Poco M6 Plus 5G: చైనా బ్రాండ్‌లకు సంబంధించిన స్మార్ట్‌ఫోన్స్‌కి భారత మార్కెట్‌లో మంచి గుర్తింపు ఉంది. కొన్ని కంపెనీలు అతి తక్కువ ధరల్లోనే ఎక్కు ఫీచర్స్ కలిగిన మొబైల్స్‌ను విక్రయించడంతో చాలా మంది వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడంలో POCO కంపెనీ ఎప్పుడు ముందుంటుంది. ఇటీవలే మార్కెట్‌లో లాంచ్ చేసిన మొబైల్స్‌కి మంచి గుర్తింపు లభించడంతో కంపెనీ మరో ముందడుగు వేసింది. త్వరలోనే మరో M సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతోంది. ఇది POCO M6 ప్లస్ 5G పేరుతో అందుబాటులోకి రాబోతోంది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) సర్టిఫికేషన్‌లో గుర్తించినట్లు తెలుస్తోంది. ఇది 24065PC95I మోడల్‌లో గ్లోబల్ లెవల్‌లో అందుబాటులోకి రానుంది. దీనిని కంపెనీ వచ్చే నెలలో విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఇది Redmi Note 13R స్మార్ట్‌ఫోన్‌కి రీబ్రాండెడ్ వెర్షన్‌గా కంపెనీ అందుబాటులోకి తీసుకు రాబోతోంది. కంపెనీ ఈ మొబైల్‌కి సంబంధించిన ధరను కూడా వెళ్లడించే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
POCO M6 ప్లస్ 5G స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, స్పెషిఫికేషన్స్:
ఈ POCO M6 ప్లస్ 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఇది ఎంతో శక్తివంతమైన 6.79-అంగుళాల IPS డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్ Qualcomm Snapdragon 4 Gen 2 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. అలాగే 12GB ర్యామ్‌తో పాటు 512GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందుబాటులోకి రానుంది. ఇవే కాకుండా కంపెనీ ఇందులో అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుందని టిప్‌స్టర్ తెలుపుతున్నారు.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన సాఫ్ట్‌వేర్ వివరాల్లోకి వెళితే, ఇది POCO M6 ప్లస్ 5G మొబైల్ Android 14-ఆధారిత HyperOSపై రన్ అవుతుంది. అలాగే ఎంతో శక్తివంతమైన 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. అలాగే అద్భుతమైన 5,030mAh బ్యాటరీ సెటప్‌తో లభిస్తోంది. దీంతో పాటు 50MP ప్రధాన కెమెరాతో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా 8MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి