Industrial Production for October marginally eased: దేశీయంగా పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ) స్వల్పంగా తగ్గింది. అక్టోబర్లో 3.2 శాతానికి తగ్గినట్లు కేంద్ర గణాంకా కార్యాలయం (ఎన్ఎస్ఓ) శనివారం ప్రకటించింది. సెప్టెంబర్‌లో పారిశ్రామికోత్పత్తి 3.30 శాతం (Industrial Production September) వద్ద ఉంది.
బేస్ ఎఫెక్ట్ అధికంగా ఉండటం, సెమీ కండక్టర్ల కొరత వంటివి (Semiconductor shortages) పారిశ్రామికోత్పత్తి తగ్గేందుకు కారణాలుగా వెల్లడించింది ఎన్ఎస్ఓ. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే కూడా.. ఐఐపీ తగ్గినట్లు వివరించింది. 2021 అక్టోబర్లో పారిశ్రామికోత్పత్తి 4.5 శాతంగా ఉండటం గమనార్హం.
రంగాల వారీగా ఇలా..
మైనింగ్, తయారీ, విద్యుత్ ఉత్పాదన రంగాల పారిశ్రామికోత్పత్తి.. ఈ ఏడాది అక్టోబర్లో వరుసగా 109.7, 134.7, 167.3 వద్ద ఉన్నట్లు తెలిపింది ఎన్ఎస్ఓ.
గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే మైనింగ్ (Industrial Production for the Mining) విభాగం -1 శాతం నుంచి 11.4 శాతానికి పెరిగింది. తయారీ రంగం మాత్రం గత ఏడాది 4.5 శాత నుంచి 2 శాతానికి పడిపోయింది. విద్యుత్ ఉత్పాత విభాగ కూడా 11.2 శాతం నుంచి 3.1 శాతానికి తగ్గింది.
మౌలిక వసతులు, నిర్మాణ రంగ గూడ్స్ తయారీ ఉత్పత్తిలో గత ఏడాదితో పోలిస్తే.. 10.9 శాతం నుంచి 5.3 శాతానికి తగ్గింది.
కన్య్యూమర్ డ్యూరబుల్స్ ఉత్పత్తుల తయారీ కూా 18.1 శాతం నుంచి -6.1 శాతానికి పడిపోయింది.
Also read: Amazon mobile sale: అమెజాన్ భారీ ఆఫర్- రూ.48 వేల స్మార్ట్‌ఫోన్ రూ.27 వేలకే!
Also read: LPG Booking Offer: పేటీఎంలో గ్యాస్ బుక్ చేస్తే రూ.2700 క్యాష్‌బ్యాక్- పే లేటర్ ఆప్షన్ కూడా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
October IIP: అక్టోబర్లో తగ్గిన పారిశ్రామికోత్పత్తి- కారణాలివే..
అక్టోబర్లో తగ్గిన పారిశ్రామికోత్పత్తి
సెమీ కండక్టర్ల కొరతే ప్రధాన కారణం
అన్ని రంరాల్లోనూ క్షీణత నమోదు