గాండీవధారి అర్జున' ప్రీ-టీజర్.. వరుణ్ దుమ్ములేపేడుగా...!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook